Sunday, March 28, 2021

క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ, మన కోసం-మంచి మాటలు

🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️

🕉️మన కోసం-మంచి మాటలు🕉️


🤘క‌ర్మ‌ఫ‌ల‌మే జ‌న్మ


(కాస్త పెద్దదే.... మొత్తం చదివితే తెలుస్తుంది జీవన మర్మం)


ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు.

మరొకరు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎత్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మాలు కూడా వేరుగా ఉంటాయి...

పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం.

పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండరు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు.

అంటే పూర్వ జన్మలో చేసిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు.

ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.
పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది.

క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్టడం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి.

ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.
ఆసురీ గుణాలు
కామం…
అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.
క్రోధం…
క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.
లోభం…
లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.
మోహం…
మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.
మదం…
ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸ °వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.
మాత్సర్యం…
ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.
రాగము…
ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.
ద్వేషం…
ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.
ఈర్ష్య…
తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.
అసూయ…
తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.
దంభము....
తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.
దర్పం…
నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి
(అదే గర్వం)
అహంకారం…
అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు

ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశా నుసారం కర్మ చేయాలి.
మనిషి మరణానంతరం జీవుడు ఏమౌతాడు? పునర్జన్మ వున్నదా?

పునర్జన్మ అనేది వున్నది అని అంగీకరించడమే సనాతన ధర్మంయొక్క జీవగర్ర. సనాతన ధర్మమునందు వున్నాను అంటే పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అని అర్థం. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించాను అన్నదానికి గుర్తు ఏమిటంటే బొట్టుపెట్టుకున్నాను. పునర్జన్మ అన్న మాటకి అర్థం జీవుడు ఈ శరీరాన్ని వదలి ఇంకొక శరీరంలోకి వెళ్తాడు. శరీరం ఈశ్వరుడు ఎందుకు ఇస్తాడు అంటే చేసిన పాపాన్ని దుఃఖంగా, పుణ్యాన్ని సుఖంగా అనుభవించాలి. శరీరం లేదు పాప ఫలితం ఎలా అనుభవిస్తారు? ఎవరి కాలిమీదో కర్రెట్టి కొట్టాను. వాడు రెండేళ్ళు ఏడ్చాడు. ఇప్పుడు ఈ జన్మలో నాకు మోకాళ్ళు నొప్పులు వుండాలి. అప్పుడా పాపం మోకాళ్ళు నొప్పులుగా పోయింది. శరీరం వుంటే కదూ పోవడం. గతజన్మలో ఏదో పుణ్యం చేశాను ఈ జన్మలో సుఖపడాలి. ఈ సుఖానికి పుణ్యం కారణం. దుఃఖానికి పాపం కారణం. వచ్చే జన్మలో సుఖపడాలి అనుకుంటే పాపం మానేయాలి. ఒక విత్తనం వేసి ఇంకొక పంట కోయడం సాధ్యం కాదు. వరి విత్తనాలు వేసి మొక్కజొన్న కావాలంటే కుదరదు. చేసినవి పాపపు పనులు కావలసినవి సుఖాలు అంటే రావు. పుణ్యం చెయ్యి, సుఖాన్ని కోరుకో. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ఏం చేస్తుందంటే మనిషిని మనిషిగా బ్రతికేటట్లు చేస్తుంది. కర్మ చేసే అధికారం మనిషికి ఒక్కడికే. మిగిలిన ప్రాణులకు లేదు. అందుకే మనిషియొక్క ప్రవర్తనని నియంత్రించేది ఏది అని అంటే పునర్జన్మ సిద్ధాంతం.


ఒకప్పుడు కామకోటి పీఠాధిపత్యం వహించిన చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి వారి దగ్గరికి విదేశాలనుంచి ఒక వనిత వచ్చింది. గడపకి అవతల ఆవిడ కూర్చుంది. లోపల మహాస్వామి అభిషేకం చేసి వున్నారు. ఆవిడ బయటినుంచి ఒక ప్రశ్న వేసింది. పునర్జన్మ వున్నది, దానికి కారణము చేసిన పాపపుణ్యములు కారణము అంటారు కదా సనాతనధర్మంలో..! నిరూపించడానికి ఏదైనా ఆధారం వున్నదా? అని అడిగింది. ఆయనేమీ మాట్లాడలేదు. ఒక అరగంట అయిపోయింది.ఆవిడ అలాగే నుంచుంది ఏమైనా చెప్తారేమో నని. ఆయన ప్రక్కన వున్న అంతేవాసిని పిలిచి అన్నారు “ఈసందు చివరలో ఒక ప్రసూతి వైద్యశాల వుంది. ఈవిడని ఇవాళ మధ్యాహ్నం వెళ్ళమనండి. ఆ వైద్యశాలలో ఎన్ని గదులున్నాయి? ఏ ఏ గదిలో ఎవరు ప్రసవం కోసం వున్నారు? ఏ గదిలో వున్నవాళ్ళు ఏంచేసున్న వాళ్ళు? మరునాటి వుదయంలోపల వాళ్ళకి మగపిల్లవాడు పుట్టాడా? ఆడపిల్ల పుట్టిందా? ఆ పిల్ల/పిల్లవాడు పుట్టినప్పుడు వాళ్ళెలా భావిస్తున్నారు. ఇవి వ్రాసుకొని నాదగ్గరికి రమ్మనండి జవాబు చెప్తాను” అన్నారు. ఆవిడ మరునాడు వచ్చి ఏమీ అడగలేదు. మహాస్వామి వారికి కొంత దూరంలో నేలమీద పడి నమస్కారం చేసి “నాకర్థమైంది, పునర్జన్మ సిద్ధాంతం ఎంత సత్యమైనదో నాకు తెలిసిపోయింది. ఇక మీరు జవాబు చెప్పక్కరలేదు.” అన్నది. ఎలా? ఆవిడ అక్కడికి వెళ్ళి చూసింది. పది గదులున్నాయి. 8 గదులు మామూలువి. 2 గదులు ఏసి. మళ్ళీ ఈ ఎనిమిది గదులలో నాలుగు స్పెషల్ రూమ్స్. నాలుగు మామూలువి.

ఆవిడ మరునాటి ఉదయం వరకు పుట్టినటువంటి పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రుల స్థితి సేకరించింది. ఒకరు జిల్లాకి అధికారి. ఏసి రూములో ఆయన భార్యకి మొట్టమొదటి సంతానం కొడుకు పుట్టాడు. కొన్ని వందలమంది వచ్చి జిల్లా అధికారికి చేతిలో పుష్పగుచ్ఛాలు పెట్టి పళ్ళు పెట్టి అయ్యా మీకు కంగ్రాచ్యులేషన్స్ అండీ మీకు కొడుకు పుట్టాడు అంటున్నారు. ఇంకొకరికి సామాన్యమైన గదిలో ప్రసవమైనది, శస్త్రచికిత్స చేయవలసి వచ్చింది. వెయ్యి రూపాయలనుకున్నది పదివేలయింది. భర్త చూడడానికి రాలేదు ఎందుకంటే బిల్లు కట్టడానికి కావలసిన డబ్బు అప్పు చేసుకోవడానికి తిరుగుతున్నాడు. ఆయనకీ కొడుకే పుట్టాడు. ఇంకొక ఆవిడకి ప్రసవానికి వేళయిపోయింది. ఆవిడ గది కూడా తీసుకోలేదు. వరండాలో బల్లమీద పడుకోబెట్టి పురుడు పోశారు. నాలుగిళ్ళల్లో పనిచేసుకొనేటటువంటి వ్యక్తి. పుట్టడానికి ముందే ఎక్కడ పుట్టడానికి అనువుగా వుంటుందో ఎంత భోగకరమైన ప్రదేశంలో పుట్టవచ్చో ముందే నిర్ణయమైపోయిందా? అంటే వాడు ఎంత భోగమనుభవించాలి అని నిర్ణయింపబడితే కదూ వాడికి తెలియకపోయినా వాడికి పిల్లవాడిగా వచ్చాడు.గతజన్మలో చేసుకున్నది లేకుండా ఇలా ఎలా పుట్టారు? అక్కడే పుట్టేటట్లు చేసినవాడు ఒకడున్నాడు. అలా చేసేటప్పుడు వాడి పుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ పుట్టించాడు. వాడి పాపాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొక ఫలితాన్ని కూడా ఇస్తాడు. అందుకే ఆవిడ ఇక మాట్లాడలేదు. నాకు అర్థమైపోయింది ప్రసూతి కేంద్రానికి వెళితే పునర్జన్మ సిద్ధాంతం ఎంత గొప్పదో అని. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతం ప్రాణం.

మోక్షం కలడానికి భక్తితో అంటే ధార్మికమైనటువంటి జీవనాన్ని గడపగా గడపగా అనువైన సమయం చూసి పరమేశ్వరుడు యే కోరికా లేకుండా భక్తితో బ్రతుకుతున్నాడు గనుక చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధికి పాత్రత అంటారు. నా దగ్గర ఆవుపాలు గోరువెచ్చటివి వున్నాయి. పాలు త్రాగడానికి మీరు ఒక గిన్నె పట్టారు. అది అపరిశుభ్రంగా వుంది. అటువంటి పాత్రలో నేను పాలు పోస్తానా? పాలు విరిగిపోతాయి. వేరేది తెచ్చుకోండి అందులో పోస్తాను అంటారు. పాత్రత లేకుండా జ్ఞానమివ్వరు. పాత్రత కలగాలంటే చేసిన పుణ్యానికి ఫలితాన్ని అడగకూడదు. నేనొక పుణ్యం చేసి ఫలితం కావాలంటే సుఖం క్రింద ఇచ్చేస్తాడు.

అయిపోయింది ఆ పుణ్యం అక్కడితో పోయింది. ఒక పుణ్యం చేసి నాకే ఫలితం అక్కరలేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు – ఈశ్వరుడికే ధారపోశాను. పాపం అనుభవించేశాను. అనుభవించడానికి ఇప్పుడు పుణ్యం వుందా? లేదు. అనుభవించడానికి పాపం వుందా? లేదు. ఒకవేళ పాపం వున్నా చిత్తశుద్ధిని ఇస్తాడు. అది పాత్రత అంటారు. అందులో జ్ఞానధార కటాక్షిస్తాడు. జ్ఞానధార పోయగానే సంచితం తగలపడిపోతుంది. ఇక అనుభవించడానికి పాపంలేదు, పుణ్యం లేదు. పాపమూ, పుణ్యమూ లేని వాడికి ఇక శరీరమెందుకు? వాడు ఈశ్వరుడియందు ఐక్యమైపోతాడు. అదే మోక్షం.

బుద్ధుడు తిరిగి రాని విధంగా (పునర్జన్మ అంటూ లేని విధంగా ) గతించాడు కనుక ఆయన్ని సుగతుడనీ, తథాగతుడనీ కూడా పిలుస్తారు.
మనకు తెలియకుండానే కర్మలను చేస్తున్నాం. ఇది ప్రకృతి సిద్ధంగా వచ్చిన గుణం.
త్రికరణములు: 3 పనిముట్లు 1 మనస్సు 2వాక్కు3శరీరం.వీటితోనే మనం అనుక్షణం ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాం. ఇవన్నీ కర్మలే. ఇవి 2రకాలు.1బైటికి కనిపించేవి. 2కనిపించనివి.వాక్కాయాలతో చేసే పనులు కనిపిస్తాయి. మనస్సు తో చేసే పనులు కనిపించవు. ఇవి మళ్లీ 2రకాలు.పుణ్యకర్మలు.పాపకర్మలు.పుణ్యకర్మలవల్ల
సుఖం పాపకర్మల వల్ల దుఃఖం కల్గుతాయి. కర్మ(పనులు) ముగిసిన తరువాత వాటిప్రభావం
సూక్ష్మ శరీరం గా(మనోబుధ్ధిచిత్యహంకారములు)
ఏర్పడుతుంది. వీటిని కర్మవాసనలు అంటారు.
బాల్యం లోజరిగిన వాటిని ముసలితనం లో చెప్పడం
కొన్ని సార్లు గత జన్మ విషయాలు చెప్పడం వంటి
వన్నీ ఈ వాసనలే.

కర్మలను గురించి స్పష్టంగా తెలుసుకోవడం మేధావులకు కూడా సాధ్యం కాదు కర్మలను (పనులు) గురించి చక్కగా తెలుసుకున్నప్పుడే అశుభమైన సంసార వ్యామోహం నుండి బైటపడగలం. కర్మ ను గురించి మాత్రమే కాకుండా అకర్మ, వికర్మలను గురించి కూడా తెలుసుకోవాలి
స్థూలంగా కర్మ అకర్మ వికర్మలను గురించి తెలుసుకుందాం. 1కర్మ:శాస్త్రవిహితమైనవే
అంటే శాస్త్రము బోధించే కర్మలు. 2అకర్మ:ఫలితం కోరకుండా అంటే అహంకార మమకారాలను వదలి చేసే పని. కర్తగా భోక్త గా ఏవిధమైన
సంబంధం లేకుండా చేసే కర్మ. దీని వల్ల కర్మవాసనలు అంటవు. 3వికర్మ:శాస్త్రము నిషేధించిన కర్మలు. పాప కర్మలు. అంతేకాకుండా ఒకరికి కర్మ వేరొకరికి వికర్మ కావచ్చు. (వర్ణాశ్రమ ధర్మాలనుబట్టి) అందరికీ వర్తించే వికర్మలూ ఉన్నాయి. అందుకే గీతలో కర్మసిధ్ధాంతం అంత లోతుగా అధ్యయనం చేయబడినది.
మరొక విధంగా కర్మ 3రకాలు. 1సంచిత.2ప్రారబ్ధ3ఆగామి.
సంచితకర్మ:ప్రతి జన్మలో కర్మ ఫలాన్ని నిల్వ చేసుకోవడం.
ప్రారబ్ధం :సంచితకర్మ లో కొంత భాగాన్ని అనుభవించడం.
ఆగామి :ఇప్పుడు చేస్తున్న కర్మ ఫలితం రాబోయే
జన్మలో అనుభవించడానికి సంపాదించుకోడం. మన
ధ్యేయమంతా దీనిపై నే ఉండాలి. దీనిని బట్టి రాబోయే జన్మలో మన కష్టసుఖాలు నిర్ణయం చేయబడతాయి. మనం చేసే కర్మలలో గొప్పది అభ్యాసయోగమే. అందుకే అభ్యాసయోగి కిమాత్రమే పునర్జన్మ లో ఉత్తమ మానవ జన్మ సిధ్ధిస్తుంది.
కర్మ ఫలితం తప్పక అనుభవిచాల్సిందే. మరొక రకంగా కర్మ ఫలం నశించదు. అందుకే జ్ఞాని కూడా కర్మలను మానకూడదు. అట్లే కర్మ ఫలం అనుభవించక తప్పదు.
కర్మ సిద్ధాంతము : మూడవ భాగము క్రియ ప్రతిక్రియ అనే శాస్త్రీయ విధానమే కర్మసిదాంతానికి మూలం దీన్ని ఒప్పుకోని వారు హేతువాదవిరోధులు.
కారణం ఇప్పుడు అనుభవించే వాటికి మూలం వెనుకటి కర్మలే అనడం తప్పు అన్నప్పుడు మరి అవెక్కడినుండి వచ్చినాయి ఊరకే శూన్యంనుండి ఊడిపడవుకదా. దీన్ని తర్కశాస్త్రము ‘అకృతాభ్యాగమం’ అనే దోషంగా పేర్కొంటుంది అంటే చేయకుండానే ఫలితం పొందడం అన్నమాట విత్తుకు కారణం చెట్టు అట్లే చెట్టు కు కారణం విత్తు అట్లే తండ్రి కారణం కొడుకుకార్యం మళ్ళీ ఆ కోడుకు తన కొడుకుకు కారణం అన్నమాట …
అందుకే జీవులు చేసే కర్మలు అంతటితోనే నశించవు మరొక రూపంగా మార్పు చందాల్సిందే దీన్ని కాదనడాన్ని“కృతవిప్రనాశము” అనే దోషము గా శాస్త్రం ఖండిస్తుంది. అంటే చేయబడిన కర్మ నశించడం అన్నమాట. పుణ్యకర్మలు ఎంత గొప్పవైతే అంత గొప్ప ఫలితాన్నిస్తాయి.

అందుకే గీతలో వేదాధ్యయనము యజ్ఞదానతపస్సులు చేసేవారికన్నా అభ్యాసయోగి పొందే ఫలం గొప్పదని పేర్కొన్నారు ఎందుకంటే అభ్యాసయోగి చేసే ఏకాగ్రతారూపాభ్యాసయోగము సూక్షమైనది మరియు ప్రభావవంతమైనది. కేవలం మనస్సుతో మాత్రమే చేసే అభ్యాసయోగం లోకానికి ఎంతో అభ్యుదయాన్ని కల్గిస్తుందిఅందుకే అభ్యాసయోగికి మాత్రమే పునర్జన్మలో ఉత్తమ మానవజన్మ తప్ప్పక కల్గుతుందని భగవంతుడు నొక్కి చెప్పినాడు...🙏
⚖️-PI.ESS✍🏻*
🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️

Source - Whatsapp Message

No comments:

Post a Comment