🌷ప్రియమైనవి అన్నీ శ్రేయస్కరం కావు🌷
🕉️🌞🌎🏵️🌼🚩
కోరికలు తీరడం లేదని,కష్టాలు వదలడం లేదని దేవుని నిందించడం తగదు.ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తిని ఆట వస్తువుగా భావించి అది కావాలని తల్లితో పదేపదే మారాం చేస్తాడు. పరమేశ్వరుడు నువ్వు కొరుకున్నదల్లా ఇవ్వడు నీకేంకావాలో అది మాత్రమే ఇస్తాడు. పిల్లవాడు అడుగుతున్నాడు కదా అని కత్తిని తల్లి ఇచ్చేస్తుందా!!? మీరైతే మాత్రం ఇస్తారా!!!
అవసరమైతే పిల్లవాడిని దండిస్తుంది, కాని కత్తిని అందించదు. ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడికి తెలియదు. అది తనకు ప్రియమైనది అని భావించి అదేదో ఆటవస్తువనే భ్రమలో ఉంటాడు. కానీ తల్లికి దానివలన కలిగే ప్రమాదం తెలుసు కనుక తన పిల్లవాడు ఆ కత్తితో తనకు తానుగా ఎక్కడ గాయపరచుకుంటాడో అని ఆ తల్లి దానిని దూరంగా దాచేస్తుంది పిల్లవానికి శ్రేయస్కరం కాదని కదా !!
మరి ఈ జన్మకు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లిగా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే జన్మ జన్మల నుండి మనతో ఉంటూ మన ఆత్మకు తల్లీ తండ్రీ తానుగా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న ఆ భగవంతుడు ఆయన పిల్లలమైన మనపై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి!!!..
మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు. కానీ భగవంతునికి సదా ఎరుకయే. భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వకపోవడానికి కారణం ఇదియే. భగవంతుని ఆర్థించండి పరవాలేదు. యివ్వ లేదని నిందించకండి. ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు కానీ మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు. నీకు ఎది ఎప్పుడు అవసరమో అది ఇస్తాను. అప్పటి వరకు సహనంతో వేచి వుండు అన్నారు బాబా. మనకు శ్రేయస్కరం అయినది తప్పక ఇస్తారు. సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకొంటూ, భారములను ఆయనపై వేసి సర్వశ్య శరణాగతి చెంది ఆయన చూపిన మార్గంలో మనం ప్రయాణిస్తే తప్పక గమ్యo చేరుతాము.🙏
🌈🍇🦚🌹🦚🐋💞
Source - Whatsapp Message

No comments:
Post a Comment