Saturday, May 15, 2021

బంధాలను అర్థం చేసుకోవాలి

🍃🌷బంధాలను అర్థం చేసుకోవాలి💖
🕉️🌞🌎🏵️🌼🚩

కొన్ని బంధాలు ఎందుకు కలుస్తాయో
ఎందుకు విడిపోతాయో ఎప్పటికీ అర్థం కావు
కొన్ని బంధాలు ఎన్నాళ్ళు మనతో ఉన్నా
అవి ఒక గుర్తుగా కుడా మనతో నిలిచిపోవు
కొన్ని బంధాలు అలా వచ్చి ఇలా వెళ్ళినా
ఎప్పటికీ చెరగని గుర్తులా నిలిచిపోతాయి
ఏ బంధం ఏ వరుసతో మనతో ముడిపడుతుందో
కాలం ఎవరిని ఎలా దూరం చేస్తుందో
ఎవరూ చెప్పలేని సమాధానాలు ఎన్నో
మనసుకు దగ్గర అయితే చాలు
కులం మతం ఆడ మగ రంగు రూపు ఇవేవి
అడ్డురావు
కొందరే ఎందుకు మనకు జ్ఞాపకాలుగా
మిగిలి పోతున్నారు
మనం చూసే విధానంలో మేచ్చే విధానం లో
మనకు వారు దగ్గరగా ఉండటమే
అవును మనం మంచి అనుకుంటే చెడు కుడా
మంచే
మనం చెడు అనుకుంటే మంచి కుడా
చెడే
కొందరికి మంచి చెడు చేస్తుంది
కొందరికి చెడు కూడా మంచి చేస్తుంది
చెడు అయినా మంచి, మంచి అయినా చెడు
రెండు కారణాల వల్ల కూడా విడిపోయిన
బంధాలు ఎన్నో
మంచి అయినా చెడు అయినా
దానిని అర్థం చేసుకుని
మన అనుకున్నాక
మంచి తనంతో ప్రేమతో వారిని దారిలో పెట్టుకోవాలి మార్చుకోవాలి
మంచికి చెడుగా మార్పు తొందరగా వస్తుంది
చెడుకి మంచిగా మార్పు నిదానంగా వస్తుంది
ఒక్కసారి సహనం కోల్పోతే
ఎన్నో కోల్పోవాల్సి వస్తుంది
ఎవరైనా అలా దూరం అయి ఉంటే ఒక్కసారి
ఆలోచించండి

అందరు మనవారే మన వారిని మనమే ఆదరించాలి....

🕉️🌞🌎🏵️🌼🚩

Source - Whatsapp Message

No comments:

Post a Comment