🌺🙏ఓం నమో భగవతే వాసుదేవాయ🙏🌺
🌷 message of the day 🌷
🌾
🌴" పూర్వం తల్లులే పిల్లలకు అక్షరాభ్యాసము అనే పవిత్ర కార్యమును ఘనంగా జరిపించేవారు. మొదట వారికి నేర్పేది 'ఓం నమః శివాయ' అని. అనగా, విద్యాభ్యాసము దైవనామంతో ప్రారంభమయ్యేది. కానీ, ఈనాడు తల్లులు అర్థంపర్థంలేని 'బా....బా... బ్లాక్ షీప్...' వంటివి చెప్పిస్తున్నారు. పూర్వం తీరిక సమయంలో నీతికథలను చెప్పేవారు. బాల్యదశలోనే దైవప్రీతి, పాపభీతి, పెద్దలపట్ల గౌరవము మొదలగు విలువలను అలవరచేవారు. కానీ, ఈ ఆధునిక యుగంలో తల్లులు బిడ్డల పరిరక్షణను ఆయాలకు అప్పజెప్తున్నారు. క్రమక్రమేణ బిడ్డలకు ఆయా పట్లనే ప్రేమ. ఆమె కనిపించకపోతే ఏడుస్తారు. తల్లి లేకపోయినా పరవాలేదు!. మరికొందరు తల్లులు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి పనులు చేస్తుంటారు. టీవీ చూస్తూ చూస్తూ పిల్లలు కూడా టీవీ బిడ్డలుగా మారుతారు. ఈనాటి పిల్లలకు టీవీ ప్రభావంవలన అనవసరమైన తెలివితేటలు పెరిగిపోతున్నాయి, గుణములు తరిగిపోతున్నాయి. తల్లులపట్ల ప్రేమ తరిగిపోతోంది. ఈనాటి తల్లులు తమ పిల్లలు గొప్పవారు కావాలని, గొప్ప పదవులు ఏలాలని ఆశిస్తున్నారేగానీ, మంచివారు కావాలని ఆశించడం లేదు. కొంతమంది తల్లులు, పిల్లలు ఆధ్యాత్మికమార్గమందు ప్రవేశిస్తే, “అయ్యో, నా బిడ్డ ఏమైపోతాడో" అని దిగులు చెందుతారు. ఇలాకాదు, నేటి తల్లులు తమ స్థానమును గుర్తించి తమ పిల్లల పట్ల బాధ్యతలను చక్కగా నెరవేర్చగలగాలి. అపుడే తల్లితనమునకు సార్థకత చేకూర్చినవారవుతారు." 🌴
Source - Whatsapp Message
🌷 message of the day 🌷
🌾
message from God
🌾🌴" పూర్వం తల్లులే పిల్లలకు అక్షరాభ్యాసము అనే పవిత్ర కార్యమును ఘనంగా జరిపించేవారు. మొదట వారికి నేర్పేది 'ఓం నమః శివాయ' అని. అనగా, విద్యాభ్యాసము దైవనామంతో ప్రారంభమయ్యేది. కానీ, ఈనాడు తల్లులు అర్థంపర్థంలేని 'బా....బా... బ్లాక్ షీప్...' వంటివి చెప్పిస్తున్నారు. పూర్వం తీరిక సమయంలో నీతికథలను చెప్పేవారు. బాల్యదశలోనే దైవప్రీతి, పాపభీతి, పెద్దలపట్ల గౌరవము మొదలగు విలువలను అలవరచేవారు. కానీ, ఈ ఆధునిక యుగంలో తల్లులు బిడ్డల పరిరక్షణను ఆయాలకు అప్పజెప్తున్నారు. క్రమక్రమేణ బిడ్డలకు ఆయా పట్లనే ప్రేమ. ఆమె కనిపించకపోతే ఏడుస్తారు. తల్లి లేకపోయినా పరవాలేదు!. మరికొందరు తల్లులు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి పనులు చేస్తుంటారు. టీవీ చూస్తూ చూస్తూ పిల్లలు కూడా టీవీ బిడ్డలుగా మారుతారు. ఈనాటి పిల్లలకు టీవీ ప్రభావంవలన అనవసరమైన తెలివితేటలు పెరిగిపోతున్నాయి, గుణములు తరిగిపోతున్నాయి. తల్లులపట్ల ప్రేమ తరిగిపోతోంది. ఈనాటి తల్లులు తమ పిల్లలు గొప్పవారు కావాలని, గొప్ప పదవులు ఏలాలని ఆశిస్తున్నారేగానీ, మంచివారు కావాలని ఆశించడం లేదు. కొంతమంది తల్లులు, పిల్లలు ఆధ్యాత్మికమార్గమందు ప్రవేశిస్తే, “అయ్యో, నా బిడ్డ ఏమైపోతాడో" అని దిగులు చెందుతారు. ఇలాకాదు, నేటి తల్లులు తమ స్థానమును గుర్తించి తమ పిల్లల పట్ల బాధ్యతలను చక్కగా నెరవేర్చగలగాలి. అపుడే తల్లితనమునకు సార్థకత చేకూర్చినవారవుతారు." 🌴
Source - Whatsapp Message
No comments:
Post a Comment