Sunday, April 25, 2021

మట్టి కుండ (కథ)

మట్టి కుండ

ఒకానొక ఊర్లో భీద కూలివాడు
ఉండేవాడు. ఒకరోజు ఒక చెక్కల వ్యాపారి దగ్గరకు
వెళ్లి ఏదైనా పని చెప్పండి అని
బ్రతిమలాడేడు. చెక్కల వ్యాపారి సరే అని చెప్పి.
జీతం మాత్రం నువ్వు ఎంత చేస్తే అంత అని చెప్పేడు.

కూలివాడు నాకు నా,పిల్లలకు రోజుకు బ్రతకడానికి 100 రూపాయలు అవసరము
అవతాయి. కాబట్టి నాకు
100 రూపాయలు ఇస్తే చాలు అన్నాడు.అప్పుడు కలప వ్యాపారం చేసే యజమాని అలా కుదరదు.

నీ పనికి తగ్గట్టుగా నీ జీతం
ఉంటుంది. పని ఎంత ఎక్కువగా చేస్తే అంత డబ్బు వస్తుంది. అని బదులిచ్చాడు.
కూలివాడు యజమాని చెప్పిన ఒప్పందం నికి వేరే దారిలేక సరే అని చెప్పేడు.

అప్పుడు ఆ యజమాని ఆ కూలివాడుకి ఒక మంచి బలమైన కత్తి ఒకటిచ్చి
అడవిలో పెద్ద పెద్ద చెట్లను
నరికి తెమ్మన్నాడు.

కూలివాడు సరే అని వెళ్లి అడవిలో చెట్లను నరకడం మొదలుపెట్టేడు. ఎలాయితేనే పొద్దు కునికే సరికి 15 చెట్లను నరికి వాటిని తెచ్చి యజమానుడుకి అప్పజేప్పేడు.
యజమానుడు భళా దాసుడా.
ఎవరైనా ఒక్కరోజులో 7 చేట్లకంటే ఎక్కువగా నరకలేరు.
నువ్వు ఏకం గా 15 చెట్లు నరికావు. భళా అని పొగిడి..
నువ్వు మొదటి రోజే చాల ఎక్కువ కష్టపడ్డావ్ అని మెచ్చుకుని. చెట్టుకు 10 రూపాయలు చొప్పున
ఆ కూలివాడుకి 150 రూపాయలు ఇచ్చాడు.

ఆ కూలివాడు మరుసటి రోజు
అడవికి వెళ్లి ఇంకా ఎక్కువ కష్టపడితే ఇంకా డబ్బులువస్తాయి కదా అని
మొదటి రోజు కంటే ఎక్కువ సేపు కష్టపడి పోద్దు కున్కేసరికి 10 చెట్లను నరికి తెచ్చి యజమానుడుకి చెట్టుకు
10 రూపాయలు చొప్పున 10 చెట్లు అప్పజెప్పి 100 రూపాయలు కూలి తీసుకున్నాడు.

మూడవరోజు కూలివాడు ఇంకా కష్టపడి పనిచేసి పోద్దు కునికేసరికి 5 చెట్లు నరికి యజమానుడుకి అప్పజెప్పి
చెట్టుకు 10 రూపాయలు చొప్పున 50 రూపాయలు తీసుకుని వెళ్ళిపోయాడు.
మరుసటి రోజు ఎలా అయిన
ఎక్కువ చెట్లు నరకాలని వేకువ
జామున చీకటితో బయలుదేరివెల్లి ఆ అడవిలో ఎన్నడులేనంత గా కష్టపడి వేకువజామున నుండి చీకటి
పడేవరకు కష్టపడి ఒకే ఒక చెట్టు నరికి యజమానుడుకి
అప్పజేప్పేడు.

అప్పుడు ఆ యజమానుడు చెట్టుకు 10 రూపాయలు చొప్పున పది రూపాయలు తీసి ఆ పనివాడి చేతిలో పెట్టేడు.
పనివాడు పది రూపాయల నోటు వైపు దీనంగా చూస్తూ శాయశక్తులా కష్టం పెంచినా ఫలితం పది రూపాయలేే
అని తలంచి. ఎంత చేస్తే అంత అన్నయజమానుడితో
ఉన్న ఒప్పందం గుర్తెరిగి
చేసేది ఏమీ లేక. వెళ్ళిపోతూ...

అయ్యగారు నా కష్టం లో ఎటువంటి లోపం లేదు. చీకటి పడేవరకు చెమట ఓర్చి శ్రమించాను కాని ఒకటి కంటే
ఎక్కువ నరకలేకపోయాను.అని దీనంగా అన్నాడు.

అపుడు యజమానుడు నేను నీకు ఇచ్చిన కత్తికి పదును పెట్టి ఎన్నాళ్ళు అవుతుంది ? అని అడగగానే. కూలివాడు నేను రోజు నా పనిలో మునిగిపోవడంవలన కత్తికి పదును పెట్టె సమయం నాకు లేదు. అందుకే కత్తికి ఒక్కసారికూడా పదును పెట్టలేదు అని అన్నాడు.
అపుడు యజమానుడు
అర్ధం లేని నీ శ్రమకు,
నీ ఆర్ధిక పతనానికి, నీ శరీర శ్రమలకి కారణం కత్తికి పదును లేకపోవడమే.

పదును పలితం. ఎటువంటి సమస్యనైనా సులువుగా
కోసిపారేయడమే. మార్పు లేని జీవితం, పదును లేని మొద్దుబారిన కత్తిలాంటిది.
ఏవేవో శ్రమలు పడతాం కాని
ఫలితం ఆవిరి. కష్టపడుతున్న..
కష్టపెట్టే పరిస్థితులు మాత్రం
మారనే మారవు పదునైన ఆలోచనలతో మాత్రమె గోప్పవిజయాలు సాధించగలము.

భగవంతుడు మట్టి బొమ్మకు ప్రాణం పోసి జ్ఞానమనే గొడ్డలిని కి ఆలోచన అనే పదును పెట్టి మన చేతికి ఇస్తే మనం పైన చెప్పిన కూలీల
ప్రాపంచిక విషయాలన్నీ
దానితో నరుక్కుంటూ పోయి
వృద్ధాప్యం వచ్చిన తర్వాత పదును తగ్గిన తరువాత ఎందుకు నా జీవితం ఇలా తయారయింది అని మనల్ని మనం చూసుకొని బాధపడుతూ ఉంటాం. దానికి కారణం యవ్వనంలో వచ్చే విజయాలన్నీ నా వల్లే వచ్చాయి అనే మూర్ఖత్వం భావనలో మనం ఉండడమే!

కానీ నిజనికి మనం సాధించడానికి ప్రేరణ మరియు కారుకుడు భగవానుడు అనే విషయాలను వృద్ధాప్యంలో తెలుసుకుని ఏం ప్రయోజనం
సరిదిద్దుకోవడానికి సమయం లేకుండా పోయింది, శరీరం అంతకన్నా సహకరించకుండా పోతుంది అని నిట్టూర్పు విడవటం తప్ప మన చేతుల్లో ఏమీ మిగిలి ఉండదు.

అందుకు చిన్న ఉదాహరణ చెబుతాను.

ఒక చక్రవర్తి యుద్ధంలో గెలిచి వచ్చాడు. భట్రాజుల పొగడ్తలతో గర్వం మరింత అతిశ యిల్లింది. తన జీవితాన్ని తీర్చిదిద్దిన మార్గదర్శి, జ్ఞాని, గురువు అయిన మహా మంత్రే ఆయనకా సమయంలో చులకనగా కనిపించాడు. దీన్నే అంటారు కళ్లునెత్తికెక్కాయని. అతనిలో గర్వంతో బాటు అహంభావం కూడా పెరిగింది. మంత్రితో ఎలా వ్యవహరించాలో కూడా మరచిపోయాడు.

‘మంత్రివర్యా! మీరెంతో తెలివైనవారు, జ్ఞాన నిధి, గొప్ప వ్యూహ కర్తలు. ఈ తెలివి తేటలతో బాటు అందం కూడా ఉంటే ఎంత బాగుం డును’ అన్నాడు. అసలతను చక్రవర్తి కావడానికి కారణభూతుడు ఆ మంత్రే. కొలువులో అందరూ చక్రవర్తి మాటలకు ఆశ్చర్యపోయారు.

తనను నిండు సభలో అవమానించిన చక్రవర్తిపై ఆ మంత్రికి కోపం రావాలి. ఆ మంత్రి ఏ భావమూ ప్రకటించలేదు.

తనను తక్కువ చేసి మాట్లాడిన రాజును తూలనాడలేదు. దగ్గరలో ఉన్న ఒక పరిచారకుడిని పిలిచి ఎండ మండిపోతోంది. ప్రభువులకు దాహంగా ఉంది తక్షణమే స్వర్ణ పాత్రలో ఉన్న శుద్ధమైన జలాన్ని తెచ్చి ప్రభువులకు తాగడానికి ఇవ్వు’ అన్నాడు.

పరిచారకుడు స్వర్ణ పాత్రలోని జలాన్ని ఒక బంగారు గ్లాసులో తెచ్చి ఇచ్చాడు. ఆ నీళ్లు వెచ్చగా ఉండి ఉంటాయి. దాహం తీరి ఉండదు. మట్టి కుండలో నీరు తెచ్చి ఇవ్వు అన్నాడు మంత్రి మళ్ళీ, పరిచారకుడు మట్టి కుండలోనుంచి తెచ్చి ఇచ్చిన నీటిని చక్రవర్తి తృప్తిగా తాగాడు.

వెంటనే రాజు ఆలోచించాడు మంత్రి ఒక్క సారిగా నీటిని గురించి ప్రస్తావించడడం, పరిచారకుడి చేత స్వర్ణ పాత్ర, మట్టి పాత్ర ల్లోని నీటిని తెప్పించడం ఇదంతా ఎందుకు చేశాడని ఆలోచించాడు. వివేకవంతుడు కనుక వెంటనే అర్థమయింది,జ్ఞానోదయమయింది.

వెంటనే సింహాసనం దిగి మంత్రి వద్దకు వచ్చి, ‘గురు దేవా! మన్నించండి. గర్వాతిశయంతో కాని మాట అన్నాను. బంగారు పాత్ర విలువైనదే కావచ్చు. అందంగా ఉండవచ్చు. కాని దానికి నీటిని చల్ల్లపరిచే గుణం లేదు. మట్టి పాత్ర బంగారు పాత్రతో సరితూగలేదు. అయినా నీటిని చల్ల్లగా ఉంచు తుంది. అందం కాదు గుణం, జ్ఞానం, క్షమ అనే ఆభరణాలే అతి విలువైనవని మీరు బహు చక్కగా బోధించారు. నా అపరాధాన్ని మన్నించండి’ అన్నాడు.

ఆ చక్రవర్తి మరెవరో కాదు మౌర్య వంశ వ్యవస్థాపకుడు మౌర్య చంద్ర గుప్తుడు. ఆ మహా మంత్రి మరెవరోకాదు. మహారాజనీతి వేత్త, చతురుడు, అర్థశాస్త్ర రచయిత, కౌటిల్యునిగా పేరు గాంచిన చాణక్యుడు.

విజయగర్వంతో భగవంతుని మనం మరచిన తను మాత్రం మనల్ని మరువడు పైన చెప్పిన మంత్రి గారి లా ఎప్పుడు మన విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాడు.

ప్రాణంతో ఉన్నప్పుడు మట్టి మన కడుపు నింపే ప్రయత్నం చేస్తుంది ప్రాణం పోయాక తన కడుపులో మనల్ని నింపుకుంటుంది.

మట్టి కుండలు అన్నం వండుకుని తినే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని
కలిగి ఉన్నం మనం, కానీ మనల్ని మనం తెలుసుకోలేని,రక్షించుకోలేని దీనావస్థలో ఉన్నాం. అందుకు కారణం
నేను అమాయకత్వమే.

అలోచించుకుందాం మన కర్మ కు కూలి ఏంత గిట్టుబాటు అయిందో ఈ జీవితకాలనికి.


Source - Whatsapp Message

No comments:

Post a Comment