Monday, March 29, 2021

ఈఐదు 'జ' కారాలనూ తృప్తి పరచటం కష్టం.

జామాతా, జఠరం, జాయా, జాతవేదా, జలాశయ:

పూరితేనైవ పూర్యన్తే జకారా: పంచ దుర్లభా: (దుర్భరా)

లోకములో తృప్తి అనేది వేటికి వుండదు?
అని ఆలోచించి ఒక కవి యిలా అన్నాడు:

ఈ లోకం లో ఐదు
'జ' కారాలున్నాయి.
వాటికి ఎంత చేసినా తృప్తి అనేది వుండదు. అవి ఏమిటంటే :

(1) 'జామాతా' అంటే అల్లుడు.
ఎంత యిచ్చినా చాలు అనని వాడు.

(2) 'జఠరం' అంటే కడుపు.
దీనికీ అంతే ఎంత తిన్నా మరునాటికి మామూలే.

(3) 'జాయా' అంటే భార్య.
ఈవిడ కూడా అంతే.
ఎంత మంచిగా ఉన్నా ఎప్పుడూ కోపమే.

(4) 'జాతవేదా' అంటే అగ్ని.
ఎన్ని వస్తువులు వేసినా కాలిపోతూ వుంటాయి.

(5) 'జలాశయ' అంటే సముద్రము.
ఎంతనీరు వచ్చి పడినా తృప్తి లేదు.

ఈఐదు 'జ' కారాలనూ తృప్తి పరచటం కష్టం.

శాశ్వత మైన జఠరాలు.
అసంతృప్తి తప్ప,
తృప్తి అనేదే ఉండదు.

సర్వే జనా సుఖినోభవంతు
🌹👏🏾🌷

Source - Whatsapp Message

No comments:

Post a Comment