Monday, March 29, 2021

ఈ శరీరం కర్మ ఫలమే

ఈ శరీరం కర్మ ఫలమే
🕉️⚜️🌎🏵️🌼🚩

ధర్మం చాలారకాలుగా ఉంటుంది. చాలా సూక్ష్మంగా ఉంటుంది. వేదవిహితము, పెద్దలమాటలూ , వారి ఆచరణ చూసి ధర్మసూక్ష్మాన్ని గ్రహించాలి. సత్యవ్రతం గొప్పది. కాని ఇతరులకు జరిగే అపాయాన్ని నివారించడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ఏ ప్రాణికైనా అపకారం కలిగించే నిజం అబద్ధం చెప్పడంతో సమానం. ప్రాణాపాయ స్థితిలో, వివాహసమయంలో చెప్పే అసత్యం నిజంతో సమానం. కులవృత్తి దైవ సమానం. ఇష్టాయిష్టాలతో పని లేకుండా దానిని ఆచరించడం మానవ ధర్మం. మనము అనుభవించే కష్టసుఖాలు మనం పూర్వజనమలో చేసిన పాపపుణ్యాలే కారణం. ఇది తెలియని మూఢులు దైవాన్ని దూషిస్తారు. మానవులు తాము చేసే పనులకు తామే కర్తలమని భావిస్తారు. అది అజ్ఞానం అదే నిజమైతే తాము చేసే కార్యములన్నీ ఎందుకు ఫలించడం లేదు. ధర్మాత్ములు, నీతిమంతులు చేసే కార్యములు ఒక్కోసారి నిష్ఫలమతున్నాయి కాని దుర్మార్గులు చేసే పనులు ఫలిస్తున్నాయి. కొందరికి అనాయాసంగా ధనరాశులు వచ్చి పడుతున్నాయి. కొందరికి ఎంత శ్రమించినా పేదరికం పోదు. కటిక దరిద్రులకు పేదవారికి వద్దన్నా సంతానం కలుగుతుంది. కొందరు ధనవంతులకు ఎన్ని వ్రతాలు చేసినా సంతానం కలుగదు. ఇదంతా పూర్వజన్మ కర్మ ఫలమే. మానవులు కర్మాధీనులు కాకుంటే రోగాలు, మరణం లేకుండా బ్రతకవచ్చు కదా. కనుక ఈ శరీరం కర్మ ఫలంగానే ఏర్పడుతుంది. శరీరం చేయవలసిన పనులు కర్మవశాన నిర్ణయించబడతాయి. మరణానంతరం కర్మఫలాన్ననుసరించి దేహధారణ నిర్ణయించ బడుతుంది.

*సేకరణ మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment