Wednesday, September 29, 2021

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం..!

★ పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.

★ నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.

ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.

బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై తద్వారా పరమాత్మను చేరుకుంటాము. ★ Astro Village [INDIA]★ ◆ జ్యోతిష్యాలయం◆ ■వాట్సాప్: 8008872109

సేకరణ

దైవభీతి

దైవభీతి
➖➖➖✍️

భగవంతుడికి ఎందుకు భయపడాలి?
వాస్తవానికి, దేవుణ్ని చూసి భయపడాల్సిన పనిలేదు. భగవంతుడు పరిపూర్ణ ప్రేమ స్వరూపుడు. దేవుడి కంటే ఆత్మ బంధువు మరొకరు ఉండరు. ఆయనకు తరతమ భేదాలు ఉండవు.

అటువంటి ఆత్మ స్వరూపమైన భగవంతుడు భయాన్ని ఎందుకు కలిగిస్తాడు?

సర్వం తెలిసినవాడు, శక్తిమంతుడు, రంగు, రూపంలేని దేవుడు ఉన్నాడనేది- సద్భావన.
అక్కడ భయానికి తావులేదు. ఆయన విశ్వమంతా అణువణువునా వ్యాపించి ఉన్నాడు. అందుకే ఒక్క క్షణం కూడా క్రమం తప్పని క్రమబద్ధీకరణతో విశ్వ పయనం నిరంతరాయంగా కొనసాగుతుంది.

భూమిపై జన్మించిన ప్రతి ప్రాణి లోనూ ఈ క్రమం గోచరమవుతుంది. బాల్య, యౌవన, కౌమార, వార్ధక్యాలు... ఏ ప్రాణీ తప్పించుకోలేని దశలు.

బాల్యాన్ని భగవత్స్వరూపంగా భావిస్తాం. కల్మషరహితంగా, నిస్వార్థంగా, గతానికి భవిష్యత్తుకు అతీతంగా వర్తమానంలోనే జీవించాలని తెలిపే మహోన్నత దశ అది.

యౌవనంలో ఊహలు వికసించి వ్యక్తిత్వం రూపుదిద్దుకొంటుంది. అవగాహన ఏర్పడుతుంది. ఆ సమయంలో తల్లిదండ్రులు నాటే ఆధ్యాత్మిక బీజాలు మనసులో అంకురాలు అవుతాయి.

కౌమారంలో పరిపూర్ణ వ్యక్తిత్వం అభివృద్ధి చెందుతుంది. వ్యక్తిత్వంలో విచక్షణ మొదలవుతుంది. ఆధ్యాత్మిక భావనలు విస్తృతమై అవగాహనతో కూడిన సాధన వైపు ప్రయాణం మొదలవుతుంది.

కొన్ని అనవసర భయాలు బాల్యంలోనే మనసులో చొరబడతాయి. వాటిని ఉంచుకోలేం, వదిలించుకోలేం అన్నట్లు ఉంటాయి. అవి తలపునకు వస్తే చాలు- వార్ధక్యంలోనూ గగుర్పాటు కలుగుతుంది. వచ్చీపోయే తాత్కాలిక భయాలు ఆధ్యాత్మిక పరిణతి వల్ల తొలగిపోతాయి.

జీవితాంతం వెంబడించే శాశ్వత భయం మరణం. దీన్ని సాధన ద్వారానే జయించగలుగుతాం. మొగ్గ, పువ్వు, కాయ, పండు... ఏదో ఒకరోజు రాలిపోక తప్పదన్న స్థితప్రజ్ఞ సిద్ధిస్తుంది.

పదహారేళ్ల ప్రాయంలోనే మరణానుభూతి పొంది, ఆ భీతి నుంచి శాశ్వతంగా బయటపడి, మౌనం ద్వారా ప్రపంచాన్నే తన వైపు చూసేలా చేసుకున్నారు భగవాన్‌ రమణ మహర్షి.

భయానికి మూల కారణం అభద్రతా భావమే.

ఆదిలోనే దాన్ని అదుపు చేయకపోతే వ్యక్తిగత ప్రపంచమంతా భయంతోనే నిండిపోతుంది.

భయం ఎప్పుడూ ఒంటరిగా రాదు. మనకు తెలిసిన దాన్ని గురించి గానీ, ఎవరో ఒకరు తెలియజేసినదాన్ని గురించి గానీ, చేయబోయేదాన్ని గురించి గానీ భయం మొదలవుతుంది.

ఉన్న స్థితి నుంచి ఉండాలనుకునే స్థితికి మధ్య ఊగిసలాటే భయానికి నాంది.

భయం అనే పదం మదిలో మెదిలితే చాలు, మనసు పరాధీనమవుతుంది. భయపడే మనసు స్వేచ్ఛను కోల్పోతుంది. ధైర్యంగా భయాన్ని ఎదుర్కోగలిగేవారికే విజయం దక్కుతుంది.

కలుపు మొక్కల్లాంటి భయం యొక్క మొలకల్ని ఎప్పటికప్పుడు పెరికి వేస్తుండాలి.

భయం ఆరోగ్యకరమైన స్థాయిలో ఉండాలి.

అప్పుడే అది మనం జాగ్రత్తగా మసలుకునేలా చేస్తుంది. నిప్పును చూసి భయపడతారు. ధైర్యం చేసి ముట్టుకుంటే, ఏం జరుగుతుందో తెలుసు. భయం ఒక హెచ్చరిక.

అపాయం గురించి తెలిసినప్పుడు, దాన్ని ఎలా దాటాలన్న పద్ధతులను అన్వేషించే ప్రేరణ భయం కావాలి.ఈ దృష్టితో ఆలోచించి భయాన్ని ఒక సవాలుగా తీసుకోవాలి.

అది మనలో అంతర్గతంగా ఉన్న ఆధ్యాత్మిక శక్తిని వెలికితీసే అవకాశంగా భయాన్ని భావించాలి.

అప్పుడు అది మనలో ఉన్న ఆత్మ సామ్రాజ్యానికి మనల్ని అధిపతిని చేస్తుంది!✍️

. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవంతు

సేకరణ

గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

😘 ప్రశాంతతకి లాజిక్కు

గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకుంటుంది. ఒక రోజుకి 7000 లీటర్లు పంప్ చేస్తుంది. మా ఇంటి నీళ్ళ ట్యాంకు 1000 లీటర్లు. అలాంటి 7 ట్యాంకుల రక్తాన్ని గుండె ఒక్క రోజులో పంప్ చేస్తుంది.

ఇందులో 70% మెదడుకి వెళుతుంది. 30% మిగతా శరీర అవయవాలకు వెళుతుంది.

గుండె ఒకసారి కొట్టుకోటానికి 0.8 సెకన్ల సమయం పడుతుంది. ఈ 0.8 సెకన్ల సమయంలో 0.3 సెకన్ల సమయం సంకోచించటానికి (contraction), 0.5 సెకన్ల సమయం వ్యాకోచించటానికి (అంటే రిలాక్స్ కావటానికి). ఈ 0.5 సెకన్ల రిలాక్స్ టైమ్ లో రక్తం ఊపిరి తిత్తులకు వెళ్లి శుభ్రపడుతుంది. ఈ రిలాక్స్ టైమ్ తగ్గితే రక్తం సరిగా శుభ్రపడదు.

మీరు టెన్షన్ లో గానీ కోపంతో గానీ ఉంటే ఏమవుతుంది? మీ మెదడుకి ఎక్కువ రక్తం అవసరమవుతుంది. అప్పుడు గుండె తక్కువ రిలాక్స్ అవుతుంది. 0.5 బదులు 0.4 సెకన్ల టైమ్ రిలాక్స్ అవుతుంది. గుండె ఒక బీట్ కి 0.8 కి బదులు 0.3 + 0.4 = 0.7 టైమ్ మాత్రమే తీసుకుంటుంది. నిమిషానికి 84 సార్లు కొట్టుకుంటుంది. గుండెకి విశ్రాంతి (రిలాక్సేషన్) 20% తగ్గుతుంది. రక్తం 80% మాత్రమే శుభ్రపడుతుంది.

ఈ అపరిశుభ్రమైన రక్తం మీ మెదడుని మీ శరీర అవయవాలని సరిగా శుభ్రపరచలేకపోతుంది.

కనుక కోపపడవద్దు, టెన్షన్ పడవద్దు. ఇతరులమీద కోపం, ద్వేషం బదులు మీరు ప్రేమ చూపిస్తే మీ గుండె 72 సార్లు కొట్టుకుని మీ మెదడు ప్రశాంతంగా చురుకుగా ఉంటుంది.

ఇంతే.
గుండె నెమ్మదిగా ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది

☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️

సేకరణ

నేటి జీవిత సత్యం. (పాపం నుండి విముక్తి)

నేటి జీవిత సత్యం.

‘అనుకోకుండా ఏదైనా పాపం చేసిన వ్యక్తి పశ్చాత్తాపంతో దానిని మళ్ళీ చేయనని మనస్ఫూర్తిగా నిశ్చయించుకొంటే ఆ పాపం నుండి విముక్తి పొంది పవిత్రుడవుతాడు’. మతిమరపువల్ల లేదా పరధ్యానంలో ఉండి చేసినా కూడా పాపం పాపమే. దానిని పోగొట్టుకోవడానికి రెండే మార్గాలు ఉన్నాయని మన సనాతన ధర్మం చెబుతున్నది. మిక్కిలి కోపిష్ఠుడైన కౌశికునికి ధర్మోపదేశం చేసిన ధర్మవ్యాధుడు కూడా అతనికి ఇదే మాటను నొక్కి చెప్పాడు.
మది మఱపున బాపము దన
కొదవుటయును బిదప వగచి యొక సగమును నే
నిది సేయనింక ననియెడు
మదిఁ బెఱ సగమును నరుఁడు మలుఁగు నఘంబున్‌.
-మహాభారతం (ఆరణ్యపర్వం:5-41)
‘తెలియకుండా చేసిన పొరపాటును తలచుకొని బాధ పడటం వల్ల ఆ పాపంలోని సగభాగం తొలగిపోతుంది. అలాంటి తప్పులను ఇక ముందెప్పుడూ చేయనని మనస్సాక్షిగా నిర్ణయించుకొని, ఆ కట్టుబాటును పాటిస్తే మిగతా సగ పాపం తొలగిపోతుంది’. ఏదైనా పాపం గానీ, నేరం గానీ తెలియకుండానో, అనుకోకుండానో చేయడం మానవ సహజం. ‘తప్పిదం ఏదైనా జరిగినప్పుడు ఆ పొరపాటును తెలుసుకొని, ఇక ముందెప్పుడూ దానిని చేయకూడదని నిర్ణయించుకొని బాధ పడటమే’ పశ్చాత్తాపమని మన సనాతన ధర్మం చెపుతున్నది. అనుకోకుండా చేసిన పాపానికి పరిహారంగా చేసే ప్రయత్నాన్నే ‘ప్రాయశ్చిత్తమని’ అంటారు. ప్రతి మనిషీ మనసా వాచా కర్మణా ఎప్పడూ ఏ తప్పులనూ చేయకుండా ఉండాలి. ఏ తప్పుకైనా ఆ పాపం ఊరికే పోదు. ఒకవేళ ఏవైనా పొరపాట్లు అనుకోకుండానో, పరధ్యానంలోనో చేసినా వాటికి పరిహారంగా ఆ పాప ప్రాయశ్చిత్తం చేస్తుండాలి. అప్పుడే, ఆ పాపం తొలగిపోతుంది. ‘కొన్ని సందర్భాల్లో అనుకోకుండా చేసిన పాపాన్ని మనసులో తలచుకొని సిగ్గుతో తలవంచుకొని కుంగిపోయినట్లయితే, ఆ పాపం పటాపంచలవుతుందని’ పురాణాలు చెపుతున్నాయి. దానినే ‘మనఃప్రాయశ్చిత్త’మని అంటారు.
పిత్రోర్నిత్యం ప్రియం కుర్యాత్‌
ఆచార్యస్యచ సర్వదా
తేషుహి త్రిషు తృప్తేషు
తపస్సర్వం సమాప్యతే.
‘తల్లి, తండ్రి మాటనుగానీ, గురువు మాటనుగానీ జవ దాటకుండా ఎప్పుడూ వారికి అనుకూలంగా నడుచుకోవాలి. ఈ ముగ్గురూ తృప్తి పడినట్లయితే ఎన్నో తపస్సులు చేసిన ఫలితం సిధ్ధిస్తుంది’. తల్లిదండ్రులను బాధ పెట్టడం వల్ల కలిగే పాపానికి మాత్రం నిష్కృతి లేదు. ఎప్పుడైనా గురువు మాటను ధిక్కరించి మాట్లాడితే, ఆ పాపం సదరు గురువును వినయ విధేయతలతో ఆహ్వానించి, ఉపాహారాన్ని సమర్పించుకొని సంతోష పెట్టడం ద్వారా తొలగింపజేసుకోవచ్చు. కొట్టివేయ కూడని చెట్టును నరికి వేయడం, స్వేచ్ఛగా జీవించే పక్షులను స్వార్థబుద్ధితో వధించడం వంటివీ మహాపాప హేతువులే. ఐతే, అనుకోకుండా చేసే పాపాలు ‘అన్నపానీయాలను వదిలిపెట్టి కేవలం గాలిని మాత్రమే పీలుస్తూ నియమనిష్ఠలతో జీవితాన్ని గడపడం ద్వారా’ నశిస్తాయి. దైవసన్నిధిలో ఇతరులు వెలిగించిన దీపాన్ని దొంగిలించిన పాపం వల్ల గుడ్డివాళ్లయి పోతారు. గుడిపైనగానీ, రథంపైగానీ, పర్వతంపైగానీ మళ్ళీ దీపం వెలిగిస్తేనే దానికి పరిహారం లభిస్తుందని సనాతన ధర్మం ప్రబోధిస్తున్నది. చేసిన పాపాలకు పరిహారంగా ఇలాంటి శిక్షలు ధర్మశాస్ర్తాలలో చెప్పడమనేది మనం అలాంటి పాపాలకు పాల్పడకూడదనే. ఇతరులను బాధ పెట్టడమనేదే మహాపాపం. అలాంటి పాపాలకు ఏ మాత్రం తావివ్వకుండా ధర్మబద్ధంగా బతుక గలిగినప్పుడే మానవ జీవితం సార్థకమవుతుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

