భూమి కన్నా బరువైనది -- తల్లి,
ఆకాశం కన్నా ఉన్నతుడైనవాడు -- తండ్రి,
గాలి కన్నా వేగమైనది -- మనస్సు,
గడ్డిపోద కన్నా గాడమైనది -- చింత,
రెప్పలార్పకుండా నిద్రించేది -- చేప,
పుట్టి కదలకుండా ఉండేది -- గుడ్డు,
హృదయం లేనిది -- రాయి,
వేగంగా పెరిగిపోయేది -- నది,
బాటసారి కెవరు మిత్రుడు -- తోటి ప్రయాణీకుడు,
ఇంట్లో ఉన్నప్పుడు -- భార్య,
ఒంటరిగా తిరిగేవాడు -- సూర్యుడు,
మళ్ళీ మళ్ళీ పుట్టేవాడు -- చంద్రుడు,
హిమపాతానికి మందు -- అగ్ని,
అన్నిటినీ దాచి పెట్టె వస్తువు -- భూమి,
ఒకే ఒక ధర్మమేది -- దాక్షిణ్యం,
యశస్సేమిటి -- దానం,
స్వర్గం చేర్చేదేమిటి -- సత్యం,
సుఖకరమేమిటి -- శీలం,
జీవనాధారం -- వర్షం,
ధనాలలో -- శ్రుతం (విన్నది),
లాభాలలో -- ఆరోగ్యం,
సుఖాలలో -- సంతృప్తి,
అన్ని ధర్మాలలో ఉత్తమమైనది -- ఒకరిని బాధించక పోవటం,
సదా ఫలప్రదమైనది --శాస్త్ర విహితం,
ఏది నిగ్రహిస్తే విచారముండదు -- మనస్సు,
ఏది మాసిపోదు -- సజ్జన సాంగత్యం,
మానవుడు ఏది విడిచిపెడితే నలుగురికి ఇష్టుడు -- అభిమానం,
ఏది విడిస్తే బాధపడదు -- క్రోధం,
ఏది విడిచి ధనవంతుదౌతాడు -- కామం,
ఏది విడిచి సుఖపడతాడు -- లోభం
దేనిచేత లోకం ఆవరించబడింది -- అజ్ఞానం చేత,
దేనితో ప్రకాశించటం లేదు -- తమస్సుతో,
దేనివల్ల మిత్రులను పోగొట్టుకుంటున్నాము -- లోభం వల్ల.
దేని మూలంగా ఉత్తమ లోకానికి పోలేకపోతున్నాము -- సంగం వల్ల,
ఎలా చస్తాడు మనిషి -- దరిద్రుడయి,
రాష్ట్రం ఎలా చస్తుంది -- అరాజకమయి,
శ్రాద్దమెలా చస్తుంది -- అబ్రాహ్మణమయి,
యజ్ఞమేలా చస్తుంది -- అదక్షిణమయి,
ఏది దిక్కు -- సత్పురుషులు,
ఏది జాలం -- ఆకాశం,
అన్నమేది -- పృథివీ,
విషమేది -- యాచన,
శ్రాద్దానికేది కాలం -- ఉత్తమ బ్రాహ్మణుడు దొరకడం,
తపస్సేంటి -- స్వధర్మ అనుష్టానం,
దమమంటే ఏమిటి -- మనో నిగ్రహం,
సహనమేమిటి -- సుఖ దుక్ఖాలను ఓర్చుకోవటం,
లజ్జ ఏమిటి -- అకార్యాల నుండి తొలగటం,
జ్ఞానమని దేనిని అంటారు -- అసలు విషయమేదో తెలుసుకోవటం,
శమమేదంటారు -- చిత్త శాంతి,
దయ అంటే -- సర్వులకు క్షేమం కోరటం,
మానవులకు అజేయుడైన శత్రువేవరు --క్రోధం,
కుదర్చ లేని వ్యాధి ఏది -- లోభం,
అందరికీ కావలసిన వాడెవడు -- సాధువు,
మొహమంటే ఏమిటి -- ఏది ధర్మమో తెలియకపోవడం,
మాన మేమిటి -- నా అంతవాడు లేదనుకోవటం,
సోమరితనమేమిటి -- ధర్మం చెయ్యకపోవటం,
శోకమేమిటి -- అజ్ఞానమే,
దానమేమిటి -- దయే దానం,
స్నానమేమిటి -- మనో మాలిన్య క్షాళనం,
పండితుడెవడు,-- ధర్మజ్ఞుడు, మూర్ఖుడెవడు -- నాస్తికుడు,
కామమేది -- సంసార కారణం,
మాత్సర్యం -- మనస్తాపమే,
ఏది అహంకారం -- మహా జ్ఞానం,
దంభమేది -- ధర్మద్వజిత్వం,
దాన ఫలమేది -- దైవం,
ఏది పైశున్యం -- పర దూషణం,
అన్యోన్య విరుద్ధమైన ధర్మార్థ కామాలకేక్కడ సమన్వయం -- ధర్మం ధర్మపత్ని,
ఇవి రెండూ ఎవడి కనుకూలమో వాడి దగ్గర,
అక్షయమైన నరకం దేనివల్ల -- ఒక సత్పురుషుడికి దానం చేస్తానని చెప్పి తరువాత లేదు పొమ్మంటె,
కులమూ శ్రుతమూ స్వధ్యయమూ వ్రుత్తమూ దేని వల్ల బ్రాహ్మణ్యం లభిస్తుంది -- వృత్తం,
ప్రియంగా మాట్లాడే వాడికి లభించేది ఏమిటి -- అందరికీ ఇష్టుడనిపించుకోవడం,
ఆలోచించి పనిచేసేవాడికి కేమిటి -- ఎక్కువ లాభం,
అనేక మంది మిత్రులున్న వాడికి -- ఎక్కువ సుఖం,
ఎప్పుడు ధార్మికంగా నడిచే వాడికి -- ఉత్తమ గతులు,
ఎవడు సుఖంగా బ్రతుకుతాడు -- అప్పు చేయక ఎక్కడికీ కదలక ఇంట్లో కూచొని తింటూ కాలం గడిపే వాడు,
లోకంలో ఏది ఆశ్చర్యం -- వల్లకాటికి కొనిపోతూనే ఉన్నారు తోటి మానవులను, అయినా మనమప్పుడే పోతామా ఇంకా వుంది గదా కాలమని బ్రతుకుతున్నారే మానవులు! ఇదే ఆశ్చర్యం.
...... మోహన్....... ☀
Source - Whatsapp Message

No comments:
Post a Comment