Sunday, February 14, 2021

దుఃఖం సంతోషం. దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే !!

దుఃఖం సంతోషం. దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే !!
మనం సంతోషంగా ఉన్న మనసును, దుఃఖంగా ఉన్న మనసును మాత్రమే చూడటానికి అలవాటు పడ్డాం. అవి రెండూలేని మనసు, రోజులో అధికసమయం ఉంటున్నా దానికి విలువనివ్వడం లేదు. దుఃఖానికి అసలు కారణం సంతోషానికి ఎక్కువ విలువ నివ్వడమే. సంతోషం కూడా మన సహజస్వరూపంలో లేదని తెలిస్తే సంతోషంగా ఉండాలనే కాంక్ష పోతుంది. విచారణ మార్గంలో మనసును గమనించడం ద్వారా మనసు ఏ అనుభవాన్ని తనతో అంటిపెట్టుకుని ఉండటం లేదని తెలుస్తుంది. మనసు దేన్నైనా జ్ఞాపకంగా తప్ప ఎంత గొప్ప అనుభవమైనా తనలో నిల్వ చేసుకోలేదు. సామాన్యుడికైనా, మాన్యుడికైనా సంతోషం, దుఃఖం సహజం. కానీ అవి అశాశ్వతమైనవని తెలియడమే ఆనందానికి మార్గం

🎊💦🌹💞🌈🦚

Source - Whatsapp Message

No comments:

Post a Comment