Wednesday, February 3, 2021

దానిని ఎంచుకోవటం మన చేతుల్లోనే ఉంది,,,,, ఆనందం ద్వారానే ఆనందాన్ని పొందగలం.

ఒక అమెరికన్ లండన్ లోని ఒక హోటల్ కి వచ్చి కూర్చున్నాడు, అక్కడే ఒక మూల ఒక భారతీయుడు కూర్చోవడం చూసాడు. వెంటనే కౌంటర్ దగ్గరకు వెళ్ళి పర్సు తీసి, గట్టిగా అరుస్తూ , " వైటర్, నేను ఈ రెస్టారెంట్లో అందరికీ భోజనానికి అయ్యే ఖర్చు మొత్తం నేనే ఇస్తాను, ఒక్క ఆ భారతీయుడికి తప్ప". దానితో ఆ వైటర్ అతని దగ్గర డబ్బులు తీసుకుని అందరికీ ఉచిత భోజనం వడ్డించడం మొదలుపెట్టాడు, ఆ భారతీయుడికి తప్ప. దానికి ఆ భారతీయుడు ఏ మాత్రం కలత చెందకుండా ఆ అమెరికన్ వైపు చూస్తూ ,"థాంక్యూ" అని చెప్పాడు. దాంతో ఆ అమెరికన్ మళ్ళీ కోపంగా తన పర్సు తీసి గట్టిగా అరుస్తూ," వైటర్, ఈసారి ఈ రెస్టారెంట్లో ఉన్న అందరికీ వైన్ బాటిల్స్ తో పాటు తినుబండారాలకి కూడా నేను పైకం చెల్లిస్తున్నాను ఆ భారతీయుడికి తప్ప". ఆ వైటర్ డబ్బులు తీసుకుని అందరికీ వైన్ తోపాటు ఆహారాన్ని కూడా సర్వ్ చేయడం మొదలుపెట్టాడు ఆ ఒక్క భారతీయుడుకి తప్ప. వైటర్ అందరికీ వైన్ తోపాటు ఆహారాన్ని సర్వ్ చేయడం అయిపోయిన తర్వాత ఆ భారతీయుడు ఏ మాత్రం కోప్పడకుండా చక్కగా ఆ అమెరికన్ వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి "కృతజ్ఞతలు" అని చెప్పాడు. అది ఆ అమెరికన్ కి చాలా కోపాన్ని తెప్పించింది. దానితో ఆ కౌంటర్కి జారబడుతూ ఆ వైటర్ తో ఇలా అన్నాడు ఆ భారతీయుడికి ఏమైనా పిచ్చెక్కిందా నేను అతనికి తప్ప అందరికీ ఉచితంగా వైన్, ఆహారాన్ని ఇచ్చినా అతనికి కోపం రాకపోగా, తిరిగి చిరునవ్వు నవ్వి కృతజ్ఞతలు చెపుతాడేంటి?". అప్పుడు ఆ వైటర్ అమెరికన్ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి ఇలా చెప్తాడు" అతనేమీ పిచ్చివాడు కాదు, అతనే ఈ రెస్టారెంట్ ఓనర్" అని. మన జీవితంలో కొన్నిసార్లు మనం శత్రువులు అనుకున్న వారే వాళ్ళకు తెలియకుండా మనకు మంచి చేస్తూ ఉంటారు. 😠 కోపానికి దూరంగా ఉండాలి, అది నిన్ను మాత్రమే బాధపెడుతుంది!, ,,, ఒకవేళ నీ వైపు న్యాయం ఉంటే, నువ్వు కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు,,,,, ఒకవేళ నీ వైపే తప్పు ఉంటే నీకు కోప్పడటానికి ఎలాంటి హక్కు లేదు,,,, కుటుంబం పట్ల ఓర్పుతో ఉంటే అది ప్రేమ,,,, ఇతరుల పట్ల ఓర్పుతో ఉంటే అది గౌరవించటం,,,, నీ పట్ల నువ్వు ఓర్పుతో ఉంటే అది విశ్వాసం,,, భగవంతుని పట్ల ఓర్పుతో ఉంటే అది నమ్మకం ,,,,, జరిగిపోయిన దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తే బాధ కలుగుతుంది,,,, భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తే భయం కలుగుతుంది,,,, ఈ క్షణాన్ని చిరునవ్వు తో జీవిస్తే, ఆనందం మన సొంతం అవుతుంది,,,,, మన జీవితంలోని ప్రతీ సమస్యా మనల్ని ఇంకా దృఢంగా తయారుచేస్తుంది,,,, ప్రతీ సమస్యా మనల్ని బలహీనులనూ చేస్తుంది బలవంతులను చేస్తుంది, దానిని ఎంచుకోవటం మన చేతుల్లోనే ఉంది,,,,, ఆనందం ద్వారానే ఆనందాన్ని పొందగలం.👏👏👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment