Saturday, January 2, 2021

*"గందరగోళం"* (Chaos) *"పరిపాలన యంత్రాంగం"* (Government) *"ఓ క్రొత్త మార్గం"* (A New Way)

🟢 పితామహ పత్రీజీ 24-09-2020 వ తేదీన వ్రాతపూర్వకంగా ఇచ్చిన english మెసేజ్ కి తెలుగు అనువాదం🟢

🔹 "పిరమిడ్ వ్యాలీ", "బెంగుళూరు "🔹
🔸 24-09-2020🔸

Harold W Percival రచించిన “Thinking and Destiny” అన్న పుస్తకం నుండి కొన్ని రచనలు.

"గందరగోళం" (Chaos)
"పరిపాలన యంత్రాంగం" (Government)
"ఓ క్రొత్త మార్గం" (A New Way)

"మానవుని ఆలోచనలు, అసంఖ్యాకమైన మానవుని ఆలోచనలు, విశ్వ చట్టానికి మరియు నియమాలకు వ్యతిరేకంగా ఉన్నాయి. మనిషి కోరికలు ఎక్కువగా చట్ట విరుద్ధంగా, అల్పంగా మరియు దుర్మార్గంగా ఉంటాయి, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటి ఇష్టారాజ్యంగా మసులుకోవడానికి అనుమతించడం జరుగుతుంది. చాలామంది ఇతరులను అదుపు చెయ్యగలిగితే చేస్తారు, వారిని వారు అదుపులో ఉంచుకోరు."

"ప్రతి ఒక్కరి పనులు, ఎక్కడయితే అజ్ఞానంతో, జడత్వంతో పరిమితంగా ఉన్నాయో మరియు తరచు వారి స్వలాభం దృష్ట్యా, చాలా మంది ఒక ప్రక్క చట్టం నుంచి రక్షణ కోరుతారు. మరో ప్రక్క వారికి నష్టం వాటిల్లని మేరకు వాటిని అతిక్రమిస్తూ ఉంటారు. తద్వారా ఆనతికాలంలోనే ప్రపంచంలో గందరగోళం తలెత్తుతుంది, ఇంకా మనుషులను వారి ఇష్టానికి వదిలేస్తే, అన్ని వ్యవస్థలు కుప్పకూలిపోతాయి."

" ఆలోచన చట్టాన్ని అనుసరించి, మేధస్సులు (intelligences) మరియు సంపూర్ణులైన త్రిమూర్తులు విషయ వ్యవహారాలను పరిపాలిస్తుంటారు. వారి పర్యవేక్షణలో ధాతు సంబంధమైన జీవులు యాంత్రికత్వానికి (mechanical part) సంబంధించిన భాగంలో పాత్రను వారు చేపడతారు మరియు వారే ఆ పదార్థం, ఇంకా ఆ ధాతుసంబంధమైన పదార్థంతోనే వారు పని చేస్తారు."

"ఇంద్రియాలకు గోచరమయ్యే ఈ విశ్వం, ఏదో ఒక మేధస్సు (intelligence) చేత నడిపించబడుతుందని ఆలోచించగలిగే ప్రతి మనిషి తెలుసుకుంటాడు."

"బాహ్య ప్రపంచం, సంపూర్ణులైన త్రిమూర్తులు మరియు మేధస్సు యొక్క ఆదేశానుసారం, ఉన్నత శ్రేణి ధాతువుల ద్వారా నిర్మించబడుతుంది మరియు నాశనం చేయబడుతుంది. వీరు మహోన్నతమైన మేధస్సు (Supreme Intelligence) ఆధీనంలో ఉంది, ఆలోచన చట్టం అమలు అయ్యేటట్లుగా చూసుకుంటారు."

"నిరంతరంగా కొనసాగే ఈ వ్యవహారంలో త్రిమూర్తులు (Triune - Selves) మరియు మేధస్సులే (Intelligences) నిర్వాహకులు. వారు దృశ్య చిత్రీకరణ (Scene) ఏర్పాటు చేసి అందులో పాల్గొనేందుకు (to act) ఆటగాళ్ళ (Players)కు పిలుపునిస్తారు. ఈ ప్రపంచం అనే నాటకరంగంలో , ప్రతి మానవుడు తన పాత్రను ఎక్కడో ఒక చోట పోషిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో మరియు ఒకానొక చోట , త్రితత్వ- నేనులు లేక మేధస్సుల నిర్ణయానుసారం వారు స్వయంగా తయారు చేసుకున్నటువంటి భాగాన్ని పోషించటానికి అనుమతిస్తారు."

" త్రిమూర్తులు మరియు మేధస్సులు ఒక వ్యక్తి లేక ఒక సమూహం యొక్క విధిని మార్చలేరు, వారు చేయగలిగేదేమిటంటే గందరగోళాన్ని సృష్టించే బాహ్యీకరణలను జాప్యం చేయగలరు లేదా వేగవంతం చేయగలరు."

" మనుషులు వారి స్వలాభం కోసం ఆలోచిస్తారు, పనులు చేస్తారు. తక్షణమే వారికి అందుబాటులో ఉన్న విషయ వస్తువులకు మించి, వారి కార్యాల యొక్క ఫలితాలు వారి నియంత్రణలో ఉండవు. కేవలం త్రిమూర్తులు మరియు మేధస్సులకు మాత్రమే మనిషి ఆలోచనల ద్వారా ఏమి పొందగోరుతున్నాడో మరియు చిన్న, పెద్ద సమూహాల యొక్క విధి తెలుస్తుంది."

"శరీరి- నేనులకు నిరంతరం అవకాశాలను ఇవ్వడం ద్వారా మానవజాతి మనుగడను సాగించేందుకుగాను సమయం మరియు ప్రదేశమును ఎన్నిక చేయడం ద్వారా సంఘటనల యొక్క వరుసక్రమాన్ని వారు నిర్వహిస్తారు."

"కాని ఈ అవకాశాన్ని ఒక షరతుపై మాత్రమే కొనసాగించవచ్చు. అదేమిటంటే, మానవుని మొత్తం ఆలోచనలలో, మంచి చెడును అధిగమిస్తుంది."

"ఎప్పుడయితే దుర్మార్గుల ఆలోచనల యొక్క శక్తి దానిని తిరిగి పొందడానికి విస్తృతమౌతుందో కాని విఫలమౌతుందో అప్పుడు మేధస్సులు, అగ్ని దేవుడిని లేక వరుణ దేవుడిని ఆ మానవజాతి కోరేదాన్ని ఇవ్వడానికి పంపించటం జరుగుతుంది. అప్పుడు, ఆ మానవజాతి యొక్క నాశనం వరదలు, అగ్నిపర్వతాలు మరియు భూకంపాల ద్వారా సంభవిస్తుంది."

"సముద్ర జలాలలోని భూమి బయటకు వచ్చి, కొత్త జాతి ఆవిర్భావం కోసం ఎదురుచూస్తుంది."

"కాని ప్రపంచంలో, మనుషులు వారి జీవితంలో బాధ్యతలకు మేల్కొంటున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. వారి జీవితాలు, ఇతరుల జీవితాలతో మరియు ఇతర మనుషులతో ముడిపడి ఉందని, వారు వ్యక్తిగతంగా, వేరు వేరు సంఘాలుగా విడిపోయి ఆనందం పొందలేరని అర్థం చేసుకోవడం మొదలు పెట్టారు. వేరు వేరు దేశాలలోని వ్యక్తులు, వారికి స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు, అదే విధంగా ఇతర దేశస్తుల వారికి కూడా స్వేచ్ఛ అవసరమని అర్థం చేసుకుంటున్నారు. మరి ఇతరుల స్వేచ్ఛను హరిస్తే కనుక, వారి స్వేచ్ఛను వారు కూడా కోల్పోవలసి వస్తుంది."

" స్వేచ్ఛ మరియు బాధ్యత విడదీయలేనివి. స్వేచ్ఛ మరియు బాధ్యత ఒక మార్గాన్ని సుగమం చేస్తాయి. దానితో బాటు కాంతిని తీసుకుని వస్తాయి. ఆ చైతన్యపు కాంతి క్రొత్త జీవన విధానానికి ప్రవేశ ద్వారం వంటిది. ఈ జీవన విధానం, భూమి పైన, శాశ్వత నాగరికత యొక్క స్వపరిపాలనను సంభవింపజేస్తుంది."

💖 ఎస్. పత్రి 💖

తెలుగు అనువాదం: అనురాధ మేడమ్ (Vizag)

లైట్ వర్కర్స్ WhatsApp గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి WhatsApp లో add me అని మెసేజ్ చేయగలరు.
97518 98004

👍 VicTorY oF Light 🎇

💚🔆 Light Workers----
🔄♻🔁 Connected with Universe 💖🌟🌍💫💥🔺

Source - Whatsapp Message

No comments:

Post a Comment