Friday, January 29, 2021

దైవానికి దగ్గర కావడానికి పూజలు , పునస్కారాలు తప్పనిసరిగా చేయాల్సిందేనా?

🕉️ దైవానికి దగ్గర కావడానికి పూజలు , పునస్కారాలు తప్పనిసరిగా చేయాల్సిందేనా? 🕉️

📚✍️ మురళీ మోహన్

👉అంతఃచేతనలో పూర్తిగా పరమాత్మ స్వరూపం నిండిన తర్వాత కూడా మహర్షులు , యోగులు , సిద్ధులు , మహనీయులైన మన పూర్వీకులు స్వధర్మాచరణను విడిచిపెట్టలేదు . ఆధునిక కాలంలో ఈ ధర్మాచరణ పట్ల సరైన అవగాహన లేక , అలా అవగాహన కల్పించేవారు లేక పొందాల్సిన జ్ఞానాన్ని పొందలేకపోతున్నారు . నవవిధ భక్తులలో మొదటిది అర్చన . కొందరు పరమాత్మ గుణగాన సంకీర్తనాన్ని ఎంచుకొని తరించారు . ఎవరు ఏ మార్గాన్ని ఎంచుకున్నా ఆ మార్గాలన్నింటి లక్ష్యమూ పరమాత్మను చేరుకోవడమే .

మనసులో కల్మషం నింపుకొని ఉన్నప్పుడు ఎన్ని పూజలు చేసినా ప్రయోజనం లేదు . మనసునిర్మలంగా సర్వభూతహితకారియై ఉన్నప్పుడు , నిరంతరం పరమాత్మలో లీనమై చరించేటప్పుడు ఎలాంటి పూజలు చేయకపోయినా ఫర్వాలేదు .
ఆ స్థితికి చేరుకోవడం చాలా కష్టం . ధార్మిక చింతనవల్ల మీ మదిలో చెడు ఆలోచనలు రావు , ఆ నిష్ఠ చెదరకుండా ఎప్పటికీ నిలచి ఉండడానికి , ఆధ్యాత్మిక దివ్య సాధనలో మీరు మరింతగా పురోగ మించడానికి , పరిపూర్ణంగా పరమాత్మ సాక్షాత్కారం కలగడానికి ఆ పూజలు కచ్చితంగా దోహదపడతాయి .
మనసు పరమాత్మలో పూర్తిగా లయమై ఉన్నప్పుడు మాటకూడా మంత్రమవుతుంది . దృష్టి ప్రాపంచిక విషయాలపై ఉన్నప్పుడు మంత్రం కూడా మాటలాగే వినిపిస్తుంది . ఈ రెండింటికీ మధ్య భేదాన్ని గుర్తించగలిగే స్థాయి పరిణతి చాలా అవసరం.🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment