Wednesday, July 14, 2021

అమాయకులను హింసించినందుకు ఆ దుండగులు కూడా ఏదో ఒక శిక్షను అనుభవించే సమయం వస్తుంది...

గురు భోధ
"""""""""""

ఊరికి దూరంగా ఉన్న ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు తన శిష్యులకు జ్ఞాన బోధ చేస్తూ కాలం వెళ్ళబుచ్చుతున్నాడు.

ఒకరోజు అకస్మాత్తుగా కొందరు దుండగులు… ఆ ఆశ్రమంలోకి చొరబడ్డారు.

నిదురిస్తున్న వారినందరిని కాళ్ళతో తంతూ,
బిగ్గరగా కేకలు వేస్తూ, వికటంగా నవ్వుతూ,
నానా భీభత్సం చేసారు.

ఆశ్రమం లోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా విసిరేసి,
పూల మొక్కలన్నిటిని పీకి పారేసారు.

ఎదురు తిరిగిన వాళ్ళని కత్తులతో గాయపరిచారు.

అంతా భయంతో వణికిపోతుంటే వారిని చూచి ఆనందంతో గంతులు వేస్తూ వెళ్ళిపోయారు..

ఈ సంఘటన జరిగిన రెండు రోజుల తరవాత…

గురువుగారు హితోపదేశం చేస్తుండగా ఒక శిష్యుడు అడిగాడు… “స్వామి! మనమేం పాపం ఎరుగం కదా..!

మొన్న రాత్రి ఆ దుండగులు మనల్ని అట్లా హింసించి పోవడం న్యాయమేనా..?
వారికి శిక్ష ఉండదా.?”

గురువుగారు ఒక్క క్షణం ఆలోచించారు.

అప్పుడే ఎక్కడినుంచో ఒక పిల్లిని తరుముకుంటూ ఒక కుక్క ఆ ఆశ్రమంలోకి ప్రవేశించింది.

వెంటనే ఒక శిష్యుడు లేచి ఆ కుక్కని ఒక రాయితో కొట్టి అక్కడినుంచి వెళ్ళగొట్టాడు.

అప్పుడు గురువుగారు ఎదురుగా ఉన్న శిష్యుడితో ఇలా అన్నారు..

“చూసావా నాయన..!
ఈ పిల్లి ఏ తప్పు చెయ్యలేదు.
ఆ కుక్క జోలికసలు పోనే లేదు.

అయినా ఈ పిల్లిని చూడగానే దానిపైకి దాడికి పూనుకుంది కుక్క.

అది కుక్క సహజ లక్షణం.

ఈ లోకంలో దుర్మార్గులు అతి సహజమైన తమ దుర్గునాలని ఏళ్ళ వేళల ప్రదర్శిస్తూనే ఉంటారు.

మంచి ఎప్పుడు చెడు జోలికి వెళ్ళాడు కాని చెడు ఎప్పుడు మంచిని బాదించడానికే ప్రయత్నిస్తుంది.

చెడు పనికి ఆ కుక్కకి రాయి దెబ్బ తప్పనట్టే… అమాయకులను హింసించినందుకు ఆ దుండగులు కూడా ఏదో ఒక శిక్షను అనుభవించే సమయం వస్తుంది” అన్నాడు

🌞

Source - Whatsapp Message

No comments:

Post a Comment