💖ప్రేమిస్తే పోయేదేముంది??
💦💥🌹🌈🦚🎈
🍃🌹ద్వేషంతో మనం చేసే పనిలో విజయం సాధించలేం. ప్రపంచాన్ని జయించలేం. అంతెందుకు మనల్ని మనం జయించలేం.
🍃🌹ద్వేషం.. బయటికి కనిపించని శత్రువు.
🍃🌹మనసులో గూడు కట్టుకుని మనుష్యుల మధ్య అడ్డుగోడలు కడుతుంది. విభజన రేఖలు గీస్తుంది. వివక్షను నూరిపోస్తుంది. కులం, మతం, ప్రాంతం, రంగు ఆధారంగా మనుషులను విభజిస్తుంది.
🍃🌹సాటి మనిషి హక్కుల రెక్కలను నిర్దాక్షిణ్యంగా తెగ్గొడుతుంది.
🍃🌹ద్వేషం.. ఎల్లప్పుడూ విషాన్ని కక్కుతుంది. ద్వేషంతో మాట్లాడే ఒక్క మాట.. ఒక్క పదం.. వేనవేల జీవితాల్లో అంతులేని విషాదాలను సృష్టిస్తుంది. చరిత్రలో మానని గాయాన్ని రేపుతుంది. విద్వేషాగ్నిని రగిలిస్తుంది.
🍃🌹ద్వేషం.. పైకి మనిషిని మనిషిగానే ఉంచుతుంది. కానీ, లోపల మానవత్వాన్ని చంపేస్తుంది.
దీనికి విరుగుడు మంత్రం- రెండక్షరాల ప్రేమ.
🍃🌹ద్వేషాన్ని జయించే ఏకైక అహింసా ఆయుధం.. ఈ ప్రపంచంలో ‘ప్రేమ’ ఒక్కటే.
🍃🌹దీనితో లోకాన్ని జయించవచ్చు. మనం చేసే పనిలో విజయం సాధించవచ్చు. మనల్ని మనం జయించవచ్చు.
🍃🌹ద్వేషం.. ప్రేమ.. ఈ రెండూ మనలోని స్వభావాలే. వీటిలో మనం ఏ స్వభావానికి లోబడితే.. ఆ స్వభావిగా మనం రూపుదిద్దుకుంటాం.
🍃🌹ఈ రోజుల్లో మనం వాడే నిత్యావసరాలు, పరికరాలు, ఉపకరణాలు అత్యంత ‘స్మార్ట్’గా మారాయి. కానీ, వాటిని వాడే, వినియోగించే మనం మాత్రం ‘హార్డ్’ (కఠినం)గా మారిపోతున్నాం.
🍃🌹ప్రపంచం చిన్నదైపోయే కొద్దీ మనుషుల మధ్య అంతరాలు పెద్దగా మారిపోతున్నాయి. ప్రపంచం అరచేతిలో ఇమిడిపోతోంది. మనుషుల మధ్య సంబంధ బాంధవ్యాలు మాత్రం అందనంత దూరమైపోతున్నాయి.
🍃🌹 వస్తువుల్ని ప్రేమిస్తున్నాం. మనుషుల్ని అప్పుడప్పుడు ‘వాడుకుని’ వదిలేస్తున్నాం. అందరిదీ అదే తీరు. ఇదే లోకం తీరుగా మారిపోయింది.
🍃🌹ప్రేమ, దయ, కరుణ, సహృదయత అనే నాలుగు పునాది రాళ్లపై ఉన్న భూమిపై మనం జీవిస్తున్నాం. కానీ, మన ప్రవర్తనతో, మన దృక్పథాలతో ఈ పునాదిరాళ్లను మనకు మనమే బలహీనం చేసుకుంటున్నాం. పునాది బలహీనమైతే భవనం కుప్పకూలిపోతుంది. మనుషుల్లో నైతిక ప్రవర్తన కొరవడితే మానవత్వం పతనమైపోతుంది.
🍃🌹ప్రేమైనా.. ద్వేషమైనా మనలోని స్వభావాలే. మనం ప్రేమించే స్వభావులం కావాలంటే.. మనకు మనం ప్రేమత్వాన్ని సంతరించుకోవాలి. అప్పుడే మనుషులు నడయాడే ఈ నేల ప్రేమానందాల నందనవనం అవుతుంది.
🍃🌹అయినా.. సాటి మనిషిని ప్రేమిస్తే పోయేదేముంది? వీలుంటే, అవతలి వాళ్లు తిరిగి మనల్ని ప్రేమిస్తారు అంతే కదా...
ఉషోదయం తో మానస సరోవరం 👏
Source - Whatsapp Message

No comments:
Post a Comment