నానాటి బదుకు నాటకము (తాళ్ళపాక అన్నమాచార్యులు)

నానాటి బదుకు నాటకము:-
(తాళ్ళపాక అన్నమాచార్యులు)

నానాటి బదుకు నాటకము
కానక కన్నది కైవల్యము

పుట్టుటయు నిజము ... పోవుటయు నిజము
నట్టనడి మీ పని నాటకము
ఎట్ట ఎదుట గలది ప్రపంచము
కట్ట కడపటిది కైవల్యము

కుడిచేదన్నము ... కోక చుట్టెడిది
నడుమంత్రపు పని నాటకము
వొడిగట్టుకొనిన ఉభయ కర్మముల
గడి దాటినప్పుడే కైవల్యము

తెగదు పాపము ... తీరదు పుణ్యము
నగి నగి కాలము నాటకము
ఎగువలో శ్రీ వేంకటేశ్వరుడేలిక
గగనము మీదిది కైవల్యము

శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రెండు విషయాలను మనకు విన్నవించారు. ఒకటేమో నాటకం, రెండవదేమో కైవల్యం.

నానాటి అంటే నాలుగు రోజుల ఈ బతుకు... బాల్యము, యవ్వనము, ప్రౌఢత్వం, వృద్ధాప్యము... ఈ దేహ స్థితులు ప్రతి జన్మలోనూ మనకు ఉంటాయి. ఆ తర్వాత శరీరాన్ని వదిలి పెట్టెయ్యాలి. శరీరాన్ని వదిలి పెట్టకముందే మనం శరీరం కాదు ఆత్మ పదార్ధం అని గ్రహించాలి. 'కానక' అంటే చర్మచక్షువులతో కనకుండా! 'కన్నది' అంటే దివ్యచక్షువుతో మూడవకన్నుతో చూసిందే కైవల్యం అనగా చిట్ట చివరి స్థితి అని వివరిస్తున్నారు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారు.

ఈ పుట్టుక, చావు మధ్యలో ఉన్న పనే నాటకం. 'తల్లిగానో, తండ్రిగానో, భర్తగానో, భార్యగానో, కొడుకుగానో, కూతురుగానో నాటకాలు వేస్తాము', అయితే అదే సత్యమనుకున్నామా దు:ఖంలో పడతాం. మనం ఈ శరీరాన్ని వదిలి పెట్టేసిన తర్వాత వేరే ప్రపంచానికి వెళ్తాం ...సత్యలోక ప్రపంచానికి ! ఆత్మలోక ప్రపంచానికి ... అదే కైవల్యం అంటున్నారు శ్రీ తాళ్ళపాక వారు..

రోజంతా కూడానూ మనం కేవలం అన్నము, బట్టల కోసమే శ్రమిస్తున్నాము! ఎంత మాత్రం 'ఆత్మ ప్రాధాన్యత' లేదు...అన్నానికీ, బట్టకూ! ఏదో శరీరం నిలకడ కోసం కొద్దిగా తింటే సరిపోతుంది. శరీరాన్ని రక్షించుకునేందుకు కొద్దిగా బట్ట చుట్టుకుంటే సరిపోతుంది. దీనికి ఇంతగా పరితపించనేల? నాటకాన్ని నాటకంగానే స్వీకరిద్దాం అని అంటున్నారు అన్నమాచార్యుల వారు. ఉభయ కర్మములు అనగా మంచి, చెడు. ఈ ఉభయ కర్మలు కూడా సమూలంగా నశించాలి! చెడు ఒక బంధం. మంచి కూడా మరొక బంధమే. ఈ రెండూ నశించినప్పుడే కైవల్యం.

పుణ్యం అన్నది తీరేది కాదు. పాపం కూడా తీరేది కాదు. కనుక ఈ రెండింటి నుండి బయటికి రావాలి అనగా పుణ్య భావన నుండి, పాప భావన నుండి బయటికి రావాలి. నువ్వు శరీరమే కాదు, ఆత్మ పదార్థం అని తెలుసుకుంటే రెండింటి నుంచి బయటికి రావచ్చు అని శ్రీ తాళ్ళపాక వారు సెలవిస్తున్నారు. 'ఎగువ' అంటే ఆరు చక్రాల పైన ... సహస్రారంలో అన్నమాట. సహస్రార స్థితిలో ఉన్నవారినే యోగీశ్వరులు అని పిలుస్తారు. వారు మాత్రమే కైవల్య స్థితిని చేరినవారు.

నాలుగు రోజుల ఈ శరీర యాత్ర ఓ నాటకం. అయితే ఆత్మయాత్ర అన్నది మటుకు శాశ్వతమైనది. అది మూణ్ణాళ్ళ ముచ్చట కాదు! అది శాశ్వతమైన లీలా యాత్ర! శరీరగతమైన ఈ మూణ్ణాళ్ళ ముచ్చటను ససేమిరా దు:ఖభరితం చేసుకోకుండా, ముచ్చటగా జీవించాలి! అందుకు నాటకాన్ని విధిగా నాటకంగానే స్వీకరించాలి!!

సేకరణ

Monday, September 27, 2021

మంచి మాట. లు

ఆత్మీయ బంధుమిత్రులకు సోమవార శుభోదయ శుభాకాంక్షలు
అది దంపతులు పార్వతి పరేశ్వరుల అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యలు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. అందరు బాగుండాలి.. అ అందరిలో ఎట్లనూ మనం తప్పక ఉంటాం. ఇంకొకరి మంచిని కోరుకునేవారిని దేముడు ఎప్పుడు మంచిగానే చూస్తాడు. మనకు వచ్చే కష్టాలు బాధలు అన్ని కర్మనుసారంగా జరగవలసిందే.. ఈ జన్మలోకాకపోతే వచ్చే జన్మలోనైనా వడ్డీ తో సహా అనుభవించవలసిందే..
సోమవారం --: 27-09-2021 :--

మనకు సంతోషం నేర్పలేని ఎన్నో విషయాలు కన్నీళ్లు నేర్పుతాయి గెలుపు నేర్పలేని ఎన్నో పాఠాలు ఓటమి నేర్పుతంది స్నేహం నేర్పలేని ఎన్నో జాగ్రత్తలు మోసం నేర్పుతుంది అందుకే అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని .

ప్రకృతిని ప్రేమించు . అందాన్ని ఆస్వాదించు మంచిని ప్రోత్సాహించు విజ్ఞానానికి చేయుతనివ్వు అన్నీ సాధించాకే ఆనందం వుంటుందని అనుకోకూడదు .
ఆనందంగా ఉంటేనే అన్నీ సాధించగలం విద్య నేర్చుకుని గురువును మర్చిపోకు ధనం వచ్చాక స్నేహం మర్చిపోకు . భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోకు గౌరవం వచ్చాక గతం మర్చిపోకు అవసరం తీరాకసాయపడిన వ్యక్తిని మర్చిపోకు మంచి చేసే అలవాటున్నవారికి మంచిని అభినందించే లక్షణాలున్న వారికి మనసు హాయిగా ఉంటుంది .
సాటివారి అభివృద్ధిని చూసి ఆనందిస్తే తమ జీవితంకూడా ఆనందమయం అవుతుంది. మంచితనానికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు అపనిందలే

కష్టాలు మన సామర్థ్యాన్ని
బయటకు తీస్తాయి ! సుఖాలు మన బలహీనతను బయట పెడుతాయి అవమానాలు మనల్ని ఒక మెట్టు ఎక్కేలా చేస్తాయి నిందలు మన సహనానికి పరీక్ష పెడుతాయి ! హేళనలు మన విజయానికి దోహదపడుతాయి .. !
         
సేకరణ 🖊️*మీ ... AVB సుబ్బారావు 💐🌹🌷🤝

సేకరణ

మంచి మాట. లు

ఆత్మీయ బంధుమిత్రులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు పూజ్య గురుదేవులు అది శంకరచార్యులవారు నడిచే దేవుడు చెంద్రశేఖర సరస్వతి స్వామి వారు, గురు దత్తాత్రేయ స్వామి వారు గురు రాఘవేంద్ర స్వామి వారు పూజ్య గురుదేవులు సాయి నాథుని అనుగ్రహం తో మీరు మీ కుటుంబసభ్యులు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందముగా జీవించాలని కోరుకుంటూ.
ఈ రోజు AVB మంచి మాట. లు
గురువారం --: 23-09-2021 :--

అందమైన ఈ ఉదయంలా మీరంతా ఎప్పుడూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ ... డబ్బు సంపాదించమని చెబుతుంది , కాలం ఆగకుండా పరుగెత్తమని చెబుతుంది , లక్ష్యం కష్టమైనా చేరమని చెబుతుంది , నమ్మకం వీటున్నింటికీ నేనున్నానని భరోసా దైర్యం ఇస్తుంది .

హృదయంలో ద్యేషం లేకుండా మనస్సులో దిగులు చికాకు లేకుండా ఉండటమే నిజమైన ఆనందం ! ఎప్పుడూ బాధ పడుతూ ఉంటే బతుకు భయపెడుతుంది అదే ప్రతి క్షణం నవ్వుతూ సమస్యలని దైర్యంగా ఎదుక్కొంటే జీవితమే తలవంచుతుంది .

