Wednesday, July 14, 2021

అమ్మ అబద్దాలు

అమ్మ అబద్దాలు 🔸



🔸అందగాడిని గాకున్నా ......
            చందమామనంటుంది

🔸 కంచం నిండా తిన్నా .......
            కొంచెమే కదా అంటుంది

🔸 అల్లరెంతగా చేసినా .......
          పిల్లలింతేనని చెబుతుంది

🔸 అత్తెసరున పాసయినా .......
    కొత్త సిలబసే కారణమంటుంది

🔸 ఆటలు పాటలు రాకుంటే .......
        వాటికి విలువలేదంటుంది

🔸 ఇంత కప్పు నే గెలిస్తే మాత్రం .......
          ఎంతో గొప్పని అంటుంది

🔸 తప్పులెన్ని నే జేసినా ........
          ఒప్పులుగనే లెక్కలేస్తుంది

🔸 అప్పుడప్పుడూ అబద్దమాడినా .......
        చెప్పనే చెప్పదు నాన్నకైనా


🔸 పాతికేళ్ళ వయసున్నా ........
          పసివాడిగానే చూస్తుంది

🔸 కష్టపడి వాళ్ళు
సంపాదించినా .......
            అదృష్టం నాదంటుంది

🔸మనం తల్లి తండ్రులo అయ్యాకే  తెలిసేది .......
        అమ్మ అబద్ధాలు
ఆమె మమతల నుంచి .......
              రాలిన పూలరెక్క లని

🔸 ఆమె వాత్సల్యమొలికించిన .......
          తేనె చుక్క లని

అమ్మకు వందనములు పాదాభి వందనములు

Source - Whatsapp Message

No comments:

Post a Comment