Thursday, January 28, 2021

ఈ సృష్టి మొత్తం మనిషికి ఓ పాఠశాల...

ఈ సృష్టి మొత్తం మనిషికి ఓ పాఠశాల. ఈ ప్రకృతిలో ప్రతి చెట్టు, ప్రతీ జీవి... ఏదైనా తన సహజ జీవన విధానంతోనే మనిషికి ఎన్నో విషయాలు బోధిస్తాయి.

ఐకమత్యం, ప్రేమ, త్యాగం వంటి సుగుణాలన్నీ మనిషి ప్రకృతినుంచే నేర్చుకోవాలి. మనిషి ప్రకృతిలో అందాలను ఆస్వాదించడం మాత్రమే కాదు- వాటిని అధ్యయనం చేయాలి. ఆ ప్రకృతి ధర్మాలను ఆచరించాలి.

పచ్చని ఆకులతో కళకళలాడే వృక్షం శిశిరంలో ఆకులు రాలుస్తుంది. వేసవిలో ఎండి మోడైపోతుంది. వసంతకాలం రాగానే ప్రతి కొమ్మా చిగురిస్తుంది.

జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదని మంచిరోజు తప్పక వస్తుందని మానవాళికి మంచి సందేశమిస్తుంది. అంతేకాదు- వృక్షం ఎంత ఎత్తుకు ఎదిగినా ఉన్నచోటునే ఉంటూ అందరికీ ఆశ్రయం ఇస్తుంది. తన పళ్లను అందరికీ ఇచ్చి అలసిన జీవులను తన కొమ్మల నీడల్లో సేదతీరుస్తుంది.
పరోపకారం, త్యాగగుణం కలిగి ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తుంది వృక్షం. ఆ సత్యాలు మనిషి గ్రహించి వాటిని తన జీవితానికి
అన్వయించుకోవాలి.

🧡🧡🧡🧡🧡🧡🧡

Source - Whatsapp Message

No comments:

Post a Comment