Wednesday, June 16, 2021

ఒక మంచిమాట

💎ఒక మంచిమాట💥


ఒక మంచిమాట పలకడం వల్ల మనిషికి వేయి ఏనుగుల బలం వస్తుంది. చెడుమాట పలకడం వల్ల మనిషి మనసు నీరసించిపోతుంది. చెట్లు, చేమలు, జంతువులు, పక్షులు కూడా చక్కని సంగీతానికి, మధుర స్తుతులకు, బుజ్జగించే మాటలకు తలలూపుతూ అనుకూలంగా వ్యవహరిస్తాయని మనస్తత్వ శాస్త్రజ్ఞులు చెబుతారు.

కాబట్టి, కలలోనైనా చెడు మాట నోటినుంచి వెలువడరాదు. "ప్రాణం పోయినా సరే చెడుమాటను మాత్రం ఎన్నడూ పలకను" అని తమ జీవితాన్నే ధారపోసిన పూర్వపురుషులెందరో ఉన్నారు. వారి మాట పూలబాట. ప్రియభాషణం వల్లనే రాముడు ఆదర్శ మానవోత్తముడైనాడు. ప్రియభాషణంతోనే మహర్షులు గర్వాంధులైన రాజులకు కనువిప్పు కలిగించారు.

నేటి కాలంలో ధనం కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, అక్రమార్జనల కోసం, అనుచిత సుఖాల కోసం, దుర్వ్యసనాల కోసం... మనుషులు తోటివారిని మాటలతో చిత్రహింసలకు గురిచేస్తున్నారు. ఉద్వేగకర వ్యాఖ్యల కారణంగా ఎందరో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకొంటున్నారు.

మనిషిలో ఆత్మవిమర్శ కలగాలి. ఒక్కమాట కూడా రెచ్చగొట్టకుండా ఉండే విధంగా సంయమనాన్ని పాటించాలి. అదే మనిషి ఉన్నత వ్యక్తిత్వానికి దర్పణం.

సేకరణ. మానస సరోవరం

Source - Whatsapp Message

No comments:

Post a Comment