Friday, March 5, 2021

పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!

పంచభూతాలు మన అరచేతిలోనే ఉన్నాయా!

మీరు ఎప్పుడైనా పండితులు, పురోహితులు ఆరాధన చేస్తుండగా చూసారా. వివిధ ఆలయాల్లో అర్చకులు దేముడికి హారతి ఇచ్చేటప్పుడు, నైవేధ్యం పెట్టేతాప్పుడు గమనించారా. ఆ సమయంలో వాళ్ళు అరచేతిని తిప్పుతూ వేళ్ళతో కొన్ని ముద్రలు పెడుతూ ఉంటారు. అలాగే భరతనాట్యం, కూచిపూడి మొదలైన నాట్యాలలో కూడా చేతి ముద్రలకి ఎంతో విశిష్ఠ స్థానం ఉంది. యోగా చేసేటప్పుడు, ధ్యానంలో ఉన్నప్పుడు కూడా ఎంతో మంది చేతులతో వివిధ రకాలైన ముద్రలు వెయ్యటం మనం చూస్తూ ఉంటాం.

మన పురాతన వైదిక సాంప్రదాయాన్ని ఒకసారి గమనించినట్లయితే మనకు ఎంతో సులువుగా అర్ధమయ్యేది ఏంటో తెలుసా? మన చేతి వేళ్ళల్లోనే పంచభూతాలు నిక్షిప్తమై ఉన్నాయి అని. మనకే తెలియని శక్తి మన చేతి వేళ్ళలో దాగి ఉంది. బొటను వేలిలో అగ్ని, చూపుడు వేలిలో గాలి, మధ్య వేలిలో ఆకాశం, ఉంగరం వేలిలో భూమి, చిటికిన వేలిలో నీరు ఉంటాయట. మన చేతిలో ఉన్న శక్తి మనకి తెలియట్లేదు. చేతి వేళ్ళలో ఉన్న శక్తి నరాల ద్వారా మెదడు వరకు వ్యాపిస్తుంది. అలాగే మేడగు నుంచి నరాల ద్వారా వేళ్ళల్లోకి ప్రసరిస్తుంది. అందుకే ఆశీర్వచనానికి కూడా మనం పెద్ద పీట వేశాం. పెద్దవాళ్ళు పిల్లల్ని ఆశీర్వదించటం ద్వారా వారి చేతిలో ఉన్న శక్తి కలిపిన అక్షింతలకు అంటి మన తల మీద పడేసరికి మనకి ఏదో తెలియని బలం వచ్చినట్టు అనిపిస్తుంది.

అలా పంచభూతాలు మన అరచేతిలోనే ఉండటం వల్ల మనం వేసే ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క శక్తి ఆవహించి ఉండి దాని పని అది చేసుకుని పోతుంది. చేతితో అన్నం తినటం కూడా మన పెద్దవాళ్ళు మంచిదని ఊరికే చెప్పలేదు. అన్నాన్ని ముందుగా నీటితో శుద్ధి చేసుకుని చేత్తో తినటం వల్ల చేతిలో ఉన్న శక్తి తరంగాలు అన్నం జీర్ణం అయ్యేలా చేస్తాయి. మనం తినే అన్నంలో ఏవైనా దోషాలు ఉన్నా అవి తగ్గుతాయి కూడా. మన శక్తి మనకి తెలియక పాశ్చాత్య ధోరణులకి ఆకర్షించబడి మనం స్పూన్స్ తో తినటం అలవాటు చేసుకుంటున్నాం. అందుకే తినే పదార్థాలు శుద్ధి కాక మనకి ఇన్ని అనారోగ్యాలు

అంతేకాదు మన చేతి వేళ్ళల్లో ఇలా శక్తి తరంగాలు, పంచభూతాలు నిక్షిప్తమై ఉండటం వల్ల మనం చేతితో ఎక్కువసేపు పట్టుకునే వస్తువుల ప్రభావం కూడా మనపై ఎంతో ఉంటుంది. జపం చేసేవాళ్ళు మానసిక ప్రశాంతత కోరుకుంటారు కాబట్టి వాళ్ళు తులసి పూసలు చేత్తో తిప్పుతూ జపం చేస్తారు. అలాగే మనం నిశితంగా పరిశీలిస్తే చేత్తో ఎక్కువసేపు పెన్ను పట్టుకుంటే కాసేపయ్యేసరికి పేపర్ కనిపిస్తే ఏదో ఒకటి రాయాలని లేదా ముగ్గులు వెయ్యాలని అనిపిస్తూ ఉంటుంది. అలాగే కర్ర కాసేపు పట్టుకుని ఉంటే దానితో దేనినైనా కొట్టాలని అనిపిస్తుంది. అలాగే కత్తి చేత్తో పుచ్చుకుంటే కాసేపయ్యేసరికి దేని మీదైనా విసిరి అది విరిగేలా చెయ్యాలనిపిస్తుంది లేదా దేనినైనా పొడవాలనిపించి ఆఖరికి కూరగాయలని అటు ఇటు గాట్లు పెడతాం. ఇలా మనం చేత్తో ఏ వస్తువు పట్టుకుంటే ఆ వస్తువు సహజ గుణాన్ని మన చేతులు గ్రహించి వాటితో చేసే పనులు మనం స్వయంగా చేసేలా చేస్తాయి.

ఆఖరికి మన జీవితం ఎలా ఉంటుందో కూడా మన అరచేతిలోనే ఉంటుంది. అందుకే హస్తసాముద్రికంలో మన చేతిలోని రేఖలని చూసి మన జాతకం చెపుతారు. ఇంకా మనకి తెలియని ఎన్నో విద్యలలో కూడా చేతి వేళ్ళను ఉపయోగించి చికిత్స చేసే విధానం కూడా ఉంది. అంత శక్తి ఉన్న చేతులు మనకి ఉన్నాయని గుర్తించకపోవటం మన తప్పే. ఇలా పంచాభూతలనే మన చేతిలో పెట్టిన దేముడికి ఎన్నిసార్లయినా చేతులెత్తి మొక్కచ్చు.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment