Saturday, February 13, 2021

నిజమైన సాధకుడు ఎవరు !?

నిజమైన సాధకుడు ఎవరు !?
🌹🌹🌹🌹🌹
నిజమైన సాధకుడు జీవితాన్నంతా సాధనకి అనుకూలంగా మలుచుకుంటాడు. అంటే తన సాధనకి అడ్డురాని ఉద్యోగం, వ్యాపారం, భార్యాబిడ్డలు, స్నేహితులు, తన జీవన విధానం, దినచర్య తను వేసే ప్రతిఅడుగు గమ్యం వైపే సాగుతుంది. తాను దేని కోసం జీవితాన్ని గడుపుతున్నాడో దాని కోసం సర్వాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.


అలా కాకుండా రోజూ సక్రమంగా సాధన చేయడానికి సమయం లేదనో, తాము జీవితంలో చేయాల్సిన పనులుకొన్ని మిగిలి ఉన్నాయని, వాటిని పూర్తిచేసుకొని సాధన కొనసాగిస్తామని, జీవితం బాగా అనుభవించిన తర్వాత ఇక అనుభవింప యోగ్యం కానీ, సాధనకీ పనికిరాని, ముసలి వయసులో బాగా సాధన చేస్తామని అనేవాళ్ళకు అసలు సాధనంటే ఇంకా తెలియదని అర్ధం.


మానవుడు ఉండేదే దేవుడవడం కోసం. విత్తు ఉండేదే చెట్టు అవడం కోసమైనట్లు.


కాబట్టి సాధన అనేది జీవితంలో ఒక భాగమని తెలుసుకొని తీరాలి. ఇది తెలుసుకోకుండా సాధించకుండా, ఈ లోపల సాధన ముక్తి అని మాట్లాడడం చిన్నపిల్లవాని మాటలవలె అర్థరహితం. అది సాధిస్తేనే సాధన మొదలైనట్లు.


అహమే జన్మలకు మూలమన్నారు. అట్టి అహమునే ఎరుక అన్నారు. అహంపదార్థరహితమే జన్మరహితమన్నారు.


అయితే అహం అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తుందో దాని అర్థాన్ని తెలుసుకుంటే చాలన్నారు. పరిపూర్ణమును తెలియపర్చి అట్టి అహమనే ఎరుకను పోగొట్టేవారే సద్గురువు.


శరీరం ఉన్నంతకాలం చొక్కాలు ఎలా తొడుక్కుంటామో అలాగే అహంకారం ఉన్నంతకాలం శరీరమనే దాన్ని తొడుక్కుంటూ ఉండాల్సిందే ! ఆ అహంకారాన్ని గురుపాదాలపట్టి పోగోట్టుకునుంటేచాలు !


కుమ్మరి మట్టితో కుండలు చేస్తుంటే ఒక కుండా విరిగిపోయింది మళ్ళీ దాన్ని కుండగా చేస్తాడు. ఎందుకంటే దాన్ని కాల్చలేదు కాబట్టి కాల్చితే మళ్ళీ అతుకదు. అలాగే జ్ఞానాగ్నిలో కాల్చబడిన శరీరాలు మళ్ళీ జన్మించవు. దానిలోని కర్మయనే పచ్చిదనం పోయేంతవరకు బాగా కాల్చాలి._

Source - Whatsapp Message

No comments:

Post a Comment