Tuesday, January 19, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులైన మీకు మీకు మంగళవారపు శుభోదయ శుభాకాంక్షలు, మా ఇంటి దైవం శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు మరియు తిరుత్తణి సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ...💐🤝🕉️🙏
మంగళవారం --: 19-01-2021 :-- ఈరోజు మంచి మాట...లు

శుభోదయం ఇది పొద్దునే ఒకరిని పలకరించే పదమే కాదు . నేనింకా ఈ ప్రపంచంలోనే ఉన్నాను నీకెప్పుడు ఆత్మీయంగా తోడుంటాను . ఎవరున్నా లేకున్నా ఒక మిత్రునిగా వెన్నంటి ఉంటానని ఆత్మీయంగా దైర్యం చెప్పే రక్షణ పదం .

బంధం అయినా పరిచయం అయిన కోత్తలో చూపించే అభిమానం కడదాకా ఉండదు దీనికి కారణం మారిపోయే మనషులదో లేదా కొత్తగా చేరిన పరిచయాలదో తెలియదు .

విలువ అనేది మనకు మనం నిర్మించుకున్న కంచుకోట లాంటిది . ఒక్కో మాట జారిన ప్రతి సారీ ! కోట బిటలు వారి . చివరికి కోట కూలే ప్రమాదం ఉంది, మాట్లాడేముందు జాగ్రత్త ఉండాలి అంటే మనం మాట్లాడే మాట జాగ్రత్తగా ఉండాలి .

ఈ ప్రపంచంలో అత్యంత స్వార్థపూరిత జీవి ఏదైనా ఉందంటే అది మనిషే . అవసరాన్ని బట్టి మనుషులు మారతారు ఎప్పుడైతే మన అవసరం తీరిపోతుందో మనతో మాట్లాడే విధానం కూడా మారిపోతుంది

మరిగే వేడి నీటిలో మన ప్రతిబింబం ఎలా కనబడదో పరిష్కారం కూడా అలాగే కనిపించదు . మనకు సమస్యలు ఎన్ని ఉన్నా ప్రశాంతతమైన మనస్సు తో ఆలోచిస్తే పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది .

సేకరణ ✒️ మీ ...AVB సుబ్బారావు 9985255805💐🤝🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment