🙏 మహాశివరాత్రి 🙏
🔱ఈ రోజు శుభ దినం.మహా శివరాత్రి. అంటే దైవం ప్రకృతితో కలసిన దినం. రాత్రి మాత్రేమే శివ రాత్రి అంటారు.అంటే దైవం ధ్యాన స్థితిలో ఉన్న సమయము దైవం ఎప్పుడూ ధ్యాన స్థితిలోనే ఉంటుంది. మనము కూడా నిరంతరం ధ్యాన స్థితిలోనే ఉండవలే.
చేసే పనిని కార్యం అంటాము.మనం ఏ కార్యం చేస్తున్నా దైవం చేయిస్తున్న కార్యం అని భావించినప్పుడు , పలితం ఏమైనా దైవమే అందిస్తుంది. కాకపోతే నిరంతరం మాత్రం దైవత్వ స్థితిలో ఉందవలే. దైవత్వ స్థితి అంటే ఏమిటి? నిరంతర ఆలోచనా స్థితిలో ఉండడమే దైవత్వ స్థితి. మరి అటువంటి స్థితి పొందాలి, అంటే మన మనస్సు నిరంతరం సిద్ది జరుగుతూ ఉండాలి. మన మనస్సు శుద్ది, అంటే మనలో ఉన్న వికారాలు శుద్ది జరుగుతూ ఉండాలి. వికారాలు అంటే కామ, క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనే మాలిన్యాలు పోవాలి.కోపం, జలసి,అసూయ, ఇర్ష్యా,ద్వేషం దూషించడం, విమర్శించడం వంటి మొదలగు భావాలను కూడా నిరంతరం వదులుతూ ఉండాలి.ఈ గుణాలు అన్ని మనలో ఎక్కడ ఉంటాయి? అంటే మనస్సుని అంటి పెట్టుకొని ఉంటాయి. మనస్సుని అంటి పెట్టుకున్న మలిన్యము పోవాలంటే ఎన్ని సార్లు గంగలో మునిగిన పోదు. ఎన్ని దాన ధర్మాలు చేసినా పోవు. ఎంత దైవ నామ స్మరణ చేసినా పోదు, ఎన్ని రోజులు ధ్యానం చేసినా పోదు.కారణం మనం ఇత్యాది కార్యములు చేసేది , ఏ భావంతో చేస్తున్నాము? అన్నది ముఖ్యం. మనం చేసేది మనకు మంచి జరుగుతుంది, నా కర్మలు క్లియర్ అవుతాయి, నా పాపాలు పోతాయి, నా జన్మ చరితార్థం అవుతుంది, నాకు మోక్షం వస్తుంది, మొదలగు భావాలతో చేస్తూ ఉంటాము
కానీ ఇది ఒక రకంగా లెర్నింగ్ స్థాయిలో సరిపోతుంది.కానీ పూర్తి స్థాయిలో సరిపోదు... మన భావన ఎలా ఉండాలి, అంటే నేను దైవత్వ స్థితిని పొందాలి , ఆన్న సంకల్పం చేసుకుని ఆ దశలో ప్రయత్నం చేయాలి. అంత వరకు మన మనస్సులో ఉన్న మాలిన్యం పోదు....
ఇక శివరాత్రి జాగారం గూర్చి తెలుసుకుందాం మహా శివుడు అని అనుకోండి, దైవం అనుకోండి చైతన్యం అనుకోండి ఇవన్నీ పర్యాయ పదాలు . నేను దైవం అని పిలుస్తాను. ఇక్కడ దైవం ధ్యాన స్థితిలో ఉండి ప్రకృతి తో కలిసిన దినం శివరాత్రి. మరి దైవం తనకు తాను నేత్రములు (ఇది మన భాష) మూసుకొని ఉన్న స్థితి తన స్థితి.నేత్రములు తేరవగానే ప్రకృతి ఆవిర్భవించిన స్థితి. మరి ఇక ప్రకృతి ఆవిర్భవించిన తర్వాత తను నేత్రములు మూయలేదు. సృష్టి మొదలైనది.
ఇక్కడ ప్రకృతి అంటే మన దేహం. దైవం అంటే మన ఆత్మ ఆత్మ దేహంతో కలిసి స్తృష్టి మొదలు పెట్టింది. గణేశుడు అంటే బుద్ధి. కుమారస్వామి అంటే మనస్సు. గణేశుడు ఐన బుద్ధి ఎప్పుడూ అమ్మ,నాన్న ఐన ఆత్మ ,దేహంతో తో కూడి ఎప్పుడూ ధ్యాన స్థితిలో ఉంటుంది. మనస్సు ఐన కుమారస్వామి ఎప్పుడూ బయటకి తిరుగుతూ ఉంటాడు. ఎప్పుడైతే బయట తిరగడం సరి కాదు , అని అనుకుంటాడో అప్పుడు తన అన్నగారు ఐన బుద్ధితో కలిసి తల్లి,దండ్రుల చుట్టూ తిరగడం నేర్చుకుంటాడు.అప్పుడు మాత్రమే తాను అనుకున్నది సాధించడం జరిగింది. విశ్వం అంతా తిరగడం కంటే తన చుట్టూ తాను తిరగడం విశ్వం చుట్టూ తిరగడం అని తెలుసుకున్న వాడు బుద్ధి ఐన గణేశుడు. విశ్వం తిరగడం అంటే ఎక్కడో బయట తిరగం అని అనుకున్న వాడు మనస్సు ఐన కుమారస్వామి.
ఇక ఇక్కడ మనం మన మనస్సుని నిరంతర సిద్ది చేస్తూ ఉండాలి.బయట తిరిగిన మనస్సు మాలిన్యం పొంది ఉంది శుద్ది చేస్తే గానీ బుద్ధి తో కలవదు.మనస్సు బుద్ధి కలిసి ఆత్మ తో కూడి ఉంటే అది ధ్యాన స్థితి..,
ఈ రోజు సంకల్పం పెట్టుకోండి.నా మనస్సుని శుద్ది చేసుకుంటాను.అని సంకల్పం చేసుకుని శుద్ది చేయడం ఈ క్షణము నుండి ప్రారంభించండి.అదే జాగరణ అంటే ఈ ఒక్క రోజే జాగరణ కాదు నిరంతర జాగరణ శివరాత్రి అన బడుతుంది......🙏
మీ
మురళీ మోహన్
Source - Whatsapp Message

No comments:
Post a Comment