మనిషి చేసే తప్పులు!
సాధారణంగా మనిషి రెండు తప్పులను చేస్తుంటాడు . మొదటిది ఆత్మస్థుతి. రెండవది పరనింద. రెండూ తప్పులే. మనిషి తానెంత గొప్పవాడైనా తనను ఇతరులు పొగడాలి కానీ తనను తాను పొగుడుకోకూడదు.
ఇన్ద్రోపి లఘుతాం యాతి స్వయం ప్రఖ్యాపితైర్గుణైః!
దేవతల అధిపతి అయన దేవేంద్రుడు కూడా తన గొప్పతనాన్ని తానే ప్రస్థుతించుకుంటే చాలా చులకన అవుతాడని చెప్తారు . అందువలన ఎట్టి పరిస్థితులలోను మానవుడు ఆత్మస్థుతి చేసుకోకూడదు.ఇతరులను నిందించటమూ పెద్దపాపమే. ఒకమనిషిని హత్య చేసినదానికంటే ఇది ఎక్కువ పాపం. ఇందుకు మహాభారతంలో ఒక ఉదాహరణ ఉంది. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణునితో యుద్ధం చేయటం ధర్మరాజుకు ఒకప్పుడు చాలా కష్టమైంది. ఆ కష్టానికి తట్టుకోలేక ధర్మరాజు యుద్దభూమినుండి వెనుదిరిగి శిబిరానికి వెళ్ళిపోయాడు.
యుద్ధభూమిలో ధర్మరాజు కనపడక అర్జునుడు చాలా చింతించాడు. అతనికోసం వెతికి, వెతికి చివరికి, శిబిరంలో కనుగొన్నాడు. ధర్మరాజు వెంటనే 'కర్ణుని చంపావా లేదా?’ అని అర్జునుడిని ప్రశ్నించాడు.
‘లేదు!’ అని అర్జునుడు సమాధాన మిచ్చాడు. ‘తాను మిమ్మల్ని వెతుకుతూ ఇక్కడికి వచ్చానని’ చెప్పాడు.
అప్పుడు కోపంతో ధర్మరాజు యిలా అన్నాడు. 'కర్ణుని చంపలేకపోతే నీకు గాండీవమెందుకు? దండగ. దానిని ఎవరికైన దానం చేయి.’ ఆమాటలు వినగానే అర్జునుడి మనస్సు గాయపడింది. అతడు శ్రీకృష్ణుని ఇలా ప్రశ్నించాడు . 'నా గాండీవాన్ని త్యజించమన్న వారిని చంపుతానని నేను శపధం పట్టాను. అందువలన నేను ధర్మరాజుని చంపాలి. కానీ ఆయన నా అగ్రజుడు. ఇప్పుడు నా శపథాన్ని నెరవేర్చు కొనడమెలా?’
అర్జునుని ప్రశ్నకు శ్రీకృష్ణుడిలా సమాధానమిచ్చాడు. 'ధర్మరాజు వంటి మహాపురుషుని చంపాలనుకోవటమే మహాపాపం. కానీ నీ శపథాన్ని నెరవేర్చక తప్పదంటున్నావు. నీవు ధర్మరాజును ఎటువంటి కారణం లేకుండానే నిందించు. అలా నిందించటమే హత్య చేసినట్లు!' అని.
దీనినుండి ఒక వ్యక్తిని నిందించటం అతనిని హత్య చేయటంకంటే ఘోరమైన పాపమని మనకు తెలుస్తుంది. అందువలన మనల్ని మనం పొగుడుకోవటం, యితరులను నిందించటం మనం చేయకూడని పనులు. మన జీవితంలో ఆ రెండు తప్పులు చేయకూడదు.
యదీచ్చసి వశే కుర్తం జగదేకేన కర్మణా !
పరాపవాద సస్యేభ్య: గాశ్చరన్తీర్నివారయ !!
ఇతరుల గురించి చెడుగా మాట్లాడటం మానివేస్తే ప్రతి ఒక్కడు నీవాడవుతాడు.
పదుళ్ళపర్తి శివ. ఎం.ఏ.,రచయిత, కాలమిస్ట్, పురోహితుడు,జ్యోతిష్కులు. తుని. చరవాణి సంఖ్య:9989318890
Source - Whatsapp Message

No comments:
Post a Comment