Sunday, January 31, 2021

మాతృఋణం-తల్లిదండ్రులను చాలా బాగా చుాసుకుంటున్న కొడుకులు అందరికీ ఈ కథ అంకితం

👌 మాతృఋణం👏
==================
"రవీ! పెళ్లి కేన్సిల్ చేసావా?? నాకు ఒక్క మాట చెప్పకుండా ఎంత పని చేశావురా?? ఇప్పుడు పెళ్లి కేన్సిల్ చేయవలసిన అవసరం... ఏమివచ్చింది...

కావాలంటే ఒకసారి నేను వెళ్లి వాళ్లతో మాట్లాడి అన్నీ విషయాలు...చెప్పేవాడిని కదా!!

కుదరక... కుదరక... కుదిరిన పెళ్లి సంబంధాన్ని కాలదన్నుకున్నావు. నీకు అంత తొందర పాటు ఏమిటి?? నాతో ఒకసారి ఆలోచించాలి కదా"!! బయటనుంచి వస్తుా నాతో ఆవేశంగా ఆరిచాడు... మావయ్య...

"నీకు తెలుసు కదా మావయ్యా!! పదిరోజుల కిందట ఏం జరిగిందో ఆ ప్రమాదం ఎలా జరిగిందో?? ఎందుకు జరిగిందో?? అర్దం కాకుండా అయింది. ఆ సంఘటన జరిగినప్పుడు నేను ఇంట్లోనే వున్నాను కాబట్టి సరిపోయింది...

సాయంత్రం అమ్మ తులసి మెుక్క దగ్గర దీపం పెట్టింది. ఎలా అంటుకుందో ఏమెా దీపం చీర కొంగుకు అంటుకుంది. అమ్మ ముందు చూసుకోలేదు. తరువాత శరీరానికి వేడి అంటుకుని కేకలు వేసింది..

అప్పుడు నేను రుామ్ లో నుంచి పరుగెత్తుకు వచ్చాను.అప్పటికే మంటలు పైకి వచ్చాయి. నాకు ఒక్క క్షణం కాళ్ళు, చేతులు ఆడలేదు. ఒళ్లంతా ఒకటే వణుకు. ఆ టైమ్ లో ఏం చేయాలి ? మైండ్ అంతా బ్లాంక్ అయిపోయింది.

నాకు ప్రియమైన వాళ్ళు నా కళ్ల ముందే అగ్నిలో దహనమై పోతుంటే నాకు కళ్లు---బైర్లు కమ్మాయి. ఏం చేయాలి?? ఎలా ఈ ప్రమాదం నుంచి బయట పడెయ్యాలి??షాక్ తో నాకు నోటివెంట ఒక్క మాట రాలేదు...

అక్కడ బియ్యం బస్తా వుంటే బియ్యం కింద వంపేసి ఆ బస్తాతో అమ్మ శరీరాన్ని చుట్టేసి గట్టిగా పట్టుకుని నిలబడ్డాను. మంటలు కంట్రోల్ అయ్యాయి."

అప్పుడు హస్పటల్ కు తీసుకెళ్లాను...వెంటనే హాస్పటల్ కి తీసుకెళ్ళాను కాబట్టి. ప్రాణాపాయం తప్పిందన్నారు డాక్టర్స్.

"శరీరం మండుతుంది మంట తట్టుకోవడం కష్టం. చాలా...బాధ భరించాలి. ఆవిడను చాలా..
జాగ్రత్త గా చూసుకోవాలి"అని డాక్టర్ మరీ మరీ... చెప్పారు...

రేపు డిశ్చార్జి చేస్తారు నర్స్ రోజూ వచ్చి డ్రెస్సింగ్ చేసి ఇంజక్షన్ ఇవ్వడానికి మాట్లాడాను"...

"అవన్నీ నాకుా తెలుసు. నువ్వు ఫోన్ చేయగానే నేను పరుగెత్తుకు...వచ్చేనుకదా"! మధ్యలో అడ్డు తగిలాడు మావయ్య..

