Sunday, January 24, 2021

ఆట, కర్మ

🌸ఆట, కర్మ:🌸

ఆటకి, కర్మకి ఒక్కటే తేడా. ఫలాకాంక్ష ఉంటే ఆట కర్మ అయిపోతుంది. ఫలాకాంక్ష లేకపోతే కర్మ కూడా ఒక ఆట అయిపోతుంది. అందుకని ఫలాకాంక్ష అనేదే ఆటకి, కర్మకి గల తేడా. కర్మలో ఆకర్మని చూడడం అంటే, కర్మ చేస్తూ కూడా నేను కర్తని కాదు అనుకోవడం. అప్పుడు సాక్షీభావం కలుగుతుంది. ఇక మరో రకమైన భావన ఏమిటంటే కర్మ చేయకుండా చేస్తున్నాను అనుకోవడం.

జీవితం ఒక నాటకం, ఒక ఆట, ఒక లీల. దీన్ని గంభీరంగా తీసుకోవలసిన అవసరం లేదు. అలా తీసుకున్నవారు ఏదో రోగంతో బాధ పడుతున్నట్లే లెక్క. జీవితాన్ని చాలా తేలికగా తీసుకోవాలి. దాన్ని ఒక ఆట కన్నా ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక ఆటగా తీసుకున్న వాళ్లు సమతుల్య స్థితిలో జీవిస్తూ వుంటారు. యోగము ప్రకారం సత్యాన్ని, పరమాత్మని పొందాలి అంటే ఒక సాధన చేయాలి. మనం శుద్ధము కావాలి. కానీ సాంఖ్యము అంటుంది, మానవుడు అశుధ్ధుడు కాలేదు, తాను శుధ్ధుడను అనే విషయం గుర్తుపట్టలేకపోతున్నాడంతే.

🌹🌹🌹🌹🌹🌹🌹

Source - Whatsapp Message

No comments:

Post a Comment