Monday, June 7, 2021

చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు

✋చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలు🤘

✍️ మురళీ మోహన్

👌డైనింగ్ టేబుల్ మీదికి స్పూన్స్, ఫోర్క్ లు వచ్చి చేతితో భోజనం చేసే వాడిని అనాగరికుడిగా చూస్తూ వెక్కిరిస్తున్న తరుణమిది.

తిండేదైనా ఫోర్క్ పక్కా అయి కూర్చుంది ఈ వేళ..?

హోటల్ లో ఎవరైనా పద్దతిగా చేతితో అన్నం కలుపుకొని తింటుంటే అందరూ అతడిని వింత గా చూసే పరిస్థితి ఏర్పడింది.

ఇక మన ఇంట్లో చిన్న పిల్లలకు సైతం స్పూన్స్ అలవాటు చేస్తున్నారు ఈ తరం తల్లీదండ్రులు.

దానికి వాళ్లు చూపిస్తున్న ప్రధాన కారణం.. చేతులు శుభ్రంగా ఉండవు కదా..! అని.

అయితే ఓ సారి చేతిని ఉపయోగించి భోజనం చేస్తే కలిగే సైంటిఫిక్ లాభాలను ఓ సారి చూద్దాం.

ఇది చదివాక ఎక్కడున్నా…?
మీరు పద్దతిగా చేతిని ఉపయోగించి భోజనం చేస్తారని ఆశిస్తున్నాను

చేతితో ఆహారాన్ని తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు:
( As Per Science)

1.చేతిస్పర్శ వల్ల శరీరానికి బలం చేకూరుతుంది.

✋✋✋✋✋✋✋✋

2.చేతితో ఆహారం తీసుకోవడం వలన కొన్ని మిలియన్ల నరాలు మన మెదడుకు సిగ్నల్స్ ని పంపిస్తాయట.

✋✋✋✋✋✋✋

3.అహారాన్ని చేతితో టచ్ చేయగానే, ఫుడ్ తీసుకునే విషయం మెదడు పొట్టకు సంకేతమిస్తుంది. అలా కడుపులో జీర్ణరసాలు, ఎంజైమ్స్ రిలీజ్ కావడం వలన జీర్ణశక్తి బాగా జరుగుతుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

4.చేత్తో ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా ఒకే ధ్యాసలో ఉంటాం.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐

6.మన ఆహారాన్ని నూనె మరియు ఎక్కువగా ఉపయోగిస్తాం.ఇలా తయారుచేసుకున్న ఆహారాన్ని స్పూన్స్, ఫోర్క్స్ తో తీసుకోవడం వలన ప్రతిచర్య ఏర్పడి రుచిపోతుందట.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

7.వేళ్ళతో ఆహారం కలుపుకొని, ముద్దలుగా ఒక్కో పదార్థాన్ని కలుపుకోవడం వలన రక్తప్రసరణ బాగా జరుగుతుందట.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

8.చేతివేళ్ళతో ఆహారం తీసుకోవడం వల్ల,వేళ్ళు పెదాలకు తగలగానే నోటిలో లాలాజలం ఊరుతుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

9.ఇంకా చేతివేళ్ళతో మనం ఆహారం తీసుకోవడం వలన అనారోగ్యం పాలుకాకుండా,ఆరోగ్యవంతంగా ఉంటారు. జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. ఇలా చేయడం ఒక వ్యాయామంలా ఉంటుంది. పురణాల పరంగా…

చేతిలో ఉండే ఒక్కో వేలు ఒక్కో తత్వాన్ని కలిగి ఉంటుంది.

🖐🖐🖐🖐🖐🖐🖐🖐🖐

బొటనవేలు: అగ్నితత్వం
--------------

చూపుడు వేలు: వాయుతత్వం
--------------

మధ్యవేలు: ఆకాశం
--------------
ఉంగరపు వేలు: భూమి
--------------
చిటికిన వేలు: జలతత్వం
--------------
ఈ అయిదు వేళ్ళ స్పర్శ ఆహారానికి తగిలినపుడు జీవశక్తి ఉత్తేజితం అవుతుంది. ✋
🍃🍍🍎🌿🍐🍊🍑🍒🌽🍆🍌🍃

Source - Whatsapp Message

No comments:

Post a Comment