"ఈ పెళ్లి అయిపోతే ఆ అమ్మాయి నీకు అన్ని విషయాల లోను హెల్ప్ గా వుంటుంది. ఇప్పుడు నువ్వు ఒక్కడివే అమ్మని ఎలా చుాసుకోగలవూ??

ఆ అమ్మాయి కూడా వస్తే నువ్వు ఆఫీసు కి వెళ్ళి నపుడు తను అమ్మని చూసుకుంటుంది కదా"!! అని మావయ్య అన్నాడు...

"ఇప్పుడు మా అమ్మ ని గాజుబొమ్మ లా చూసుకోవాలి. ఈ టైమ్ లో నేను పెళ్లి చేసుకుంటే, ఒక వేళ నాకు తెలియకుండానే... నాలో స్వార్ధం పెరిగిపోయి అమ్మను సరిగ్గా చుాసుకొలేక పోతేనో??

నేను అమ్మతోటే ఉండిపోతే, అప్పుడు ఆ అమ్మాయికి కూడా పూర్తి...న్యాయం చేయలేను కదా? అమ్మ రేపు హస్పటల్ నుంచి డిశ్చార్జి అవుతోంది...

ప్రస్తుతం నేను ఆఫీసుకి లీవ్ పెట్టాను. అమ్మ తేరుకునేవరకు నేను ఆఫీసుకు వెళ్లను ఆఫీసులో అన్ని నెలలు శెలవు ఇవ్వకపోతే--- జాబ్ కి కూడా రిజైన్ చేసేస్తాను. ఇప్పుడు వున్న ప్రస్థుత పరిస్థితుల్లో, నాకు అన్నిటికన్నా మా అమ్మ ఆరోగ్యం ముఖ్యం"...

"ఇదివరకటిలా మా అమ్మ మామూలుగా లేచి తిరుగుతూ సంతోషంగా వుండాలి. దాని కోసం నేను ఏం చేయడానికి అయినా సిద్ధంగా వున్నాను..

ఇంకో సంబంధం చూసుకోండి, నాకు సెట్ అవ్వ డానికి టైమ్---పడుతుంది. మిమ్మల్ని అంతవరకు ఆగమనడం కూడా భావ్యం కాదు.... అని పెళ్లి వారికి ఫోన్ చేసి చెప్పేసాను"...

"పొరపాటు చేసావురా! మంచి సంబంధం అమ్మాయి బుద్ధి మంతురాలు!! అని మేమంతా ఎంతో సంతోష పడ్డాము." మావయ్య బాధగా అన్నాడు.

"ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నావు మావయ్యా! ఈ ముహూర్తానికే నేను పెళ్లి చేసుకుంటే కొత్త పెళ్లి కూతురు, రాగానే అత్త గారికి సేవ చేయమంటే చేస్తుందా ?? అయినా అలా చేయమనడం కూడా భావ్యం కాదు కదా? తన కెన్నో ఆశలు, కోరికలు వుంటాయి వాటికోసం నేను సమయం కేటాయించి నెరవేర్చలేను...

కొత్తలోనే మామధ్య అభిప్రాయ బేధాలు, గొడవలు మెుదలు అవుతాయి...మా అమ్మ శరీరం కాలి ఇంతగా బాధ పడుతూ వుంటే.. నేను పెళ్లి చేసుకుని నా సుఖం నన్ను చూసుకోమంటావా??..

మావయ్యా !! ఈ విషయం ఇక్కడితో వదిలేద్దాం.. ఇక మనిద్దరి మధ్య ఈ టాపిక్ మరో సారి తలెత్తకూడదు" అనేసి అక్కడ నుంచి లేచి వెళ్లి పోయాను...

"అమ్మా! నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు.. ఇదుగో నీ మంచం పక్కనే నేను కూడా కింద పక్క వేసుకొని పడుకుంటాను. ఏం కావాలన్నా నన్ను లేపు." బాత్రూం వస్తే చెప్పు.యుారిన్ పేన్ పెడతాను.ఇబ్బంది పడకు.

ఇంతలో అమ్మ ఏడుస్తూ వున్న శబ్దం వినిపించింది."ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా!? గాయాలు మండుతున్నాయా?? విసనకర్రతో విసరనా?? లేక ఆయింట్ మెంట్ రాయనా???" కంగారుగా అన్నాను నేను...

"నీ సంతోషకరమైన జీవితానికి నేను అడ్డంకిగా వున్నానురా నాన్నా !....ఆ ప్రమాదం లో నేను పోయినా బాగుండేదేమో? నాకోసం నువ్వు ఎన్ని కష్టాలు పడుతున్నావు రవీ..

మీ ఆఫీసులో అన్ని రోజులు లీవ్ ఇస్తారా ??
ఆవేశంలో, బాధలో ఉద్యోగాన్ని కూడా, పట్టించు కోవటం లేదు. నీ పెళ్లిని కూడా క్యాన్సిల్ చేసుకుంటున్నావు. నావల్ల నీకు ఇన్ని కష్టాలు అవసరమా ?? నన్ను వదిలేసేయి కన్నా... నా బాధలేవో నేను పడతాను. నీ జీవితాన్ని నువ్వు చూసుకో..

నా కోసం ఆలోచించి నీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకోకు నీకు ఇంకా ఎంతో జీవితం వుంది... ఎన్నో మంచి రోజులు ఉన్నాయి.. ఇలా నాకోసం వృధా చేసుకోకు" అని అమ్మ బాధపడ సాగింది .

"అమ్మా! అలా ఎలా మాట్లాడగలుగుతున్నావు ? నాన్న నా చిన్నప్పుడే చనిపోతే నువ్వు ఒక్కదానివే కష్టపడి నన్ను చదివించి నా అవసరాలను తీరుస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకు వచ్చావు. నేను ఈ రోజు ఇలా నీ ముందు ఉన్నానంటే అందుకు కారణం నువ్వే!!

అలాంటిది నువ్వు కష్టంలో ఉంటే నిన్ను ఎలా వదిలేస్తాను అమ్మా"!!
అని నేను అంటుండగానే అసంకల్పితంగా నా కనుకొనుకుల్లోకి కన్నీరు చేరి వెచ్చగా చెంపల మీదికి జారిపోతున్నాయి...

మరుసటి రోజు హాస్పిటల్ నుండి ఒక నర్సు ఇంటికి వచ్చి రోజుకు రెండుసార్లు కాలిన చోట ఆయింట్ మెంట్ రాసి, డ్రెస్సింగ్ చేసి, బట్టలు మార్చి,ఇంజక్షన్ చేసి వెళుతోంది...

అమ్మకి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ నేనే చేస్తూ తనకి వంట చేసి పెట్టి తినిపిస్తూ,పోషకాహారం అయిన జ్యూసులు అవీ తాగిస్తూ, అన్ని రకాలుగా సేవలు చేస్తున్నాను...

అమ్మ దగ్గరే వుండి చిన్నప్పుడు జరిగిన విషయాలు అన్నీ చెప్పి నవ్విస్తున్నాను. ఒక్క క్షణం కుాడా అమ్మ ని ఒంటరిగా వదలటలేదు...

నాకు సాధ్యం అయినంత వరకు అమ్మకి దిగులు, బాధ, భయం లేకుండా తన దగ్గరే వుంటుా తన శారీరక బాధలు నుంచి ఉపశమనం కలిగేలా జాగ్రత్త లు తీసుకుంటున్నాను...

అమ్మకి భగవద్గీత, సాయిబాబా జీవిత చరిత్ర , దత్తాత్రేయ పారాయణం చదివి వినిపించే వాడిని. మధ్య మధ్యలో పేక ఆడుతుా, చదరంగం ఆడుతుా, అమ్మకి బోర్ కొట్టకుండా చుాసుకుంటున్నాను.