ఒకసారి మనం దెబ్బతింటేనే తెలుస్తుంది నీలో ఎంత ధైర్యముoదో ఒకసారి నీవు తప్పు చేస్తేనే తెలుస్తుంది నీవు ఇంకా ఎంత నేర్చుకోవాలో ఒకసారి నీవు ఓడిన తర్వాతే తెలుస్తుంది నీవు ఎలా గెలవగలవో ఏ క్షణం నుండి మన మనసు ఎదుటివారి మంచిని కోరడం ప్రారంభిస్తుందో ఆ క్షణం నుండి మనకు ఆనందం మొదలవుతుంది .

కొన్నింటి విలువ మనం కోల్పోయిన్నప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ అది మనకు దొరకనప్పుడు తెలుస్తుంది కొన్నింటి విలువ కాలం గడిచేకొద్దీ తెలుస్తుంది ఒక అనాలోచిత అబద్దాన్ని గెలిపించేందుకు మరెన్నో అబద్దాలకు ఊపిరి పోయకు ఆ సంఘటన ఊసురు ఎందరికో శాపం కావచ్చు ఆ పాపం దహించివేస్తుంది .

సేకరణ ✒️*మీ ... ఆత్మీయబంధువు AVB సుబ్బారావు 💐🌹🤝

సేకరణ

స్వరూపం స్వభావం.

స్వరూపం స్వభావం.

స్వరూపం అంటే భాహ్యమైనది, కనిపించేది అని అర్దం.స్వభావం అంటే గ్రహించాల్సింది గుణం అని అర్దం.స్వరూపం కన్నా స్వభావం మిన్న.కానీ నేడు సమాజంలో స్వరూపం వెంట పరిగెడుతున్నారు.ఆడంబరానికే విలువిస్తునారు.కారణం అజ్ఞానం.

విచిత్రం ఏమిటంటే ఎంతో గొప్పవారు అనుకునే వాళ్ళు కూడా మాయలో పడుతున్నారు.ముఖ్యంగా వివాహ సంబంధాల విషయాలలో.కొందరైతే గుడ్డిగా మోసపోతున్నారు.ప్రేమ పెళ్లిళ్లు కూడా వేగంగా విఫలం అవుతున్నాయి స్వరూపాన్ని నమ్మి.

చాలామంది ఆరోగ్యం గురించి కానీ నైతిక కుటుంబ మానవ విలువలు గురించి కానీ లోతుగా పరిశీలించక ఎదుటివారు సానుభూతి తెలిపేంతగా విఫలం అవుతున్నారు. నష్టపోతున్నారు.శ్రీకృష్ణ భగవానుడి స్వరూపం అందరికీ తెలుసు. మరి ఆ స్వభావం పాండవులకే బాగా తెలుసు .అందుకే ఆయన చెప్పినట్టు చేసి విజయం పొందారు.అలాగే తోకస్వామి అదేనండి ఆంజనేయ స్వామి స్వరూపం అందరికీ తెలుసు. మరి ఆయన స్వభావం ఎంత విశ్వాసం,ఎంత నమ్మకం,ఎంత గౌరవం,ఎంత శక్తివంతం.అలా గ్రహిస్తూ పోతే మన ఇరుగుపొరుగు,మన బంధువర్గంలో కూడా ఎందరో కనిపిస్తారు.

తినకూడనివి తిని తినాల్సినవి తినకపోయినా,శ్వాస మీద ద్యాస ధ్యానం మెడిటేషన్ గురించి తెలుసుకో పోయినా చేయక పోయినా ఈ లోటు కచ్చితంగా కనిపిస్తుంది.కాబట్టి స్వభావాన్ని గ్రహిద్దాం.సంతోషంగా జీవిద్దాం.
ఆనందంగా ఉందాం.🙊🙊🙏🙏

సేకరణ

నేటి మంచిమాట.

నేటి మంచిమాట.

కెరటం నాకు ఆదర్శం. పడినందుకు కాదు పడినా తిరిగి లేచినందుకు.నేటి తరానికి ఇది అర్దం అయితే చాలు.అందరూ వివేకానందులు అయినట్లే.

అంటే జీవితం ఒక పెద్ద సముద్రం. ఆ సముద్రంలో కెరటాలు రావడమూ,పడటమూపడినా తిరిగి లేవడమూ ఇది నిరంతర ప్రక్రియ అని భావం.అలాగే మన జీవితంలో కూడా ఎన్నో సంఘటనలు ఎదురౌతాయి.వాటిని కాచుకోవాలి ఎదుర్కోవాలి అని అర్దం. ఎవరి జీవితమూ పూలపాన్పు కాదు అని అర్దం.

యుగ యుగాలుగా తరతరాలుగా మనమంతా దేవుళ్ళని భావించి పూజిస్తున్న రాముడూ,కృష్ణుడూ,సీతమ్మ తల్లీ మొదలు నేటి దిగ్గజాలు అనుకునే వారివరకు ఎవరి జీవితం పూలపాన్పు కాలేదు .

రాముడు దేముడే కదా! అరణ్యవాసం ఏమిటండీ? కృష్ణుడు దేవుడే కదా చెరసాలలో పుట్టడం ఏమిటండీ? సీతమ్మ తల్లి దేవతే గదా వనవాసం ఏమిటండీ? అంటే కష్టాలు అందరికీ వస్తాయి,పోతాయి అని తెలుసుకోవాలి.ఏదీ శాశ్వతం కాదు అని గ్రహించాలి. అన్ని కష్టాలు,బాధలు పడి వున్నారు కాబట్టే నాటి నుండి నేటి వరకు దేవతలుగా వెలుగొందుతున్నారు.

అందుకే నరేంద్రనాథ్ దత్తా అదేనండి స్వామి వివేకానంద ధైర్యమే దైవం,భయమే దయ్యం అన్నారు.ధైర్యంగా ఉండాలన్నా,భయం వద్దనుకున్నా చక్కటి శుద్ధమైన సాత్వికాహారం శాకాహారం మితాహారం తీసుకోవాలి.శ్వాస మీద థ్యాస తో థ్యానం చేస్తూ శాంతంగా ప్రశాంతంగా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలి.
ఇదే జీవిత పరమార్థం .

శుభోదయం తో మానస సరోవరం. 👏

సేకరణ

మానసిక సౌఖ్యం మహోన్నతం

మానసిక సౌఖ్యం మహోన్నతం

సుఖం, అనేది అంగట్లో దొరికే వస్తువే అయితే ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడుపోయే వస్తువు అయ్యేది. వెండి, బంగారం, వజ్రాల కంటే విలువైనది అయ్యేది. అది కొని తెచ్చుకునేది కాదు. ప్రతి మనిషీ తనకు తాను, తనలో తాను రూపొందించుకునే గొప్ప అనుభూతి!

మణిమాణిక్యాలు, వజ్రవైఢూర్యాలు, ధనరాశులు, రాజ్యం, అధికారం, మహా ఐశ్వర్యం ఇవన్నీ దర్పాన్ని తెచ్చిపెడతాయి కానీ, చిటికెడు సుఖాన్ని అందించలేవు. కనీసం కంటినిండా కునుకు తీసే అవకాశాన్ని ఇవ్వలేవు.

కప్పినుడు అలాంటి పరిస్థితిని చవిచూశాడు. అతను కుక్కుట రాజ్యానికి రాజు. తండ్రి మరణానంతరం రాజయ్యాక జంబూ ద్వీపం మొత్తాన్ని జయించాడు. రాజులందర్నీ పొరద్రోలాడు. కానీ... మెత్తటి పడక ఉన్నా, సుగంధ పరిమళ ద్రవ్యాలు ఉన్నా కంటినిండా నిద్రపోలేక పోయాడు. శత్రువులు ఏ క్షణాన, ఏ రూపంలో వచ్చి పడతారో అనే భయం. అతను ఒకరోజున నగర ప్రదక్షిణ చేస్తూ చెట్టుకింద హాయిగా నిద్రపోతున్న ఒక భిక్షువుని చూశాడు. ఆగి అతణ్ణి లేపి ‘‘నీ సుఖనిద్రకు కారణం ఏమిటి?’’ అని అడిగాడు. ఆ భిక్షువు రాజుని బుద్ధుని దగ్గరకు తీసుకుపోయాడు. బుద్ధ ప్రబోధం విన్నాడు రాజు.
‘‘కోరికలు ఎడతెరిపి లేనివి. వాటివల్ల కలిగే కామసుఖం తాత్కాలికం. కానీ నిష్కామసుఖం గొప్పది. శాశ్వతం. సంపాదనతో ముడిపడిన కర్మవల్ల కలిగే సుఖం కొద్దిపాటిది. అలా ముడిపడనిది మహత్తరమైనది. తృష్ణవల్ల కలిగే సుఖం తుచ్ఛం. తృష్ణారహిత సుఖం అమోఘం. లేశమంతే లౌకిక సుఖం. అద్వితీయం. అలౌకికసుఖం, శారీరక సుఖం కంటే మానసిక సుఖం మహోన్నతమైంది. సుఖం మీద ప్రీతితో పొందే సుఖం కంటే అప్రీతితో పొందే సుఖం అమరమైంది. అపేక్షతో పొందే సుఖం అమరమైంది. ఆపేక్షతో పొందే సుఖం కంటే ఉపేక్షతో పొందే సుఖం ఉన్నతమైంది. ఉత్తమమైంది. సమాధిస్థితిలో పొందే సుఖం అనిర్వచనీచమైంది.

ఒక గృహస్తు పొందే సుఖం కంటే తాపసి ధ్యాని పొందే సుఖం ధరణీతలంలో అన్నింటికంటే గొప్పది’’ అని చెప్పాడు.

మనం మరొకరి సుఖాన్ని దొంగిలించినా, లాక్కున్నా అది మనకు సుఖాన్నివ్వదు. దొంగ అందుకే ఎంత ధనాన్ని దోచుకున్నా సుఖంగా బతకలేడు. పట్టుబడతానేమో అనే భయంతో బతుకుతూనే ఉంటాడు. కామ దురాచారుల గతి కూడా అంతే! ఎదుటివారి శ్రమను దోపిడి చేసినా, సంపదను దోచుకున్నా, పరుల అధికారాన్ని, రాజ్యాల్ని బలవంతంగా హస్తగతం చేసుకున్నా, ఆస్తి, అంతస్తు అధికారాల్ని పెంచుతాయి గానీ, ఆదమరచి నిద్రపోనీయవు. కునుకు సుఖాన్ని కూడా దక్కనీయవు. కామ, క్రోధ, లోభ, మోహ, రాగాల్ని వీడినవారే అమరమైన సుఖాన్ని పొందగలరు.

బుద్ధ ప్రబోధానంతరం, రాజ్యాన్ని త్యజించి, భిక్షువుగా మారాడు కప్పియరాజు. ‘ప్రజ్ఞాని మాత్రమే సుఖంగా జీవిస్తా’డనే బుద్ధవాక్కు ప్రకారం ఆ తర్వాత ఆనందంగా, సుఖంగా, కంటినిండా నిద్రపోయాడు. జీవితాంతం ధర్మాన్ని ప్రబోధిస్తూ మరణించాక కూడా అమరుడయ్యాడు. కప్పియ భిక్షువుగా కీర్తిగాంచాడు.
– డా. బొర్ర గోవర్ధన్.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

పాప భారం.

పాప భారం.

గంగలో స్నానమాచరిస్తున్న ఒకరికి ఒక సందేహం వచ్చింది వెంటనే గంగానదినే అడిగాడట, అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ, అందుకా తల్లి "నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను" అని బదులిచ్చిందట. వెంటనే, అయ్యో అన్ని పుణ్యనదులు ఇంతేకదా పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో అనుకొని,సముద్రాన్నే అడిగాడు ఎలా మోస్తున్నావు ఈ పాపభారాన్ని అని దానికా సముద్రుడు నేనెక్కడ భరిస్తున్నాను? ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోనికి పంపిస్తున్నాను' అని బదులిచ్చాడట.అరే ఎంతో తేలికగా కదిలాడే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది., ఓ మేఘమాలికల్లారా ఎలా భరిస్తున్నారుఈ పాప భారాన్ని అని అడగగా,అవి పకపకా నవ్వి 'మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటికప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'...అని బదులివ్వగా ఓహో ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నామన్నమాట, కర్మ ఫలితాలు వదిలించుకోలేమని గ్రహించాడట

శుభ మధ్యాహ్నం

సేకరణ

నేటి మంచిమాట *. ఇచ్చుటలో ఉన్న హాయి మరెచ్చటనో లేదోయి!

