అడిగే వాడికి చెప్పే వాడు లోకువ- చెప్పే వాడికి వినే వాడు లోకువ!
‘పార్వతి’కి అరవైయేళ్ళు. 25 సంవత్సరాలు ఉద్యోగంచేసింది. ఆ తరువాత, భర్త చేసే వ్యాపారంలో ఆఫీస్ పనంతా నిర్వహించేది.
స్వతహాగా గట్టి ‘ఆరోగ్యవంతురాలు’ కాకపోయినా, ‘క్రమశిక్షణ’ కలిగిన మనిషి కనుక చెప్పుకోదగ్గ అనారోగ్యాలేమీ లేకుండా ఇప్పటిదాకా నెట్టుకొచ్చింది.
పిల్లలకి ‘చదువులు’, ‘పెళ్ళిళ్ళు’ విజయవంతంగా నిర్వహించి మనవల్ని కూడా ఎత్తుకుని వారితో బాగా ఆనందిస్తున్నది. ఇంతవరకు అంతా బాగానే ఉన్నది.
ఈ మధ్యనే కొంత ‘అనారోగ్యం’ వచ్చి ఒకటికి- రెండు సార్లు డాక్టర్లని సంప్రదించవలసి వచ్చింది. అక్కడ మొదలయ్యింది, ప్రహసనం.
గుండెకి సంబంధించిన డాక్టర్ ఏవో పరీక్షలు చేయించమని, ఆ ‘రిపోర్ట్’ ల ని బట్టి, ‘ప్రశ్నల చిట్టా’ విప్పారు.
--‘మీకు బీపీ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు
--‘డయాబెటిస్ ఉన్నదా’? ‘లేదండీ’ - పార్వతి జవాబు
--‘మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారు, ఆహారపు అలవాట్ల గురించి వివరం చెప్పండి’ అని అడిగారు.
--‘మీరువైట్ రైస్ తినకండి’ – ‘నేను వైట్ రైస్, బ్రౌన్ రైస్ చెరి సగం కలిపి వండి తింటానండీ, అదీ
ఒక కప్పున్నర (చిన్న కప్పు)’ - పార్వతి జవాబు
--‘వేపుడు కూరలు తినకండీ’ – ‘నాకు వేపుళ్ళు తింటే పొట్ట బరువెక్కినట్లు ఉంటుందండి, అదీ కాక వేపుళ్ళు చేస్తుంటేనే, ఆ నూనె వాసనకి నాకు దగ్గు వచ్చేస్తుంది. అది అరగటానికి లివ్ 52 టాబ్లెట్స్ వేసుకుంటే కానీ నిలవలేను’ - పార్వతి జవాబు
--‘గోధుమ తినాలండీ’- ‘నాకు గోధుమ అలర్జీ అండీ’ పార్వతి జవాబు
--‘స్వీట్స్ అస్సలు తినకూడదండీ’ – ‘నాకు స్వీట్స్ అసలు సహించవండీ’ పార్వతి జవాబు
(పార్వతి ‘భర్త’ కి పదిహేనేళ్ళుగా ‘డయాబెటిస్’! కానీ స్వీట్స్ మీద ‘వ్యామోహం’, బజార్ నించి స్వీట్స్ తెచ్చి, తను తిని భార్య ని తినమని బలవంత పెడుతూ ఉంటాడు. (ఇది కొసమెరుపు ఇక్కడ).
ఆ మాటే డాక్టర్ గారి ముందు అనలేక, అనకుండ ఉండలేక తికమక ప డ్డాడు. భార్య స్వీట్స్ తినకపోవటం మంచో కాదో తెలియని స్థితిలో పడ్డాడు, పార్వతి భర్త.
--‘రోజు గంట వాకింగ్ చెయ్యాలండీ’ – ‘నేను రోజూ వాకింగ్ కి మా పక్కింటి పార్క్ కి వెళ్ళి గంట నడుస్తానండీ’. పార్వతి జవాబు
--‘అన్నీ చేస్తూ ఉన్నా కూడా మీ బరువు తగ్గట్లేదంటే, సర్జరీ కి రికమెండ్ చెయ్యవలసి వస్తుంది’ – ‘డాక్టర్’ గారి చివరి నిర్ణయం (సర్జరీ అంటే ‘బేరియాట్రిక్’ అన్న మాట)
--‘మీరేం చేస్తారో తెలియదు , 4-5 కిలోలు బరువు తగ్గాలండీ. ప్రకృతి చికిత్సాలయంలో చేరండీ’.
ఇక “యోగాఅడ్వైజర్” వంతు -
--‘ఉదయమే ఖాళీ కడుపుతో యాపిల్ సైడర్ వెనిగర్ తాగాలండీ’- టీచర్ సలహా. ‘అది తాగితే నాకు విపరీతంగా అసిడిటీ వచ్చి, ఉక్కిరి బిక్కిరి అవుతున్నది. రోజంతా ఏమీ చెయ్యలేక,
తినలేక మంచానికి కరుచుకుని పడుకుంటున్నానండీ’ - పార్వతి జవాబు.
(ఈ విషయం విని ఇంకో శ్రేయోభిలాషి అయిన డాక్టర్ గారు, ‘అయ్యో ‘యాపిల్ సైడర్ వెనిగర్’ ‘డయాబెటిస్’ ఉన్న వాళ్ళకి మంచిది, మీ లాంటి శరీర తత్వం ఉన్న వాళ్ళకి కాదు’ అన్నారు)
పార్వతి ‘గుండె’ కి సంబంధించిన ‘డాక్టర్’ కి చెప్పినట్లే ‘యోగా టీచర్’ కి ‘రోజూ పొద్దున గంట వాకింగ్ చేస్తానని’ చెబితే, యోగా టీచర్ ‘అయ్యో గంట వాక్ చెయ్యకూడదండీ, మొకాలి చిప్పలు అరిగిపోతాయి. ఆ గంటలోఒక ‘ఇరవై నిముషాలు’ ‘వాకింగ్’, ‘ఇరవై నిముషాలు’ ‘శ్వాస’కి సంబంధించిన ‘ఎక్షర్సైజ్’ లు చెయ్యండి’ అని ‘పార్వతి ఆరోగ్యం పట్ల తన ఆదుర్దా తో కూడిన సలహా ఇచ్చింది’.
--‘ఉదయం రోజూ ఒక అరగంట యోగాసనాలు వెయ్యాలండీ’. ‘నేను యోగా గురు ముఖతహ నేర్చుకుని ఎప్పటి నించో చెస్తున్నానండీ’. ‘శ్వాస కి సంబంధించిన వ్యాయామాలు - రోజూ ఒక టైం కి కాకపోయినా తరుచు చేస్తూ ఉంటానండీ’- పార్వతి జవాబు
--‘నేను ఉదయం 5 గంటలకే లేస్తాను, అందుకని వాకింగ్ అయ్యాక ఏమీ తినకుండా యోగాసనాలు, శ్వాస కి సంబంధించిన ఎక్సర్ సైజ్ లు చెయ్యలేను. నాకు సాధారణం గా షుగర్ స్థాయిలు తక్కువ గా ఉంటాయి, కళ్ళు తిరుగుతాయి’ అని పార్వతి సందేహం!
--‘ఎబ్బే ఫరవాలేదండీ, మీరు ఏదైనా తాగి, పండు తిని యోగాసనాలు వెయ్యచ్చు’- టీచర్ జవాబు.
--‘ఆసనాలు వేసే ముందు గంట ముందు మాత్రమే ఏమైనా తిన్నా, తాగినా’ అని అనుభవఙ్ఞుల సలహా!
ఇంతకీ ఇక్కడ కొసమెరుపు ఏమిటంటే, ఈ ‘హృద్రోగ నిపుణుడు’, ‘యోగా’ గురువు గారు, ‘ప్రకృతి చికిత్స’ కి సంబంధించిన సలహా ఇచ్చే గురువు గారు - అందరు ఒకే ఆసుపత్రి లో ఒకే చూరు కింద ఒకరి సమన్వయం తో ఇంకొకరు పని చెయ్యాలన్నమాట.
కానీ రోగికి మాత్రం కావలసినంత తికమక.
పార్వతి యోగ క్షేమాలు కోరుకునే బంధువులు, స్నేహితులు ఈ ప్రహసనం అంతా విని, వారి అనుభవాలని వారు పంచటం మొదలు పెట్టారు-
‘మా వాళ్ళెవరో ప్రకృతి చికిత్స కి వెళితే కిడ్నీ సమస్య వచ్చిందని’ ఒకరు, ‘హార్ట్ సమస్య వచ్చిందని’ ఒకరు చెప్పేసరికి అసలే మతి పోయి ఉన్న పార్వతికి ‘జీవితం’ మీద ‘విరక్తి’ వచ్చింది.
“హతవిధీ నేను ఆరోగ్య సమస్య వచ్చిందని చెప్పనేల? చెప్పితినిపో నా భర్త నన్ను డాక్టర్ దగ్గరకి తీసుకుపోనేల ? తీసుకెళ్ళెనుపో, అతగాడు నన్ను ఇన్ని పరీక్షలు చెయ్యనేల ? చేసెనుపో, ఇంతమందిని సంప్రదించమని కోరనేల ? కోరితినిపో, వారు నాకు ఇన్ని విరుద్ధమైన సలహాలు ఇవ్వనేల ? ఇచ్చెనుపో నేను విననేల ? వింటిని పో ఆచరించటానికి ప్రయత్నించనేలా” అని పార్వతి అన్ని మందులు, సలహాలు కట్టకట్టి అటక మీద పడేసి హాయిగా నోటికి నచ్చి, శరీరం ఆమోదించిన తిండి తిని, తనకి నచ్చిన సంగీతం విని మనవలతో ఆడుకోవాలని నిర్ణయించుకుని హాయిగా నిద్ర పోయింది.
నిద్రలో ఒక అశరీర వాణి "చెప్పే వాడికి వినే వాడు లోకువ" అనే సామెత వినలేదా అని అడిగినట్లనిపించి దిగ్గున లేచి కూర్చుంది. ‘ఈ కల ముందే వచ్చి ఉంటే ఇన్ని తిప్పలు తప్పేవి కదా’ అనుకుంది.
👏👏👏👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment