కుక్కుటేశ్వర క్షేత్రనికి పాదగయ అనే పేరు ఏలా వచ్చింది
పూర్వం 'గయాసురుడు'అనే రాక్షసుడు, వుండేవాడు. ఇతడు ఇంద్రుడి సింహాసనాన్ని సొంతం చేసుకుని దేవతలందరినీ పీడించసాగాడు. వీడిని సంహరిస్తే తప్ప దేవతల కు ప్రశాంతత లభించాదు అని దేవతలందరు కలసి
త్రిమూర్తులు ను వేడుకోనగా
దాంతో త్రిమూర్తులు బ్రాహ్మణ పండితుల వేషాలను ధరించి గయాసురుడి దగ్గరికెళ్లి తాము ఒక యజ్ఞం చేస్తున్నామని చెప్పారు. భూమాత ఆ వేడిని తట్టుకోలేదనీ ... దానిని అతని దేహం మాత్రమే భరించగలదని అన్నారు. తన దేహాన్ని యజ్ఞ వాటికగా ఉంచడానికి గయాసురుడు అంగీకరించడంతో, వారం రోజుల పాటు సాగే ఈ యజ్ఞానికి ఎలాంటి పరిస్థితుల్లోను భంగం కలగకూడదనీ ... అదే జరిగితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుందని చెప్పారు.
గయాసురుడి తల దగ్గర విష్ణువు ... నాభి దగ్గర బ్రహ్మ ... పాదాల చెంత శివుడు కూర్చుని యజ్ఞాన్ని ప్రారంభించారు. ఏడో రోజు అర్ధరాత్రి వరకూ కూడా ఆ యజ్ఞం వేడిని గయాసురుడు భరిస్తూ వచ్చాడు. దాంతో తెల్లవారితే మళ్లీ గయాసురుడిని నియంత్రించడం కష్టమని భావించిన శివుడు, పార్వతీదేవిని అక్కడికి ఆహ్వానించాడు. ఆమె సూచనమేరకు శివుడు అర్ధరాత్రివేళ కోడిలా కూశాడు. తెల్లవారిందనుకుని గయాసురుడు కదలడంతో యజ్ఞ భంగం జరిగింది.
దాంతో బ్రాహ్మణ పండితులు గయాసురుడి పట్ల ఆగ్రహావేశాలను వ్యక్తం చేయడం మొదలు పెట్టారు. వాళ్లు తనని సంహరించడానికి వచ్చిన త్రిమూర్తులని గయాసురుడు గ్రహించి సంతోషించాడు. అతని దేహం నశించక తప్పదనీ, ఆ ప్రదేశంలో తాము క్షేత్ర దేవతలుగా కొలువుదీరతామని త్రిమూర్తులు అనుగ్రహించారు.
శివుడు కోడిలా కోసిన ప్రదేశం కాబట్టి కుక్కుటేశ్వర క్షేత్రంగా ... గయాసురుడి పాదాల చెంత కూర్చుని శివుడు యజ్ఞం చేసిన కారణంగా 'పాదగయ'గా ఈ శక్తి పీఠం పిలవబడుతోంది.
ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో ఉంది. ఇక్కడ అమ్మవారి ఎడమ హస్తం పడిందని చెబుతుంటారు.
ఈ పీఠాన్ని అష్టాదశ పీఠాల్లో 10వ పీఠంగా పేర్కొంటారు.
అది అందమైన తల్లి పీఠము. బంగారు తల్లి పేరు పురుహూతికా దేవి. ఆ బంగారు తల్లిని చేపట్టినవాడు కుక్కుటేశ్వరస్వామి. పిఠపురం అనాదిగా శ్రీ కుక్కుటేశ్వర స్వామి క్షేత్రం. ఎందుకంటే ఇక్కడి శివలింగం కుక్కుటాకారంలో ఉంటుంది. కుక్కుటమనగా కోడి. పైగా ఏలముని యోగానికి సారమైనది. అత్యద్భుతమైన మహితమలకు ఆలవాలమైనది. పాదగయ అని ఇక్కడి ప్రాంతానికి మరోపేరు. ప్రప్రథమంగా దేవేంద్రునిచే ఆరాధించబడిన పుణ్యక్షేత్రం ఈ పిఠాపురం.
ఈ పిఠాపుర క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి నుండి 60కి||మీ|| దూరంలోను మరియు కాకినాడకు 18 కి||మీ దూరంలోను ఉంది.
పుట్టింట పుట్టెడు అవమానం పొంది అగ్నికి ఆహుతైపోయిన దాక్షాయణి పీఠభాగం పడిన ప్రదేశం కాబట్టి ఈ క్షేత్రానికి పిఠాపురం అనే పేరు వచ్చిందని పురాణ ప్రసిద్ధం. ఇక్కడ అమ్మవారు పురుహూతికా దేవిగా హూంకారిణిగా భక్తుల పూజలందుకుంటోంది. ఈ అమ్మవారి నాలుగు చేతుల్లో బీజపాత్ర, గొడ్డలి( కుడివైపు చేతుల్లో)... తామరపువ్వు, మధుపాత్ర (ఎడమ చేతుల్లో) ఉంటాయి.
ఇది గయాక్షేత్రం కూడా. గయాసురుని పాదాలు ఉండే చోటు కాబట్టి దీన్ని పాదగయ అని కూడా అంటారు. గయాసురుని శరీర మధ్యభాగం ఒరిస్సాలోని జాజ్పూర్ ప్రాంతంలో ఉంటుంది. దాన్ని నాభిగయ అంటారు. శక్తిపీఠాల్లో ఒకటైన గిరిజాదేవి వెలసిన చోటు అదే.
భీహారులో ఉన్న ప్రదేశాన్ని “విష్ణుగయ” లేదా “శిరోగయ” అని, పాదాలు పిఠాపురంలో ఉన్నందున ఆ ప్రదేశానికి “పాదగయ” అనే పేరు వచ్చింది. అలా శివ, శక్తి, విష్ణు పీఠాలతో పవిత్రమైన ఈ పిఠాపురం మంగళప్రద మహాత్మ్యలకు ఆలవాలమై ఉన్నది.
సత్ చిదానంద శక్తి క్షేత్రమైన ఈ పిఠాపురం దర్శనం పరమం పవిత్రం !
Source - Whatsapp Message

No comments:
Post a Comment