ఇలా చూస్తుండగానే నాలుగు నెలలు గడిచిపోయాయి. అమ్మ క్రమంగా కోలుకోసాగింది. అమ్మ ఆరోగ్యం మెరుగు పడింది తన పనులు తాను చేసుకో సాగింది. గాయాలు తగ్గుముఖం పట్టాయి తనంతట తాను బాత్రూంకి వెళ్ల గలుగుతోంది...

ఒకరోజు డాక్టర్ చెకప్ కోసం హాస్పిటల్ కి వెళ్తే, డాక్టర్ ఆమెను చూసి ఆశ్చర్యపోయారు. "మీరు ఇంత ఫాస్ట్ గా రికవర్ అవుతారని మేము ఊహించలేదు.

ఇదంతా మీ అబ్బాయి చలువ వల్లనే జరిగింది అతను మిమ్మల్ని ఎంతో బాగా ప్రేమగా, జాగ్రత్తగా కంటిరెప్పలా చూసుకున్నాడు అందుకే మీరు ఇంత తొందరగా కోలుకున్నారు" అని డాక్టర్లు నన్ను మెచ్చుకుంటుంటే, అమ్మ నావైపు ప్రేమగా గర్వంగా చూసింది . అప్పుడు నా తల్లి కళ్ళల్లో పుత్రోత్సాహం కనిపించింది...

"మీరు చెప్పినట్లు నిజంగానే నా కొడుకు వల్లనే కదా మళ్ళీ నాకు పునర్జన్మ లభించింది.. వీడే లేకపోయి ఉంటే నేను ఈ పాటి కి ఎలాంటి పరిస్థితుల్లో ఉండేదాన్నో ఊహించుకోలేను" అంటూ నన్ను ప్రేమతో దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకుంది అమ్మ...

అమ్మకి కొంత నయం అవ్వగానే నేను మళ్ళీ ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టాను. అదృష్టవశాత్తూ నాకు తొందర్లోనే మంచి కంపెనీలోనే ఉద్యోగం వచ్చింది...

ఇంట్లో అమ్మకోసం ఒక ఆయాను మాట్లాడి, వంటపనికీ, ఇంటిపనికీ మనిషిని కుదుర్చుకున్నాను...

ఈలోగా పెళ్లి సంబంధం వాళ్ళనుంచి,అందులోనూ.. ఆ అమ్మాయి నుంచి ఫోన్ వచ్చింది.
"ఇదేంటి ఈ అమ్మాయి ఇప్పుడు ఫోన్ చేస్తోంది? బహుశా తనకి పెళ్లి కుదిరింది ఏమో !! ఆ విషయం నాకు చెప్పడానికి ఫోన్ చేసినట్టు వుంది...అనుకుని ఫోన్ తీసాను..

అప్పుడు ఆ అమ్మాయి "మీ అమ్మగారికి ఆరోగ్యం ఎలా ఉంది ? కొంచెం నయం అయిందా ?? ఒకసారి చుాడ్డానికి వద్దాం అనుకుంటున్నాను...ఈ సండే రోజున రావచ్చా"??" అని అడిగింది...

"ఇప్పుడు అమ్మకి బాగానే ఉంది తప్పకుండా రండి మీరు అందరూ ఎలా ఉన్నారు? పెళ్లి అయ్యిందా? " అని అడిగాను...

దానికి ఆ అమ్మాయి" మిమ్మల్ని కలవడానికి వచ్చినప్పుడు చెప్తాను!! ఉంటాను" !!!" అని ఫోన్ పెట్టేసింది...

ఆ సండే రోజు ఆ అమ్మాయి ఇంటికి వచ్చింది. అన్నీ రకాలు పళ్లు, స్వీట్లు , బిస్కెట్లు తీసుకుని వచ్చింది.

ఆ అమ్మాయి తన తల్లిని చూసి కాళ్లకు నమస్కారం పెట్టి"ఆరోగ్యం ఎలా ఉంది ఆంటీ"?? అంటూ క్షేమసమాచారాలు అడిగింది.

తను నాకేసి తిరిగి "మీరు మాకు ఫోన్ చేసి అలా చెప్పినప్పుడు, మేము ఆశ్చర్య పోయాము. తరువాత మీ మావయ్య గారు, మా ఇంటికి వచ్చి జరిగినదంతా మాతో చెప్పారు...

మీ అమ్మగారిని మీరు ఎంత బాగా చూసుకుంటున్నారో తెలిసాక.. పెళ్లి చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి... ఇంకా ఎవరిని చేసుకో కూడదు అని నిర్ణయించుకుని, అదేమాట మా నాన్నకి కచ్చితంగా చెప్పేసాను"...

"తల్లి తండ్రులును ఓల్డ్ ఏజ్ హొమ్ లలో జాయిన్ చేసిన పిల్లలను చుాసేను గానీ , తల్లి కోసం జాబ్ నూ, పెళ్లినీ కూడా వదులు కోవడానికి సిద్ద పడ్డ మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా అనిపించింది...

తల్లిని ఇంత బాగా చూసుకుంటున్న వాళ్ళు భార్యని ఇంకెంత బాగా చూసుకుంటారో కదా?అందుకే ఎన్ని నెలలు అయినా మీ కోసమే ఎదురు చూస్తూ....ఉండాలని అప్పుడే నిర్ణయించుకున్నాను...

మీ అమ్మగారికి పూర్తిగా నయం అయ్యాక, ఆవిడ ఆరోగ్యంగా లేచి తిరిగినప్పుడు మనం పెళ్లి చేసుకుందాం. నేను మీ అమ్మ గారిని మా అమ్మ లాగా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను ప్రామిస్!! " అని నా చేతిలో చేయి వేసింది...

అందుకు అమ్మ ఎంతో సంబరపడిపోయి "ఇలాంటి కోడలి కోసమే నేను ఎదురు చూస్తున్నాను. వాడి మంచి మనసుకు తగినట్లుగా నువ్వు సరియైన అర్థాంగి అవుతావు.మీరిద్దరూ కలకాలం సుఖంగా సంతోషంగా పిల్లాపాపలతో వుండాలని ఆ భగవంతుడుని కోరుకుంటున్నాను...

ఇప్పుడు నేను ఆరోగ్యం గానే ఉన్నాను..ఇంకా ఆలస్యం చేయకండి. నా కోసం పెళ్లి కేన్సిల్ చేసుకున్నాడని తెలిసిన దగ్గర నుంచీ చాలా బాధ పడుతున్నాను..ఇప్పుడు మనసులో వున్న బాధంతా మాయమైంది చాలా సంతోషంగా వుంది" మీరు వెంటనే పెళ్లి చేసుకోండి...అని చెప్పింది..

నాకు కుాడా చాలా సంతోషంగా అనిపించి వెంటనే ఒప్పేసుకున్నాను. "ఇన్ని రోజులు మాలో కలసిపోయే అమ్మాయి దొరికితే చాలు, మమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళం నువ్వు మా ఇంటి దేవత లాగా వచ్చి మమ్మల్ని ఇంత బాగా చూసుకుంటాను అంటే ఇంతకు మించిన ఆనందం ఉంటుందా!!

అయితే చిన్న కండీషన్ పెళ్లి ఆర్భాటంగా వద్దు. సింపుల్ గా చేసుకుని,ఆ డబ్బుతో పేదవాళ్లకి అన్నదానం చేసి బట్టలు పంచుదాము. సరేనా"!! అన్నాను.

"ఇంత మంచి మనసున్న మీరు ఏం చెప్పినా సరే ! మాకు అంగీకారమే." అంటూ అప్పటి వరకూ గుమ్మం బయటే నిలబడిన నా కాబోయే మామగారు నా మేనమామతో కలసి ఇంట్లోకి అడుగు పెట్టారు...

👌 తల్లిదండ్రులను చాలా బాగా చుాసుకుంటున్న కొడుకులు అందరికీ ఈ కథ అంకితం 👍
please read 🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment