Saturday, January 30, 2021

భగవద్గీత-వివేకానందుడు

భగవద్గీత-వివేకానందుడు

భగవద్గీత గురించి స్వామీ వివేకానంద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ....
"గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి చెప్పినవి మాటలు కావు.!జ్ఞాన కణికలు.!జీవితాదర్శమంతయూ ఒక్క క్షణంలో అచ్చట తెలియజేయబడెను.ఉపనిషత్తులను తోటలో నుండి ఆద్యాత్మిక సత్యములను యేర్చికూర్చిన మాలయే భగవద్గీత.!"అని చెప్పాడు.
భగవద్గీత గురించి స్వామీజీ జీవితంలో జరిగిన ఒక మహత్తర సంఘటనను ఓసారి గుర్తు చేసుకుందాం.
స్వామీజీ అమెరికాలో పర్యటిస్తున్న సమయంలో ఒక అమెరికన్ వివిధ మత గ్రంథాలన్నిటినీ ఒక బల్లపైన అమర్చాడు.
అందులో పైన బైబిల్.,ఖురాన్...ఇలా అనేక మతాల గ్రంథాలు అమర్చాడు.
చిట్టచివరిగా అన్నిటికన్నా కింద
భగవద్గీత గ్రంథాన్ని అమర్చాడు.
తర్వాత ఆ విదేశీయుడు "చూశారా.!స్వామీజీ.మా మత గ్రంథాలన్నీ చాలా గొప్పవి.ఉత్తమమైనవి.అందుకే అవి పైన ఉన్నవి.మీ భగవద్గీత కు విలువ లేదు.!అందుకే అధమస్థానంలో ఉంది.!అని వెక్కిరిస్తూ భగవద్గీత గురించి హేళనగా మాట్లాడుతూ స్వామిని అవమానపరుచాలనుకుంటాడు.ః
వెంటనే స్వామీజీ ఏమాత్రం తడబడకుండా....
అవును మా భగవద్గీత అన్ని గ్రంథాల కన్నా కింద ఉన్న మాట నిజమే.!
అయితే మా భగవద్గీత ప్రపంచ ధార్మిక గ్రంథాలన్నింటికీ తల్లి లాంటిది.!పునాది.!ఎప్పుడైతే పునాది కూలుతుందో భవనం కూలిపోతుంది.!?ప్రపంచ ధర్మాలకు ఆధారం ఈ మా భగవద్గీత నే అంటూ..
తన వేళితో భగవద్గీతను బయటకు లాగేస్తాడు.!
అప్పుడు పైన ఉన్న వివిధ మత గ్రంథాలన్నీ కుప్పకూలుతాయి.!
ఆవిధంగా ఆ విదేశీయుడికి తగిన బుద్ధి చెప్పి
భగవద్గీత యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పాడు స్వామీజీ.
స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజనోత్సవాల సందర్భంగా స్వామీజీ స్మృతిలో నేడు నాలుగో రోజు.
🙏🙏🙏💐💐💐
👏👏👏🕉️🕉️🕉️
ధర్మ జాగరణ
ఇందూరు
తెలంగాణ
9848403595*
.

Source - Whatsapp Message

No comments:

Post a Comment