Friday, June 18, 2021

ఆణి ముత్యాలు

ప్రాణమున్న ప్రతి మనిషికి మరణ భయం అనేది ఉంటుంది..


“కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మరణ రెప్పపాటే జీవితమున్న సత్యాన్ని మరచి ఐహిక సుఖల మీద వ్యామోహంతో, పాపభీతి విడిచి, ఆస్తుల సంపాదనే ధ్యేయంగా జీవిస్తున్నాడు మనిషి. బ్రతుకు మీదున్న తీపితో నేరాలు, ఘోరాలు తలపెడుతున్నాడు.


బ్రతుకు తీపి ఎన్ని ఆశలు రేకెత్తిస్తుందో మరణ భయం అన్ని బాధలు కలిగిస్తుంది.


సృష్టిలో శాశ్వతమైనదేదీ లేదని నశించడం తప్పదన్న వివేకం లోపించినపుడు తానే శాశ్వతంగా, అజేయుడని భావిస్తాడు.


ప్రతి జన్మకు సార్థకత ఆవసరం. ఆ ప్రయత్నంలో ధర్మబద్ధమైన ఆశయాలు ఎంచుకుని ఆశనే శ్వాసగా జీవిస్తూ ధర్మమార్గంలో పయనించాలి. కొన్నిసార్లు చేసిన పొరపాట్లు ప్రాణాలు కోరతాయి.


గంధరుడైన గయుడు శ్రీకృష్ణుడి దోసిలిలో ఉమ్మిన పాపానికి అర్జునుడుని శరణు కోరి ప్రాణం నిలబెట్టు కున్నాడు.


మొసలి నోటికి చిక్కిన గజేంద్రుడు విష్ణువును ప్రార్ధించి గట్టెక్కాడు. అధికార ముందన్న అహంకారంతో, గొప్పవారిమన్న గర్వంతో ధర్మానికి హాని చేసేవారు ఉన్నారు.


అసూయతో యుద్దానికి కాలు దువ్వి విపత్కర పరిస్థితులలో ప్రాణభయంతో మడుగులో దాగిన దుర్యోధనుడి కథ భారతం వివరించింది.


సోదరి సంతానాన్ని కంసుడు సంహరించింటే ప్రాణభయంతోనే. కానీ అన్నిచోట్లా ధర్మమే గెలిచింది.


కొన్ని జీవితాలు జాతికి, లోకానికి ప్రయోజనకరమున్న భావనతోనే లక్ష్మణుణ్ణి సంజీవనితో పునర్జీవితుణ్ణి చేశాడు ఆంజనేయుడు.


పరాయి స్త్రీని కామించిన పాపానికి హతమయ్యాడు రావణుడు. పది తలల వాడైనా పరమాత్ముడి ముందు పరాజయం తప్పదని రామాయణం చెప్పింది.


విధిరాతకు, విధాత వేటుకు జీవులంతా బద్దులే. మృత్యువు అనివార్యమని గ్రహించి ప్రతిక్షణం లోక కళ్యాణానికి సిద్ధపడాలి.


సీతాదేవి రక్షణకై ప్రాణమిచ్చిన జటాయువు, దేశరక్షణ కోసం అమరులైన సైనికులు పరోపకారం కోసం ప్రాణత్యాగం చేసినవారే.


'జన్మించిన వారికి మరణం., మరణించిన వారికి జన్మం తప్పదన్న' గీతాకారుడి భాష్యం అవగతం చేసుకుంటే మరణ భయం కలగదు.


తక్షకుడి కాటుకు మరణించే సమాచారం తెలిసిన పరీక్షిత్తు కలవరపడలేదు. గంగా తీరం చేరుకొని శుకమహర్షి ద్వారా భాగవత కథలు విని తరించి, గుండె నిబ్బరంతో ప్రవర్తించాలన్న సత్యాన్ని అందించాడు.


జీవితం అశాశ్వతమని, మృత్యువు తథ్యమనే వివేకం, స్పేృహతో మనుషులుగా ప్రవర్తిస్తూ, విధులు, బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలి !

సేకరణ. మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment