Wednesday, March 31, 2021

మంచి మాటలు....

కోపంతో చేసే పనులు పశ్చాత్తాపంతో ముగుస్తాయి...

శాంత చిత్తంతో చేసే పనులు పరమానందంతో ముగుస్తాయి..

ఆవేశంతో మాట్లాడిన మాటలు అనర్థాలను మోసుకొస్తాయి..

ఆత్మీయతతో మాట్లాడిన మాటలు
పరులను కూడా అయినవారిగా చేస్తాయి..

ఈర్ష్యతో చేసిన ఆలోచనలు ఒంటరితనాన్ని మిగిలిస్తాయి..

కోపం వచ్చినపుడు కళ్ళ నుండి కన్నీరు రావాలి..

కానీ

నోటి నుండి మాట రాకూడదు..

కన్నీటితో కోపం పోతుంది..

కానీ

మాట జారితే ఎదుటివారికి బాధ కలుగుతుంది..

కోపం తెచ్చుకొనే హక్కు ఎవరికైనా ఉండవచ్చు..

కానీ

ఆ కోపంతో కూృరంగా ప్రవర్తించే హక్కు మాత్రం ఎవరికీ లేదు.....


కోపం మంచిదే..

అమ్మ కోపం కడుపు నింపడానికి..

నాన్న కోపం బ్రతుకు నేర్పడానికి..

గురువు కోపం బుద్ధి నేర్పడానికి..

స్నేహితుల కోపం దారి చూపడానికి..

చెలి కోపం ప్రేమ తెలపడానికి..

శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి..

కాబట్టి..

కోపం ఎదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది..

అన్నింటికన్నా గొప్పవరం సంతోషంగా ఉండగలగటమే.

ప్రేమతోనే ద్వేషాన్ని దూరం చేయగలము.

సహనం కోల్పోకూడదు.

చెడు ఆలోచనలే సమస్యలకు కారణము.

మార్చలేని గతాన్ని గురించి ఆలోచించడం ఎందుకు.

రాబోయే భవిష్యత్తు గురించి శ్రమించు.

ప్రయత్నం చేసినా ఓడిపోవచ్చు,

కానీ

ప్రయత్నం చేయడం మాత్రం ఆపకూడదు.

కష్టాలు ఎదురైనప్పుడే మనిషి సామర్థ్యం తెలుస్తుంది.

ఎంత కాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు,

ఎంత గొప్పగా జీవించామన్నది ముఖ్యం.

విద్య నీడలాంటిది, దానిని మన నుంచి ఎవరు దూరం చేయలేరు.

విజయం సాధించాలంటే చేసే పనిని ప్రేమించాలి.

జీవితంలో విలువలు నేర్పించేదే నిజమైన విద్య.

ఎన్ని పూజలు చేసినా బుద్ధి వంకరగా ఉంటే ఉపయోగం లేదు.

సత్యవచనాలను కూడా ప్రేమపూరితంగానే చెప్పాలి.

సంశయం సద్గురువు ఇచ్చే వరాలను శిష్యునికి అందకుండా చేస్తుంది.


" ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది

కలలు కంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు

సింహం నోరు తెరుచుకున్నంత మాత్రాన వన్యమృగం దాని నోటి దగ్గరకు వస్తుందా "


" నీ తప్పు నీతో చెప్పేవాడు స్నేహితుడు,

నీ తప్పు ఎదుటివాళ్ళతో చెప్పేవాడు మిత్రుడిలా కనిపించే..
నీ అనుకూల శత్రువు. "


మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి ఆశయాన్ని స్వీకరించండి

బలహీనపరిచే ప్రతి ఆలోచననూ తిరస్కరించండి.

ఆకాశంలో అంత ఎత్తులో గద్ద రెక్కలాడించకుండా ఎలా ఎగరగలుగుతుంది....

ఎండుటాకులు, దూదిపింజెలు, వెంట్రుకల లాంటి తేలికైన వస్తువులు గాలిలో తేలుతూ చాలా సేపు కింద పడకుండా ఉండడం తెలిసిందే.

అదే రాయిలాంటి వస్తువులు పైనుంచి కిందకి తటాలున పడిపోవడం కూడా మనకు తెలుసు.

ఎత్తు నుంచి కిందకి పడే వస్తువుపై గాలి వల్ల ఏర్పడే నిరోధక బలం పని చేస్తూ ఉంటుంది.

దీని ప్రభావం ఆయా వస్తువుల సాంద్రత, పరిమాణం, బరువులాంటి అంశాలపై ఆధారపడి ఉంటుంది.

గద్ద విషయానికి వస్తే దాని రెక్కలు చాలా విశాలంగా ఉంటాయి.

గద్ద పరిమాణం దాని బరువుతో పోలిస్తే చాలా ఎక్కువ.

ప్యారాచూట్‌ కట్టుకున్నప్పుడు, గ్త్లెడర్‌ పట్టుకున్నప్పుడు మనుషులు ఎలాగైతే గాలిలో తేలుతూ ప్రయాణించగలరో గద్దకూడా అలా చేయగలదు.

గద్ద ఆకాశంలోకి ఎగరడానికి మామూలుగానే రెక్కలు ఆడించినా,

పైకి వెళ్లాక రెక్కలను విశాలంగా చాపి గాలి నిరోధాన్ని, గాలి వేగాన్ని ఉపయోగించుకుని బ్యాలన్స్‌ చేసుకుంటూ తన శక్తిని ఆదా చేసుకుంటుంది.

మరింత ఎత్తుకు ఎగరాలంటే మాత్రం రెక్కలు అల్లల్లాడించవలసిందే.


ఆకలితో ఉన్న జంతువు కన్నా అత్యాశతో ఉన్న మనిషే ప్రమాదకరం.....

ఒకరితో మరొకర్ని పోల్చడం ఎంత మాత్రం సరికాదు.


పిల్లలు.. ఎవరికి వాళ్లే ప్రత్యేకం.

చదువు విషయంలో ఒకరు ముందు ఉండొచ్చు.

అలాంటప్పుడు మరొకరిని నేర్చుకోమని పోల్చి చూడకూడదు.

మిగతా వారికి దేంట్లో నైపుణ్యం ఉందో గుర్తించి, దాన్ని ప్రోత్సహించాలి.

ఒకరు క్లాస్‌ఫస్ట్‌ వస్తే మిగతావారినీ అలాగే రావాలని ఒత్తిడి చేయడం మంచిదికాదు.

అలా చేయడం వల్ల రెండోవారిలో ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది.

తానెందుకూ పనికిరానని కుంగుబాటుకు గురికావచ్చు.

ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గుర్తించి,

వాటికి మెరుగులు దిద్దడానికి మీ వంతుగా ప్రయత్నించాలి.

Source - Whatsapp Message

No comments:

Post a Comment