Tuesday, February 9, 2021

దేవుడి ఇంటికి సరైన దారి మల్లాది వెంకట కృష్ణ మూర్తి

దేవుడి ఇంటికి సరైన దారి - మల్లాది వెంకట కృష్ణ మూర్తి
〰〰〰〰〰〰〰〰
🔼 'రామాపురం' అనే ఊళ్ళో రైలు దిగండి.
'నమ్మకం' అనే రిక్షాని మాట్లాడుకోండి.
🔼 భక్తి అనే పేటలోకి తీసుకెళ్ళమనండి.
పాపం అనే డెడ్‌ ఎండ్‌ వీధి వస్తుంది.
🔼 పుణ్యం అనే దాని ఎదురు సందులోకి ముందుకి సాగండి.
ప్రార్ధన అనే వంతెనని దాటండి.
🔼 కర్మ అనే సర్కిల్‌ వస్తుంది.
దుష్కర్మ అనే రెడ్‌లైట్‌ అక్కడ వెలుగుతూండవచ్చు.
🔼 సుకర్మ అనే పచ్చలైటు వెలిగాక ముందుకి సాగండి.
భజనమండలి అన్న బోర్డున్న కుడి రోడ్డులోకి మళ్ళండి.
🔼అక్కడ రోడ్డు నాలుగు రోడ్లుగా చీలుతుంది.
⏺మొదటి మూడిటి పేర్లు - అసూయ స్ట్రీట్‌, ద్వేషం సందు, ప్రతీకారం వీధి.
🔼వాటిని వదిలి నాలుగో సందులోకి తిరగండి. దానిపేరు సత్సంగం వీధి.
⏺పక్కనే కనబడే వందతుల వీధిలోకి వెళ్ళకండి. అది వన్‌వే రోడ్డు.
🔼కాస్తంత ముందుకు వెళ్ళాక ఓ జంక్షన్‌ వస్తుంది.
అక్కడ ఎడమవైపు రోడ్డు పేరు వ్యామోహం.
⏺కుడివైపు రోడ్డు పేరు వైరాగ్యం. వైరాగ్యం వీధిలోకి వెళ్ళండి.
🔼ఎదురుగా మీకు కైవల్యం అనే మరో చౌరస్తా కనిపిస్తుంది.
దయగల హృదయం - భగవన్నిలయం అన్న బోర్డున్న తెల్లరంగు ఇల్లు కనిపిస్తుంది.
☯గేటు దగ్గరున్న ముక్తి అనే తలుపు మిమ్మల్ని చూడగానే తెరుచుకుంటుంది.
ఇది దేవుడి ఇంటికి సరైన దారి.

మీరు మీ బంధుమిత్రులకి కూడా ఈ దారిని తెలపండి. లేదా సరైన దారి తెలియక వారు దారి తప్పిపోవచ్చు.

ఆధ్యాత్మిక మార్గంలో భక్తి, మంత్రం, ధ్యానం ఇలా...రకరకాల సాధన ఏదైనా గాని, చేసేవారు ఎవరైనా గాని తెలుసుకోవలసిన సూక్ష్మ విషయం ఇదే!
🙏🙏🙏🙏☯🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment