నేటి జీవిత సత్యం.
ఈ లోకంలో మనకంటూ ఒకరుండాలి. మనకంటే ‘మనకు మనకే’ అని కాదు. మనకోసం. మనకోసం మనసిచ్చేందుకు. మనకోసం ప్రాణమిచ్చేందుకు. అదీ ఇదీ అని కాదు. ఏదైనా ఇచ్చేందుకు, ఏమైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా...! అవును. అలాంటివారు ఒకరుంటే జీవితం ఎంత బేఫికర్‌గా ఉంటుంది! పండు వెన్నెల్లో, పూలపడవలో ప్రయాణంలా ఉంటుంది. కష్టం ఇష్టంలా ఉంటుంది. ఇష్టం మరింత ఇష్టమైపోతుంది. పసితనంలో- అమ్మ ఉంటే చాలు. అన్నం లేకపోయినా ఫరవాలేదు. అన్నీ లేకపోయినా ఫరవాలేదు. అయితే అది కొంతవరకే. ఆ తరవాత మన అవసరాలకు అమ్మ చాలదు. ఎందుకంటే తెలివిమీరిన మనిషికి ప్రేమ ఒక్కటే చాలదు. అమ్మప్రేమ ఒక్కటే చాలదు. అందుకే అమ్మలా ఒకరు కావాలి- అమ్మకంటే మిన్నగా అవసరాలు తీర్చేవారు!
నిజమే, మనిషికి అవసరాలు పెరుగుతాయి. వాటితోపాటే కష్టాలు, కన్నీళ్లు... ఎన్నో. వాటిని పంచుకునేందుకు, వీలైతే వాటిని తీర్చేందుకు... ఒకరుండాలి. మనం ఎవరమైనా ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా- అమ్మలా అక్కున చేర్చుకునేలా ఒకరుండాలి. అతడు సర్వశక్తిమంతుడైతే, ఎదురులేనివాడైతే, ఎవరికీ జవాబుదారీ కానివాడైతే, మనకు అండ, దండ, కొంత అన్నీ వాడే అయితే అలాంటివాడి తోడు, ఆదరణ, భరోసా లభిస్తే జీవితం పండగకాక మరేమిటి? అయితే ఇది ఊహించటానికి అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది, ఉండాలని ఆశగా ఉంది. కానీ అటువంటి తోడు ఉంటుందంటే అభూత కల్పనలా ఉంది. అతిశయోక్తిలా ఉంది. జీవితంలోని అసంబద్ధ కోరికలు, తప్పొప్పుల చిట్టా మనకే ఎబ్బెట్టుగా, అసహ్యంగా ఉంటుంది. ఇన్ని అవసరాలు, అపసవ్యాల మనిషిని, మనల్నీ... అన్నీ పట్టించుకోకుండా- మన కోసం, మనకోసమే ఉన్నాననే ఆ ఉదారుడెవరు? మన మనసులో మనసుగా, శ్వాసలో శ్వాసగా, కళ్లలో నీళ్లుగా, నిట్టూర్పులో ఓదార్పుగా... ఉంటారంటే- ఎంత బాగుంది? ఎంత అద్భుతంగా ఉంది. అది సాధ్యమవుతుందంటే- మనకు అపనమ్మకం!
మనకు తెలీదు. తెలిసినా మనం నమ్మలేం. నమ్మలేక, గుడ్డివాళ్లుగా బెంబేలెత్తిపోతున్నాం. ఎందుకంటే మనమెంత మంచివాళ్లమో ఎంత నిజాయతీపరులమో మనకు తెలుసు. ముఖ్యంగా అలాంటి వరానికి మనమెంత అర్హులమో అన్నింటికంటే బాగా తెలుసు. వాస్తవమేమిటంటే మన నమ్మకాలు, అపనమ్మకాలతో పని లేకుండా, మనం వెదుక్కునే అవసరం కూడా లేకుండా ఆ అద్భుత, అజ్ఞాతవ్యక్తి(!) మన పక్కనే, మన ఎదురుగానే, ముందూ వెనకా, పైనా కిందా... ఊహూ... మనలోనే మన అణువణువునా ఉన్నాడంటే మనం నమ్మగలమా? కానీ తప్పదు. ఎందుకంటే... ఉన్నాడు.
మన అర్హతానర్హతలు ఆయనకు అవసరంలేదు. మన స్థితిగతులతో ఆయనకు పనిలేదు. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు సకలం సమకూర్చిన మావిని బొడ్డుకోసి అవతల పడేసినట్టు, మనల్ని సృష్టించి పోషిస్తున్న భగవంతుడి ఉనికినీ మరచిపోయినా, అసలు గుర్తించకపోయినా- ఆయన మాత్రం మనల్ని వదలడు. అందుకే ఆయన ఉన్నాడు, ఉంటాడు. అంతే!
సేకరణ మానస సరోవరం.
Source - Whatsapp Message

No comments:
Post a Comment