Saturday, January 2, 2021

*"శ్వాస - రూపం"* (Breath - form) *"సూక్ష్మ శరీరం"* (Astral Body)

🟢 పితామహ పత్రీజీ 26-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 26-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"శ్వాస - రూపం" (Breath - form)
"సూక్ష్మ శరీరం" (Astral Body)

"భౌతిక శరీరం, పుట్టుకకు ముందు, AIA అనేది సైకిక్ (శారీరక + మానసిక) ఆవరణలో ఉంటుంది. అక్కడ అది రూపాలను తన శ్వాసతో శ్వాస-రూపం యొక్క శకలంగా పునరుద్ధరిస్తుంది."

"క్రమంగా, శ్వాస -రూపం భౌతిక ప్రపంచంలోని కాంతితలంలో మునిగిపోతుంది. అది మునిగిపోవటం వలన, జీవతలంలోని జీవపదార్థం, భౌతిక ప్రపంచం యొక్క రూపతలంలోని రూప పదార్థం, ఈ అదృశ్య రూపంలో ఉండే శ్వాస- రూపం చుట్టూతా ఆవరిస్తుంది, అపుడు అది మెరవటం మొదలు పెడుతుంది."

" శ్వాస- రూపం అప్పుడు ఒక నివురుగప్పిన నిప్పువలె ఉండి, జీవంలోనికి వస్తుంది. ఇదే భవిష్యత్తులో మానవుని శ్వాస-రూపం దాలుస్తుంది."

" శ్వాస- రూపం అదృశ్యరూపంలో ఉండే భౌతిక శకలం."

"పుట్టుకకు పూర్వస్థితి (Prenatal state) లో AIA గత జన్మలలోని గురుతుల (impressions) ను తిరిగి మేల్కొలుపుతుంది."

"పుట్టుక నుంచి మరణం వరకు, శ్వాస- రూపం సమన్వయపరిచే నిర్మాణ శకలంగా ఉంటుంది : ఇదే ఆకృతినిచ్చి, నాలుగు ఇంద్రియాలను, వ్యవస్థలను, అవయవాలను, కణాలు, అణువులు, పరమాణువులను మరియు ప్రత్యేకమైన ధాతువులను పట్టి ఉంచుతుంది."

" ఇంద్రియాల ద్వారా, శరీరి - మనసు (Body - Mind) తో, శరీరి- నేను ప్రకృతితో సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునేందుకు శ్వాస- రూపం కారణమవుతుంది. జంతువులు, ఆలోచించలేని కారణంగా, వాటికి శ్వాస- రూపం ఉండదు. శరీరి- నేను మరణానంతరం వదిలిపెట్టిన భావన మరియు కోరిక భాగం ఏదయితే ఉందో అది ఉత్తేజితమై ఒక రకం జంతువుగా, ఆ విధమైన భావనలు మరియు కోరికలు కలిగి ఉంటుంది."

"జంతువులు ప్రకృతి యొక్క గురుతులకు వాటి ఇంద్రియాలతో, ఏ మాత్రం సంకోచం లేకుండా స్పందించటంలో నైపుణ్యం కలిగి ఉంటాయి."

"మరణానంతరం, శ్వాస- రూపం, శరీరి- నేను లో కొంత సమయం ఉంటుంది కాని తరువాత దాని నుంచి విడివడిపోతుంది."

" AIA అనేది సూక్ష్మ లేక కాంతి- ఘన శరీరం (radiant - solid body) కాదు. సూక్ష్మశరీరం కాంతి పదార్థం యొక్క శరీరం. అది భౌతికతలంలోని కాంతి పదార్థంతో తయారవుతుంది, ఇంకా, నక్షత్రాలు మరియు మెరుపులు కూడా ఇదే పదార్థంతో తయారవుతాయి."

" సూక్ష్మశరీరమే, శ్వాస- రూపం నుంచి మెరుపు కలిగిన శరీరంగా ఆకృతిని సంతరించుకోవటానికి ఉపయోగపడే సాధనం. అది ప్లాస్టిక్ మరియు సాగే గుణం, ఇంకా విద్యుతీయ శక్తి కలిగి ఉంటుంది."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment