Hari 🕉️om, 🌈
Hari 🕉️om,🌈
కామ్యఫలం -జ్ఞానఫలం
కర్మలవల్ల లభించేది కామ్యఫలం. జ్ఞానం వల్ల లభించేది జ్ఞానఫలం. అయితే, కామ్య ఫలం త్వరలో లభిస్తుంది, కానీ జ్ఞానఫలం అంత త్వరగా లభించదు. అందుకే, జ్ఞానఫలం కోసం వేచిచూసే ఓర్పు లేక, ఎక్కువ మంది త్వరగా లభించే కామ్యఫలాలకు పరుగులు పెడుతుంటారు.
సంసార కూపం నుంచి బయట పడే దారికి జ్ఞానమే మార్గం. కామ్యకర్మలు - కర్మ ఫలాలు అనేవి గానుగెద్దు లాగా, ఏతం బావిలాగా రాకడ -పోకడలు గలిగి, విసుగూ - విరామం లేకుండా పుట్టుకకు - మరణానికీ కారణ మౌతూ, సంసారచక్రం లోంచి బయటకు రానీయవు.
పుట్టేందు కెందుకంటే చచ్చేదానికి, మరి చచ్చేది ఎందుకంటే మళ్ళీ పుట్టేందుకు - అనేట్లు జీవితం చర్విత చర్వణంగా ( నమిలినదాన్నే మళ్ళీ మళ్ళీ నమలడంగా ) తయారవుతుంది.
అదే విషయాన్ని భాగవతం లో ఇలా చెప్పారు :
అచ్చపు చీకటింబడి, గృహవ్రతులై, విషయ ప్రవిష్టులై, పుట్టుచు చచ్చుచున్, మరల చర్విత ఛర్వణులైన వారికిన్, చె
చ్చెర పుట్టునే పరులు చెప్పిననైన, నిజేచ్ఛనైన,ఏమిచ్చిననైన, కానలకు ఏగిననైన హరి ప్రభోదముల్!
పోనీ అలానే పుడుతూ చస్తూ ఉందామంటే :
ఈ నర జన్మ 83,99,999 జన్మల తరువాత పరమేశ్వరుని కరుణా కటాక్షంతో వచ్చిన మానవ జన్మ. ఈ మానవ జన్మ మళ్ళీ వస్తుందనే నమ్మకం లేదు. ఎందుచేతనంటే :
" పునః గ్రామం, పునః క్షేత్రం, పునః విత్తం, పునర్ధనం, పునః శుభాశుభః కర్మ, న శరీరే పునః పునః"- అన్నారు పెద్దలు.
అంటే, మనం మళ్ళా మళ్ళా గ్రామం మారవచ్చు, మళ్ళా మళ్ళా భూమి కొనవచ్చు, మళ్ళా మళ్ళా ఆస్తి -పాస్థులు పొందవచ్చు, మళ్ళా మళ్ళా ధనం సంపాయించవచ్చు. కానీ, ఈ శరీరం మళ్ళీ మళ్ళీ రాదు.
ఈ శరీరం తోనే మనం ఏమైనా సాధించాలి. అందుచేత ఈ శరీరం పోయేలోపే మనం జ్ఞానం సంపాయించాలి.
ఈ జ్ఞానం సంపాయించడానికి, వేదాలు, పురాణాలు, భాగవతం, భారతం, రామాయణం, ఉపనిషత్తులు మొదలైన గ్రంధాలనన్నింటినీ చదవ వలసిన పనిలేదు. ఒక్క భగవద్గీత అనే చిన్న గ్రంధాన్ని (700 శ్లోకాలు మాత్రమే గల ) చదవడం వల్ల మొత్తం జ్ఞానం అర్ధమై పోతుంది. ఎలానంటే :
భగవద్గీత అంటే ఏమిటి?
భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము.
కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానము గనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి.
సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి.
భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని గీతోపనిషత్తు అని కూడా అంటారు.
భగవద్గీతలో : భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి.
ఒక్కముక్కలో చెప్పాలంటే భగవద్గీత డైనమిక్ ప్రిస్కిప్షన్ ఫర్ లైఫ్.
సంతృప్తి - సంతోషాలు నిండిన జీవితం గడపాలంటే, చేస్తున్న పనిలో విజయం సాధించాలంటే : గీతను అర్థం చేసుకోవాలి. ఇది :
🔴 ధర్మాధర్మాల గురించి చెబుతుంది.
🔴 కర్తవ్యం గురించి చెబుతుంది.
🔴 నాగరికత అంటే కోరికలను తీర్చుకోవడం కాదు… అదుపులో పెట్టుకోవడమని చెబుతుంది.
🔴 ఆనందంగా జీవించడం ఎలాగో చెబుతుంది.
🔴 సుఖం… శాంతి… త్యాగం… యోగం… అంటే ఏమిటో చెబుతుంది.
🔴 ఏది శాశ్వతమో ఏది అశాశ్వతమో చెబుతుంది.
🔴 పాప పుణ్యాల వివరణ ఇస్తుంది.
🔴 ఆత్మ తత్త్వ నిరూపణ చేస్తుంది.
స్వకల్యాణం కోసం కాక లోక కల్యాణం కోసం జీవించమని చెబుతుంది.
🔴 జ్ఞానం… మోక్షం… బ్రహ్మం… ఆధ్యాత్మం అంటే ఏమిటో చెబుతుంది.
🔴 ఎవడు పండితుడో ఎవడు స్థితప్రజ్ఞుడో చెబుతుంది.
🔴 ప్రతిఫలాపేక్ష లేకుండా కర్మ చేయడంలో ఉండే ఆనందం ఎంతో చెబుతుంది.
🔴 మంచి పనులు చేసేవాడికి లభించే శాశ్వత కీర్తి ఎంతో చెబుతుంది.
🔴 పరమాత్ముడికి ఎవడు ఇష్టుడో చెబుతుంది.
🔴 ఆయన్ను చేరే మార్గాన్ని చూపిస్తుంది.
🔴 కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల ద్వారా వేలు పట్టుకుని నడిపించి, మనిషిని దైవాన్ని చేస్తుంది.
🔴 నీలానే ఇతర ప్రాణికోటినీ ప్రేమించమని చెబుతుంది. అనారోగ్యకరమైన భావోద్వేగాలను నియంత్రిస్తుంది.
అందుకే భగవద్గీత జాతి, మత,ప్రాంత, దేశ, లింగ, వయో భేదాలు లేకుండా సర్వమానవాళి శ్రేయస్సు కోసం - సాక్షాత్తు పరమాత్మ ( GOD ) చేత స్వయంగా బోధింపబడింది.
అర్థం చేసుకున్నవారు ధన్యులు. వేరే మతగ్రంథం లా అన్య సాంప్రదాయాలను ఆచరించేవారిని చంపమని భగవద్గీత చెప్పదు.
నిన్ను నన్ను మన అందరి గురించి మాట్లాడుతుంది. మానవుడు ఎలా అభ్యున్నతి సాధించాలో చెబుతుంది..
ఇక ఆలస్యం చేయకుండా చదవండి భగవద్గీత. అయితే, జ్ఞానం వున్న వాళ్ళు వ్రాసిన భగవద్గీతలను మాత్రమే చదవండి, వ్యాపార ధోరణితో వ్రాసే భగవద్గీత లను చదవవద్దు.
Hari 🕉️om. Hari 🕉️om.
Source - Whatsapp Message

No comments:
Post a Comment