Friday, January 1, 2021

ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?”

Life Change Messages Every Day 6:50pm In Light Workers Group
🙏ప్రశ్న: “పోటీతత్త్వం విపరీతంగా పెరిగిపోతూన్న ఈ కాలంలో పిల్లలను ఎలా పెంచాలి?”

🌷పత్రీజీ:

🌷చాలామంది ప్రాపంచిక తల్లిదండ్రులు“క్లాస్లో నువ్వే ఫస్ట్ రావాలి..నువ్వే ఇంజనీయర్ కావాలి..నువ్వే డాక్టర్ కావాలి..నువ్వే కలెక్టర్ కావాలి..నీకే అన్ని పేరు ప్రఖ్యాతులు రావాలి” అంటూ చిన్నప్పటి నుంచీ పిల్లలకు 100% ప్రాపంచికతను నూరిపోస్తూ వుంటారు.

🌷ఆ పిల్లలు కూడా పాపం అవే వింటూ..చిలుక పలుకుల్లా అలాంటి మాటలే నిత్యం పలుకుతూ ఉంటారు. ఫలితంగా వారు తమ తమ జీవితాలలో అంతులేని అవమానాలకూ, అపజయాలకూ గురవుతూ ఉంటారు!

🌷కాబట్టి “నేను అందరి కన్నా ముందుండాలి”అన్న భావన కంటే “అందరూ పక్వంగా ఉండాలి..అందులో నేను కూడా ఒకానొక పక్వంగా ఉండాలి” అన్న సరైన భావనతో పిల్లలను పెంచాలి!

🌷నిజానికి విద్యార్థి జీవనానికి కావలసినవి ‘ఏకాగ్రత’..‘పట్టుదల’..‘జ్ఞాపకశక్తి’ .. ‘ఏక సంధాగ్రాహ్యత’.. ‘చురుకుదనం’..‘ఉత్సాహం’.. ‘శక్తి’! ఇవి అన్నీ కూడా పిల్లలు పుట్టుకతోనే సహజంగా కలిగి ఉంటారు.

🌷అయితే ప్రతిరోజూ వాళ్ళతో నిర్ణీత సమయంలో ధ్యానం చేయిస్తూంటే తమ లోనే నిక్షిప్తం అయివున్న ఈ అద్భుతలక్షణాలను వారు సహజ ఎరుకలోకి తెచ్చు కోగలుగుతారు.
💐☘💐☘💐☘💐☘💐☘


Source - Whatsapp Message

No comments:

Post a Comment