🌲🌹💐🙏🙏🙏💐🌹🌲
చాలా మందికి అంటే నూటికి 95 మందికి ఎప్పుడూ ఒక అనుమానం వెంటాడుతూ ఉంటుంది... అదేమిటంటే, ఈశ్వరుడుకి నా మీద దయ ఉన్నదో లేదో అని, నన్ను పట్టించుకుంటున్నాడో లేదో అని అనుమానం, సందేహం ఎప్పుడూ ఉంటుంది... దీనికి కారణం అవగాహనా రాహిత్యమే తప్ప ఇంకొకటి కాదు... ఎలాగంటే..
ఈ సృష్టి అంతా ఈశ్వరుడి చేత తయారు చేయబడింది... ఎక్కడ చేయబడింది అంటే, తన మాయా శక్తి చేత , తన ఊహ లో, తన ఆలోచనలో చేయబడింది.... అంటే ఒక అణువు కదలిక నుండి బ్రహ్మాండం దాకా ప్రతిదీ ఆయన ఆలోచనల్లో, ఊహల్లో ఉంటేనే ఇక్కడ ఉండటం జరుగుతుంది....
అంటే ప్రతి జీవి గురించి కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటేనే ఇక్కడ జీవిస్తున్నాయి.... ఏ జీవి ఎలా ఉండాలో అని ఆలోచించడం వలననే అవి ఆ రకంగా ఉన్నాయి..
ఆ జీవుల్లో మనం లేమని అనుకోవడమే అవగాహన రాహిత్యం... అదే అజ్ఞానం... ఇదంతా ఈశ్వరుడి ఊహ అయినప్పుడు, ఆయనకి, ఆయన ఊహకి తేడా ఎక్కడ ఉంది ????? రెండూ ఒకటే కదా... ఆ ఊహలో మనం కూడా ఉన్నప్పుడు, ఇక మనము, ఆయన వేరు కాదు కదా..
ఎవరికి వారు తాను వేరు అని అనుకోవడం వలననే, తన మీద ఆయన అనుగ్రహం ఉందొ లేదో అని అనుమానం ఉంటుంది....
ఆయన మన గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టే, ఇంకా ఈ శరీరంతో శ్వాస పీలుస్తున్నామని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి... ఆయన ఆలోచించడం మానేసిన క్షణం ఇక్కడ ఈ శరీరాలు ఉండవు... దీన్ని బట్టి ఏమి అర్థం అయ్యింది... ఆయన అనుగ్రహం ఎప్పుడూ ఉందని తెలుసుకోవాలి...
అందుకే భగవాన్ రమణులు ఎప్పుడూ చెపుతూ ఉండేవారు అనుగ్రహము అనేది ఎప్పుడూ ఉంది, అది కొత్తగా వచ్చేది కాదు అని....
నేను ప్రత్యేకంగా ఉన్నాను అని అనుకోవడం మానేసి ఈశ్వరుడే ఈ రూపంలో ఉన్నాడు అని తెలుసుకుంటే ఈ అనుమానాలు, భయాలు పోతాయి....
🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
Message by Dr.MMV Subramanyam
Source - Whatsapp Message

No comments:
Post a Comment