Sunday, May 23, 2021

నిప్పులాంటి నిజం, సంపాదించినది ధర్మ మార్గం లో ఖర్చు చేసి , పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా ?

నిప్పులాంటి నిజం

ఒకడు ఎలాగైనా ధనం సంపాదించాలని ,
చాలా కస్టపడి సుమారు 1,000 కోట్లు రూపాయిలు సంపాదించాడు.

ఒకరోజు , తాను ఎంతో కష్టపడి , చెమటోడ్చి సంపాదించిన ధనం , తాను చనిపోయినా సరే ఎవరికీ , ఒక్క పైసా కూడా ఇవ్వకూడదని , బాగా ఆలోచించి పేపర్లో ఒక ప్రకటన ఇచ్చాడు.

, ఏమని అంటే , ఎవరైతే నేను చనిపోయిన తరువాత నా డబ్బు నాతో తీసుకొని వెళ్లే సులువు (టెక్నిక్) చెపితే వారికి 10 కోట్లు ఇస్తానన్నాడు.

నెల గడిచినా ఎవరు రాలేదు. మల్లీ 100, 200 కోట్లు ఇస్తానన్నా ఒక్కరు కూడా రాలేదు. దానితో చాలా బెంగతో , చిక్కి సగం అయిపోతుండగా.... అకస్మాత్తుగా ఒక జ్ఞాని వచ్చాడు.

నేను మీ డబ్బు మీరు చనిపోయిన తరువాత కూడా మీకు ఉపయోగపడే సులువు టెక్నిక్ చెపుతాను అనగానే
ఎలా ? అని ప్రశ్నించేడు కోటీశ్వరుడు.

దానికి ఆ జ్ఞాని కోటీశ్వరుడిని మీరు అమెరికా , ఇంగ్లండ్ , జపాన్ వెళ్ళారా ? అని అడిగేడు.

అవును వెళ్ళాను అనగానే అమెరికాలో మీరు ఎన్ని రూపాయలు ఖర్చు చేశారు అని అడిగాడు. అందుకు కోటీశ్వరుడు స్వామీజీ
అమెరికాలొ నా రూపాయలు చెల్లవు
కనుక నా రూపాయలను డాలర్లు గా మార్చి తీసుకొని వెలతాను. అదే England ఆయితే pounds , జపాన్ ఆయితే Yens
ఇలా ఏదేశం వెళ్తే , ఆ దేశ కరెన్సీ క్రింద నా రూపాయలను మార్చి , ఖర్చుకి తీసుకొని వెళ్తాను అని అన్నాడు..

ఇప్పుడు జ్ఞాని ఓ కోటీశ్వరుడా...............

నీవు చనిపోయిన తరువాత కూడా , నీడబ్బు నీతో రావాలంటే , ఒకవేళ నీవు నరకానికి వెళ్ళాలి అని అనుకుంటే నీడబ్బును పాపము " లోనికి మార్చు. అంటే దుర్వినియోగం ,చెడు వ్యసనాలకి , పాపపు పనులలోనికి మార్చు.

లేదా ..... ఒక వేళ నీవు దేవలోకానికి వెళ్లాలంటే , నీ డబ్బును దాన , ధర్మములు చేసి పుణ్యంగా Exchange చేయు అని చెప్పాడు .........

ఆ మాటలకు ధనవంతునికి జ్ఞానోదయం కలిగి , ఆ జ్ఞానిని 100 కోట్లు తీసుకోమంటాడు. దానికి జ్ఞాని నేను కస్టపడి పని చేయకుండా ఒక్క పైసా కూడా తీసుకోను అని సున్నితంగా తిరస్కరిస్తాడు.

ఇక జ్ఞానోదయం ఆయిన ఆ ధనవంతుడు , తనఆస్తిని ఆ జ్ఞాని సలహాతో తన సంపదనంతా సన్మార్గంలో దానధర్మాలకు అన్నదానాలకు ఖర్చు చేసి పాప కర్మలు నశిoచి మంచి కర్మల వలన దేవ లోకాలకు వెళ్తాడు........

మిత్రులారా మన సంపదలు మనతో వచ్చే విధానం.ఇదే

కావున మనం కష్టపడి సంపాదించినది ధర్మ మార్గం లో ఖర్చు చేసి , పుణ్యం గా మార్చి మనతో తీసుకొని వెల్దామా ? లేక మన తలనొప్పిని కూడా తీసుకోలేని వారికి వదిలి వెల్దామా ?..............

ఎవరు చేసిన కర్మ
వారే అనుభవిస్తారు

🙏🙏🙏🙏🙏

Source - Whatsapp Message

No comments:

Post a Comment