Monday, January 25, 2021

ఐశ్వర్యం అంటే....

ఐశ్వర్యం అంటే....
🍁🍁🍁🍁🍁🍁🍁

✍️ మురళీ మోహన్

😃ఐశ్వర్యం అంటే చాలామంది డబ్బు మాత్రమే అని భ్రమ పడుతుఅంటారు. డబ్బులు లేవు కాబట్టి మేము ఐశ్వర్య వంతులం కాదు అని అనుకుంటూ ఉంటారు.

అసలైన ఐశ్వర్యం అంటే ఏమిటో తెలుసుకుందాం..

తల్లి తండ్రులను రోజు చూడగలగడం ఐశ్వర్యం అని మీకు తెలుసా?ఈ రోజుల్లో పెద్దవాళ్లయినా తల్లి తండ్రులను పిల్లలు భరించలేక వృధాశ్రమము లో వదిలేస్తున్నారు. కానీ తల్లి తండ్రి ఇంటిలో ఉండి రోజు మీరు వారితో ప్రేమ గా మాట్లాడగలిగితే అది గొప్ప ఐశ్వర్యం. ఎందుకంటే మన మంచినీ వారికన్నా గొప్పగా కోరుకునేవాళ్ళు ఎవ్వరు ఉండరు. కాబట్టి ఎప్పుడు వారిని కంటికి రెప్పలా కాపాడడం వారు మీతో ఉండడం మహా ఐశ్వర్యం.

భార్య భర్తలు అనుకూలం గా ఉండడం కూడా ఐశ్వర్యం అని మీకుతెలుసా?

భార్యాభర్తలు ఒకరినిఒకరు అర్ధం చేసుకుంటూ ప్రేమ ను పంచుకోవడం కూడా ఐశ్వర్యమే .

దీనితో పాటు చెప్పిన మాట వినే సంతానం ఉండడం కూడా ఐశ్వర్యం. పిల్లలు బుద్ధిమంతులు చెప్పినమాట వినేవారు అయి ఉంటే అది గొప్ప ఐశ్వర్యం

.రుణం లేకపోవడం కూడా ఐశ్వర్యం. మీ సంపాదన మీ అవసరాలకు సరిపడా ఉండి మిగలక పోయిన పర్వాలేదు. కానీ అప్పు లేకుండా ఉంటే మాత్రం చాల ఐశ్వర్యం ఉన్నదానితో సమానం...

ఏదైనా తిని అరిగించుకునే శక్తి ఉన్నవారు కూడా ఐశ్వర్య వంతులే...

మనకోసం కన్నీరు కార్చే ఆప్తులు ఉండటం కూడా ఐశ్వర్యం ఉన్నట్టే..

ఎదుటి వారు కష్టంలో ఉన్నారు అని తెలియగానే ఆదుకునే స్వభావం ఉన్నవారు కూడా ఐశ్వర్య వంతులే..

ఎంత డబ్బు ఉన్నవారైనా.. కనీస మానవత్వం లేకుండా పైన చెప్పిన విషయాలు లేనప్పుడు వారు ఏమి లేనివారితోనే సమానం..

ఎంత డబ్బు లేకున్నా , పైన చెప్పిన విషయాలు మనసు నిండా ఉన్నవారు కోటీశ్వరులు ఐశ్వర్య వంతులుగా చెప్పుకోవచ్చు..

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁

Source - Whatsapp Message

No comments:

Post a Comment