Sunday, January 31, 2021

హిందూదేశానికి సముద్ర మార్గాన్ని వెదకడానికి యూరోపియన్లు చేసిన సాహస యాత్రల వెనకాల చర్చ్ ప్రోత్సాహముంది.

చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేమిటంటే 15,16 శతాబ్దులలో హిందూదేశానికి సముద్ర మార్గాన్ని వెదకడానికి యూరోపియన్లు చేసిన సాహస యాత్రల వెనకాల చర్చ్ ప్రోత్సాహముంది.

ఆనాటికి యూరోప్ అంతటా పోప్ మాటే చెల్లుబడి అవుతుండేది. భాషలవారీ జాతీయతగాని, రాజ్యాల వారీగా రాజరికాలుగాని అంత ప్రభావవంతంగా ఉండేవికావు. 1453లో తూర్పురోమన్ సామ్రా జ్యానికి రాజధానిగా ఉండిన కాన్స్టాంటినోపిల్ తురుష్కుల వశమైంది. దానిపేరు ఇస్తాంబుల్ గా మార్చటమేగాక ఆసియా దేశాలనుండి యూరోప్ దేశాలకు జరుగుతున్న వర్తక వాణిజ్యాలకు అడ్డుకట్ట వేశారు.

పర్యవసానంగా యూరోప్ దేశాలన్నీ గిలగిల కొట్టుకున్నాయి? అంతగా ఏమి ప్రమాదంవచ్చిందట? యూరోప్ ఖండం కర్కటరేఖకు ఉత్తరాన ఉన్న సంగతి మనకు తెలిసిందే. అంటే ఇటలీ, స్పెయిన్ వంటి కొద్దిదేశాలు మాత్రమే సమశీతోష్ణమండలంలో ఉండగా చాలాదేశాలు శీతలమండలంలో ఉన్నాయి. అక్కడ శీతాకాలంలో నదులు, సరస్సులు, సముద్రాలలో పైన ఉండే నీరు గడ్డకట్టుతుంది. పడవలు తిరగవు. చేపలవేట కుదరదు. కాబట్టి వేసవికాలంలో పట్టుకున్న వాటిని నిలువచేసుకుని శీతాకాలం తింటూ ఉంటారు. 15శతాబ్దమధ్య ఈ పరిణామం సంభవించిన నాటికి రిఫ్రిజిరేటర్లు కనుకొనబడలేదు. ఉప్పు, మిరియాలపొడిమిశ్రమాన్ని చేపలు చెడిపోకుండా ఊరవేసుకొనడానికి ఉపయోగించేవారు.

తురుష్కులు ఆసియాదేశాలనుండి సరఫరాలను ఆడ్డుకోవటంతో మొత్తం యూరప్ కి హిందూదేశం నుండి ఎగుమతిచేయబడే మిరియాలు రావటం బందయిపోయింది. ఆహారం నిలువచేసుకోవటమూ కష్టమైంది. ఇది ఒక దేశం సమస్య కాదు, అన్నిదేశాల సమస్య. ఒక ఏడాది సమస్యకాదు. ప్రతి ఏటా శీతాకాలంలోఎదురవుతున్న దుర్భరమైన సమస్య. యూరోప్ అంతటా హాహాకారాలు చెలరేగాయి.

వివిధ రాజ్యాల రాజులు పోప్ దగ్గరకు పోయి మొర పెట్టుకున్నారు. పోప్ ఎంత లోతుగా ఆలోచించాడో తెలియదుగాని, రెండు మూడు మాటలుచెప్పాడు. హిందూదేశం భూమిమీదే ఉందిగదా, హిందూదేశానికి ఇదితప్ప మరోమార్గం లేదనుకుంటే ఎలా? మీ రాజ్యాల లోని నావికులను పంపించి మరో మార్గం వెదికి పట్టుకోండి. అని ఆదేశించటమేగాక, ఆ నావికులు వెళ్ళేమార్గాలలో ఏయే దేశాలు, ప్రదేశాలు, భూభాగాలూ తటస్థపడతాయో, అక్కడ దేవుని వాక్యం వినిపించి అక్కడ నివసించే ప్రజలను క్రైస్తవులుగా చేయవలెనని, ఆ భూభాగాలపై రాజ్యాధికారాన్ని ఎవరుముందుగావెళ్ళి పాగావేస్తారో వారికి ఇచ్చేస్తున్నానని చెప్పాడు. ఇది యూరోపియన్ రాజ్యాల పాలకులకు ఉత్సాహా న్నిచ్చింది.

అయితే ఆనాటి వాస్తవస్థితి ఏమిటంటే యూరప్ లోని ఏరాజ్యానికి కూడా సంవత్సరం పొడవునా కొలువులో ఉండే సైన్యాలు ఉండేవి కావు. నౌకాసైన్యాలూ ఉండేవికావు. కొన్నిరాజ్యాలలో సముద్రపు దొంగలు ఉండేవారు. రాజులు ఆ సముద్రపు దొంగలను పిలిచి, సత్కరించి పోప్ ఆదేశాన్ని వినిపించి హిందూదేశానికి దారి కనుగొనే యాత్ర చేపట్టవలసిందిగా కోరారు. బహుమతుల ఆశతోపాటు, తాము కాలుపెట్టినచోట అధికారం చలాయించడానికి పోప్ అనుమతి, ఆదేశము ఉన్న మాట వారికి ఉత్సాహా న్నిచ్చింది.

అలా బయల్దేరి వెళ్లిన ఒక క్రిష్టఫర్ కొలంబస్ అమెరికా ఖండానికి వెళ్లి ఆదే హిందూదేశ మనుకున్నాడు. అక్కడి ప్రజలను రెడ్ ఇండియన్స్ గా వర్ణించాడు. అలా వెళ్లిన మరో వాస్కో డగామా అనే పోర్చుగీసు నావికుడు ఆఫ్రికా దక్షిణపు కొసవద్ద తుపానులో చిక్కుకొని స్కందుడు అనే హిందూదేశ నావికునిచే రక్షింపబడి అతని సౌజన్యంతో కేరళలోని కోఝికోడ్ వద్ద హిందూదేశపు భూమిపై అడుగు పెట్టాడు.

ఆతర్వాత రోజులలో ఈదేశంలో క్రైస్తవమతాన్ని వ్యాపింపజేయడానికి వారు అనుసరించిన పద్దతులు అమానుషమైనవి. దుర్మార్గమైనవి. అటువంటి పద్ధతులను ఎందుకు అనుసరించారంటే, పోప్ అనుమతి, ఆదేశమూ ఉన్నవని భావిస్తూ విర్రవీగు తున్నకారణంగానే వారు అంతక్రూరంగా వ్యవహ రించారు. ఆతర్వాత వచ్చిన ఆంగ్లేయులు కూడా ఇంచుమించుగా అంత క్రూరంగా వ్యవహరించారు.

మొదట్లో వంగివంగి సలాములు చేస్తూ మనరాజుల ప్రాపకం సంపాదించడానికి తీయగా మాట్లాడినా, కొద్దిపాటి పట్టుచిక్కగానే తమ ఈ భూమి కంతటికీ అధినేతలమని, అందరూ తమ మాటను విని తీరా లని బలప్రయోగాలకు మోసాలకు, కుతంత్రాలకూ పూనుకున్నారు. డల్హౌసి అమలుచేయబూనిన రాజ్యసంక్రమణ సిద్ధాంతానికి వెనక ఉన్నదికూడా తాము అడుగు పెట్టినచోట దేవుని రాజ్యాన్ని సుస్థిరంచేసే అధికారం పోప్ తమకు దఖలు పరిచినాడన్న భావనయే.

యావత్ప్రపంచమూ తమ కేలండరునే అనుస రించాలని, తాము నూతన సంవత్సరం ఆరంభంగా భావించే రోజునే అందరూ తప్పనిసరిగా భావించి కోలాహలంగా జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేస్తుండటం, వాటికి విస్తృతమైన ఏర్పాట్లుచేసే విధంగా అక్కడి ప్రభుత్వాలను, అధికారగణాలనూ ప్రభావితంచేయజూడటం - వీటి వెనకాల ఉన్నది కూడా ఆ మనో భావనయే.

మన మీద బలవంతంగా రుద్దబడుతున్న ఈ మనోభావనలను ప్రతిఘటించవలసిన బాధ్యత మనపై ఉందని మనదేశీయులందరూ గుర్తించి తదనుగుణంగా వ్యవహరించాలి.

కర్తవ్యమేవ కర్తవ్యం ప్రాణైః కంఠ గతై రపి.
అకర్తవ్యం న కర్తవ్యం ప్రాణైః కంఠ గతై రపి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment