🌺 కామాన్ని జయించడం ఎలా?:🌹
కామం అంటే ఏమిటి? దీనిని మనం ఎందుకు జయించాలి? దీన్ని జయించడం వలన మనకు కలిగే ప్రయోజనాలేంటి? మొదట కామం అంటే ఏమిటో తెలుసుకుందాం. కామం అనగానే చాలా మందికి చాలా భావనలు ఉంటాయి. ఇంకా కొందరు ఏవేవో కూడా ఊహించుకుంటారు.అసలు కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే ప్రతిదీ కూడ కోరికే. అంటే ఉదాహరునకు మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త, బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలు అన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు. సరే ఈ కోరికలు వుండడం వలన ఏమవుతుంది? ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి కోరికలు వుండడం సహజం కదా. కోరికలు ఉంటే ఏమవుతుంది. మనకు కావలసినవి అన్నీ మనకు కావాలి కదా మరి? లేకపోతే ఎలా బ్రతికేది అని చాలా మందికి సందేహం కూడ వుంటుంది. అవును కదండీ మరి. కోరికలు వుండాలి కాని దానికి ఒక పరిమితి ఉండాలి. అంతే కాని అత్యాస ఉండకూడదు. కాని ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంత ఏమిటంటే కామాన్ని జయిస్తే గాని మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేము. ఆ విధంగా ఆలోచిస్తే దీనిని జయించడమే మేలు అని అనిపిస్తుంది.
అందులోను ఎక్కడ చూచిన ఈ కామ,క్రోధ,లోభ,మోహ,మద,మాత్సర్యాలను జయించిన వాడు మాత్రమే ఆధ్యాత్మికంగా అత్యున్నత స్థాయికి వెళతాడు అన్నది మనకు అన్ని వేద గ్రంధాలలో తెలియపరచినారు. అంతేకాక కామ,క్రోధ,లోభ,మోహ, మద,మాత్సర్యాలలో కూడ మొదట కామం నే తీసుకున్నారు. ఎందుకంటే కామం వెనుక ఉన్నవి అన్నీ కూడా కామం నుండే మరియు కామం వలననే కలుగుతాయి కాబట్టి ఇక్కడ కూడ మొదట కామాన్నే ప్రస్తావించారు. ఇదే విషయాని భగవద్గీతలో శ్రీకృష్ణుడు ““విషయవాంఛలను గూర్చి సదా మననము చేయువానికి, వాని యందను రాగమధికమై, అది కామముగా మారి చివరకు క్రోధమగును. క్రోధమువలన అవివేకము కలుగును. దీనివలన జ్ఞాపకశక్తి నశించి దాని ఫలితముముగా మనుజుడు బుద్ద్దిని కోల్పోయి చివరకు అధోగతి చెందును”.” అంటే కామం వుండడం వలన చాల చాల దుష్ప్రయోజనాలు వున్నాయి. అదే విధంగా మనం ఇంతవరకు జ్ఞానాన్ని గ్రహించకపోవడానికి మనం ఈ జనన మరణ చట్రంలో ఇరుక్కొని పోవడానికి కారణం కూడ ఈ కామమే. దీనిని భగవద్గీతలో శ్రీకృష్ణుడు “”అర్జునా! పొగచేత అగ్ని, మురికిచేత అద్దము, మావిచేత శిశువు యెట్లు కప్పబడునో, అట్లు కామము (కోరికల) చేత జ్ఞానము కప్పబడి యున్నది”. కాబట్టి దీన్ని జయించడమే ఉత్తమం.
వీటితో పాటు ఈ కామం మూలంగా మన మనస్సులో కూడ ఎప్పుడు సముద్రంలో అలల లాగ మన మనస్సులో కూడ అలలు వస్తూనే ఉంటాయి. అంటే మన మనస్సులో కలిగే మరియు జరిగే ప్రతి అలజడికి కారణం ఈ కామమే మూల కారణం. అందువలన కామాన్ని (కోరికలను) అణచివేస్తే గాని మనం మన లక్ష్యానికి మనం దగ్గర అవలేము. కాని కోరికలను ఎలా అణచివేయాలి? కామాన్ని ఎలా జయించాలి?
(లక్ష్యం : లక్ష్యం అంటే మొదటిది స్థితప్రజ్ఞత(సమానుభావము) మరియు మనస్సును నశింపచేయాలి. ఈ రెండు కూడ మనకు భగవంతునిని దగ్గరకు చేస్తాయి.మనకు ధ్యానంలో ఆ దేవదేవుని సాక్షాత్కారానికి సహకరిస్తాయి.)
మనం కామాన్ని ఎందుకు జయించాలో తెలుసుకున్నాము. కాని ఎలా జయించాలో చూద్దాం. కామాన్ని జయించడం అంటే అందరూ అనుకున్నట్లు చాల కష్టమైన పనేమీ కాదు. దీనిని జయించడం చాల చాల సులువైన పని. దానికి మనం చేయవలసిందల్లా దానిని సానుకులపరచడమే అంతే. దాన్ని జయించినట్లే. దానిని సానుకులపరచడం అంటే దానికి శాస్వతతత్వాన్ని తెలియపరచి, శాశ్వతమైన దానిని తెలియజేసి నిత్యమైన దాని కోసం వెతకడం ప్రారంభిస్తే చాలు. అది అప్పటి నుండి దాని మార్గాన్ని మార్చుకుంటుంది. అంటే ఇక్కడ మనం ఇంత వరకు అజ్ఞానంలో అనిత్యమైన వాటి కోసం ప్రాకులాడుతున్నాము. ఇప్పుడు దాని మార్గాన్ని మరల్చాలి. మరల్చి భగవంతుని మీదకు ద్రుష్టి నిలిపేలా మనం గ్రహించిన జ్ఞానంతో మనకు ఉన్న బుద్ది అనే సాధనంతో మనస్సులో కరిగే కోరికలనన్నిటికి స్వస్తి పలికి శాశ్వతమైన, నిత్యమైన, లక్ష్యమైన ఆ పరమాత్ముని దివ్య దర్శనమే ఏకైక లక్ష్యంగా ఉండేలా గాఢమైన కోరికను మన మనస్సులో స్థిరపరచులోవాలి. ఆ విధంగా స్థిరపరచుకుంటే మన మనస్సులో నిదానంగా అశాశ్వతమైన వాటి మీద ఉన్న ధ్యాస పోయి శాశ్వతమైన పరమాత్మమీద మాత్రమే కోరిక కలుగుతుంది. దీనితో పాటు మనం కొన్నిటిని ప్రతిదినం అలవారచుకుంటే మనం సంపూర్ణంగా, పరిపూర్ణంగా కామాన్ని జయించినట్లే. అవి
- మొదట మనం భగవంతుని ముందర కోరికలను కోరడం (అంటే అవికావాలి,ఇవికావాలి అని) కోరుకోకూడదు. జరిగిపొయినవి అన్నియు మన మంచికే, జరగబోతున్నవి కూడా మన మంచికే అని ముందు మన మనస్సును సమాధానపరచాలి.
- రోజు చేసే పనిని అది ఏదైనా భగవంతార్పణ బుద్దితో, నిష్కల్మషంగా (అంటే ఎటువంటి కల్మషం లేకుండా), ఫలాపేక్షరహితంగా కర్మలను ఆచరిస్తూ వుంటే అప్పుడు నీ మనస్సు అంతఃకరణ నిదానంగా ఖచ్చితంగా పరిశుద్దమై అదే కోరికలను త్యజిస్తుంది ఎందుకంటే అప్పుడు నీ మనస్సుకు ఒక భావన కలుగుతుంది అది ఏమిటంటే ఇవి అన్నియు అనిత్యమైనవి కదా అనే భావన రోజు రోజుకు నీలో అధికమవుతుంది.
- ప్రతి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే మంచం దిగకుండా అలాగే కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు అట్లే కూర్చొని సాధన(ధ్యానం) చేస్తే నీలో సంపూర్ణంగా కోరికలు అన్నీ అవియే సమసిపోతాయి అంతేకాక నీ మనస్సు కూడ చాల హాయిగా, ఆనందంగా వుంటుంది.
- అదే విధంగా ప్రతి రోజు రాత్రి నిద్ర పోయే ముందు కూడ మంచం ఎక్కగానే ఒక 10 నిముషాలు కూర్చొని నీ హృదయంలో దివ్య జ్యోతి వుందని మనస్సులో సంపూర్ణంగా భావించుకొని నీ హృదయ స్పందన మీద మాత్రమే ఏకాగ్రతను నిలిపి 10 నిమిషాలు కూర్చొని సాధన(ధ్యానం) చేసి ఆ తరువాత అలానే భావించుకుంటూ నిద్రపోతే చాల ప్రశాంతమైన మరియు చాల సుఖవంతమైన నిద్ర వస్తుంది.(దీనినే నిద్రలో నిశ్చింతత అంటారు) ఉదయం నువ్వు లేవగానే నీ మనస్సుకు ఒక relief reliefrelief వచ్చినట్లుగా వుంటుంది.
ఈ విధంగా మనం మన ఆలోచన విధానాలను మరియు ఎంచుకొనే మార్గాలను ఒక శాశ్వతమైన దాని మీదకు మరలిస్తూ వుంటే మిగిలినవి అన్నియు వాటికవే సర్దుకుంటాయి. అప్పుడు నువ్వు సంపూర్ణంగా కామాన్ని జయించిన వాడివి అవుతావు.
👏👏👏👏
సేకరణ. మానస సరోవరం
Source - Whatsapp Message

No comments:
Post a Comment