Saturday, March 6, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధు మిత్రులకు శుభోదయం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబ సభ్యులకు మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తిరుత్తణి సుబ్రమణ్య స్వామి వారి మరియు శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాల తో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. మీ AVB సుబ్బారావు 🌷🤝💐🕉️
శని వారం --: 06-03-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

నా జీవిత పయనంలో నా గురుంచి నలుగురు ఏమనుకొంటున్నారో అని అనవసరం ఎదుటి వారి మాటలు నేను పట్టించించుకొని బాధపడుతూ నా కాలం ను నేను వృధ చేసుకోను . నాకు తోచిన మంచేదో చేస్తా నేనేంటో నాకు ప్రతిధి ఒకరి దగ్గర నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నా జీవితం నాకు తృప్తి నేనప్పుడూ సంతోషంగానే ఉంటా !.

ఎవరైన చేసిన తప్పును ఒప్పుకొని క్షమించమని చెప్పే వారిని ఎప్పుడు దూరం చేసుకోకండి . ఎందుకంటే అలాంటివారు నిజాయితీగా ఉంటారు , వాళ్ల ఈగో కంటే మీకే ఎక్కువ విలువ ఇస్తారని తెలుసుకోండి . అది బంధం అయినా స్నేహం అయినా .

కురిసే వానకు స్వార్థం లేదు , పండే పంటకు స్వార్థం లేదు , నింగికి నేలకి లేని స్వార్థం మధ్య ఉన్న మనిషికెందుకు ? . మనం పుట్టినప్పుడు ఏమి పట్టుకరాలేదు పోయేటప్పుడు ఏమి పట్టుకపోము ఈ మూడునాళ్ళ ముచ్చటకోసం మోసాలెందుకు ! ద్వేషాలేందుకు .

సేకరణ ✒️మీ ...AVB సుబ్బారావు 🌷🤝💐🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment