Sunday, February 14, 2021

ఋణానుబంధం

🙏 ఋణానుబంధం 🙏

ఒక యోగి ఒక్కనాడు ఒకరి చెప్పులు వేసుకున్న కారణానికి, మోక్షానికి వెళ్లవలసిన వాడు ఈ ఋణం ఉండిపోవటంతో అతని ఇంట పుత్రుడై, జన్మిస్తాడు💥.

రుణానుబంధం తీర్చుకోవటానికి ఆ యోగి మళ్ళీ పుడతాడు.
జాతకం చూసిన వాడు తలిదండ్రులకు ఒక హెచ్చరిక చేస్తాడు.
ఈ బాలుడు మీకు చాలా చాలా తక్కువ రుణపడి ఉన్నాడు.
వాడి చేతి నుంచి పైసా కూడా తీసుకోకండి.
వాడికి అన్నీ ఇస్తూండండి. అని చెప్తాడు.
నాటి నుంచీ తల్లిదండ్రులు వానినుంచి ఏమీ ఆశించకుండా పెంచుతారు.
పూర్వజన్మ గుర్తున్నందున అతడు వారి రుణంతీర్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాడు.💥
పెద్దయ్యాక తండ్రి ఇతడిని రాజుగారి కొలువుకి తీసుకుపోయి ఉద్యోగం ఇమ్మంటాడు.💥
రాజు గారు రాత్రి గస్తీ ఉద్యోగం ఇస్తాడు.💥
అపుడు ప్రతి జాముకీ ఒకసారి ఆ యువకుడు ఇలాటి ఉపదేశాన్ని నిద్రలో ఉన్న వారికి జాగ్తేరహో.....💥
అనే అర్ధంలో ఇస్తాడు. దొంగలంటే ధనం ఎత్తుకుపోయేవారేకాదు.💥
ఇవన్నీ కూడా దుఃఖభాజనాలే సుమా అని చెపుతుంటాడు.💥

ప్రతి జాముకీ ఇలాంటి హితవు ఒకటి చెబుతుండేవాడు.. 🌷

రాజుగారికి రాచకార్యాలతో నిద్రపట్టక తిరుగుతూ ఇవన్నీ విని ఇతడు సామాన్యుడు కాడని గుర్తిస్తాడు.💥
మరునాడు స్వయంగా అతడి ఇంటికి వెళ్లి రాత్రి తాను అన్నీ విన్నాననీ, తన మనసు ప్రశాంతి పొందిందనీ అంటాడు.💥
పళ్లెంలో వెంట తెప్పించిన ధనాన్ని అతడికి అందిస్తాడు.💥
అతడు వెంటనే ఆ ధన రాశిని తల్లికి ఇవ్వగా ఆమె పుత్రోత్సాహంలో నియమం మరచి ఆ పళ్లెం అందుకుంటుంది.💥
వెంటనే అతడు తనువును విడిచి ముక్తి పొందుతాడు.💥
తలిదండ్రులు దుఃఖిస్తే రాజు ఆ యోగి కావలి సమయంలో చెప్పిన ఉపదేశాలు వినిపించి ఓదారుస్తాడు💥

🌷తస్మాత్ జాగ్రత జాగ్రత !🌷

1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:-🙏 తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- 🙏ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా :- 🙏కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- 🙏ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:- 🙏మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||

తా:-🙏 ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.🙏

7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||

తా:-🙏 మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు ?🙏

8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||

తా:- 🙏గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు ?🙏

9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||

తా:- 🙏చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?🙏

10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||

తా:-🙏 రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు ?

11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః| సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||

తా - 🙏ప్రవహించుచున్న నదిలో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు ?_

Source - Whatsapp Message

No comments:

Post a Comment