నేటి మంచిమాట . ఇచ్చుటలో ఉన్న హాయి మరెచ్చటనో లేదోయి!


రేడియోలో టెలిఫోన్ ద్వారా ఇంటర్వ్యూ జరుగుతోంది. అనౌన్సర్, కోటీశ్వరుడైన అతిధిని అడిగాడు- ‘’మిమ్మల్ని అత్యధికంగా సంతోష పెట్టినదేది?’’

ఆ కోటీశ్వరుడు ఇలా చెప్పాడు "నేనునా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను.

మొదటి దశలో సంపదను, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను. కానీ అది నేను అనుకొన్న సంతోషం కాదు..

ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన (విలాస)వస్తువులను సేకరించడం మొదలు పెట్టాను. అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే! అని తెలుసుకున్నాను.’ వ్యామోహాన్ని కలిగించిన ఆ విలువైన వస్తువుల ద్వారా లభించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.’

ఇక మూడో దశలో కూడా పెద్ద ప్రాజెక్టులు అంటే ఫుట్బాల్, క్రికెట్ టీమ్ లను కొనుగోలు చేయడం, విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి అన్నమాట. అయితే ఇక్కడ కూడా నేను ఊహించిన ఆనందాన్ని ఎంతోకాలం పొందలేక పోయాను.’

ఇక ఆ నాలుగో దశ ఏమిటంటే -నా స్నేహితుడొకరు, దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల బళ్ళు కొనివ్వమని అడిగాడు. స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను. అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుపట్టాడు. చివరికి ఒప్పుకుని అతడితో వెళ్లాను. నా చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో, కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్ లో కూర్చుని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించడం చూశాను.’

అయితే చివరికి వారి నుంచి వీడ్కోలు తీసుకుని, నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది.

ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకుని ఆపాడు.

నేను సున్నితంగా విడిపించుకో చూశాను. అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, తన చేతి పట్టును మరింత బిగించాడు.

నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్ల వాడిని అడిగాను- నీకు ఇంకా ఏమైనా కావాలా? అని.

అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు, నా జీవితాన్నే మార్చేసింది. ఆ పిల్లవాడు ఏమన్నాడూ అంటే...

నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్లీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టాలిగా, మళ్లీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని!*

మ్తె డియర్ మాస్టర్స్ ! ఇప్పుడు చెప్పండి ii నిజమైన ఆనందం పొందటంలో ఉందా? ఇవ్వటంలో ఉందో? మీ అభిప్రాయాన్ని రెండు మాటల్లో తెలియజేస్తారా!

ఉషోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

ఈ ప్రపంచంలో మానవ జీవిత పతనానికి ప్రధాన కారణం క్రోధమే.

ఈ ప్రపంచంలో మానవ జీవిత పతనానికి ప్రధాన కారణం క్రోధమే.

మానవాళి పతన హేతువులలో ప్రధానమైంది క్రోధమే. ‘క్రోధం వల్ల మూఢత్వం కలుగుతుంది. దాన్నే ‘సమ్మోహం’ అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. దీనివల్ల స్మృతి భ్రమిస్తుంది. స్మృతి భ్రమిస్తే బుద్ధి శక్తి నశిస్తుంది. అప్పుడు మనిషి పతితుడవుతాడు’. ఆఖరకు ఈ పతనమే మనిషి సర్వనాశనానికి హేతువవుతుంది. కనుక, వినాశనానికి ప్రధాన కారణం ‘క్రోధమే’ అని గ్రహించాలి.
ఒకసారి ఈ పతనం మొదలైతే అది ఆ వ్యక్తి సర్వనాశనం అయ్యేంత వరకూ ఆగదు. మనిషి నిలువునా పడిపోవడానికి ఒక్క క్రోధమనే దుర్గుణం చాలు. మానవాభ్యున్నతికి ఏ విధంగా ఆరోహణ క్రమం ఉంటుందో అదే విధంగా పతనానికీ అవరోహణ క్రమం ఉంటుంది. అదే ఒక్కొక్క మెట్టు మీదుగా మనిషిని దిగజారుస్తుంది. ‘దీనికంతటికీ మూలం క్రోధం’ అని తెలుసుకొనేలోగానే అంతా జరిగిపోతుంది. ఈ క్రోధానికి కూడా ఒక మూలం ఉంటుందని స్వామి దీని ముందటి శ్లోకంలో చెప్పాడు. ‘.. కామాత్‌ క్రోధో భిజాయతే’ (2.62). కోరికలే క్రోధానికి కారణం. అవి తీరనప్పుడు మనిషి కోపానికి గురవుతాడు. ఇది సామాన్యులకేకాదు ఒక్కోసారి ధీమంతులనుకూడా పతనం దిశగా అడుగులు వేయిస్తుంది. ఈ క్రోధం వల్ల మొదట మూఢత్వం వస్తుంది. దీనితో మనిషి ‘స్మరణ శక్తి’ని కోల్పోయి ప్రవర్తిస్తాడు. తత్ఫలితంగానే ‘స్మృతి విభ్రమం బారిన పడతాడు’ అని భగవానుడు హెచ్చరించాడు. బుద్ధి నశించి, చెయ్యరాని పనులన్నీ చేసే దిశగా అలాంటివారు అడుగులేస్తారు. ఒక్కోసారి విచక్షణా జ్ఞానం సైతం కోల్పోయి అమానవీయంగానూ ప్రవర్తిస్తారు. ఇదే అనేక ప్రమాదాలకు దారితీస్తుంది.
ఈ విధమైన క్రోధాన్ని నివారించడానికి చేసే ప్రయత్నం గురించి ప్రతి వ్యక్తీ చిత్తశుద్ధితో ఆలోచించాలన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అలా తనకు, తన వల్ల సమాజానికి ఏర్పడబోయే దుస్థితిని తప్పించవచ్చు. సకల అనర్థాలకు కారణమైన ఈ దుర్గుణం ఎల్లవేళలా పరిహరించవలసిందే. ‘కామం, క్రోధం, సమ్మోహం, స్మృతి విభ్రమం, బుద్ధి నాశనం, చివరకు సర్వనాశనం’- ఈ వరుసలో తానెక్కడున్నాడో తెలుసుకున్న మానవుడు సరైన మార్గంలోకి మళ్లి, భగవద్భావన దిశగా పయనిస్తాడు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కు ఉంది. ఎవరు, ఏ విధంగా జీవించినా తనను తాను నియంత్రించుకొంటే శుభాలు జరుగుతాయి. ఎదుటి వ్యక్తికి అడ్డు చెప్పే స్వేచ్ఛ ఎవరికీ ఉండదు. కానీ, తన స్వేచ్ఛ తన బతుకునేగాక సమాజంలోని ఇతరుల బతుకునుకూడా సర్వనాశనం చేసే దిశగా వున్నప్పుడే పెనుప్రమాదాలు పొంచి వుంటాయి. తన కోరికలు తీర్చుకోవడానికి సిద్ధమైన వ్యక్తి ఉచితానుచితాలు ఆలోచించక పోవడానికి అతనిలో ‘స్మృతి విభ్రమమే’ మూల కారణం. కనుక, జీవితంలో మనం ఆశించినవన్నీ విధిగా పొంది తీరాలన్న తీవ్ర కోరికల్ని పెంచుకోక పోవడమే మంచిది.
ఒక్కోసారి మన కోరికలు ఎండమావుల్లో నీటిని ఆశించినట్లుగా ఉంటాయి. అవి తీరే మార్గమే ఉండదు. అయినా, అవి ఉన్నట్టు కనిపించి మనల్ని భ్రమింపజేస్తుంటాయి. ఈ విషయంలో మనకు తెలియకుండానే మనలో విపరీత ధోరణులు చోటు చేసుకొని మానవీయ విలువలకూ తిలోదకాలు ఇచ్చేంత తీవ్రతర ప్రభావానికి లోను చేస్తాయి. కనుక, కోరదగిందే కోరుకొంటూ, ధర్మబద్ధంగా, కర్తవ్య నిష్ఠ, గుండె దిటవులతో జీవించగలిగితే వినాశకరమైన క్రోధాలోచనలకు ఎంతమాత్రం చోటు వుండదు.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

హ్రుదయం కదిలించే చిన్ని కథ.

హ్రుదయం కదిలించే చిన్ని కథ.

రవి సాఫ్త్వేర్ ఇంజినీర్. భార్య డెలివరీకి వెళ్ళింది. అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా గేటెడ్ కమ్యూనిటీలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు. స్వయంపాకం చేసుకుంటాడు.

ఆరోజు ఆదివారం. పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు. "ఆకు కూరలు..ఆకు కూరలు" అని కేక వినిపించింది. డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది. పిలిచాడు.

"కాస్త గంప దించయ్యా" అన్నది ఆమె. "పాలకూర కట్ట ఎంత?" అడిగాడు.

"పది రూపాయలకు మూడయ్యా" చెప్పింది అవ్వ.

"మరీ అన్యాయం... బయట అయిదు ఇస్తున్నారు" అన్నాడు చిరుకోపంగా

"నాలుగు తీసుకో నాయన.." కట్టలు తీసింది అవ్వ

పదిరూపాయలు ఇచ్చాడు. "గంప కాస్త పట్టయ్యా" అన్నది అవ్వ తనవైపు పట్టుకుని.

గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు రవి.

అవ్వ వెళ్ళిపోయింది.

"ఎంత ఆశో ఈ ముసలిదానికి.. ఇవాళో రేపో చావబోతుంది...ఇంకా మూటలు కడుతున్నది" ముసిముసిగా నవ్వుకున్నాడు.

అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో లాఘవంగా తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు.

కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు. అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది. ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ "నానమ్మా.. నన్ను స్కూల్ నుంచి పంపేశారు..." ఏడుస్తూ వచ్చింది.

అవ్వ కంగారుగా "అయ్యో నా బిడ్డ.. బాబూ...కాస్త గంప కిందికి దించు" అన్నది రవితో.

"ఏడవకమ్మా...నేనొచ్చి చెబుతాలే. రేపు ఫీజు కడతాలే..నా తల్లే...ఇంటికిపొదాం పద" అన్నది పిల్లను వాటేసుకుని ధారాపాతంగా నీరు స్రవిస్తున్న ఆ చిన్నారి నయనాలను తుడుస్తూ.

రవికి అర్ధం కాలేదు. "ఎవరీ పిల్ల?" అడిగాడు అవ్వను.

"నా మనవరాలు బాబూ...ఆడపిల్ల పుట్టిందని అల్లుడు నా కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. చుట్టుపక్కలవారు సూటిపోటి మాటలు అంటుంటే తట్టుకోలేక కూతురు ఎలుకలమందు మింగి చచ్చిపోయింది. మా ఆయన మూడేళ్ళబట్టీ మంచం మీదున్నాడు. ఈ నలుసును సాకడానికి చిల్లిగవ్వ లేదు. ఎప్పుడూ బయటకు వచ్చి ఎరగని నేను రోజూ తెల్లారుజామునే లేచి పొలాలకెళ్లి ఇరవై కిలోల కూరలు అరువు మీద తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా. మొన్న ఫీజు కట్టడానికి వెళ్తే వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు. నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు. ఈరోజు చూడు బాబు...పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు." అన్నది కళ్ళు తుడుచుకుంటూ.

రవి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి. రక్తం స్తంభించిపోయింది. గిరుక్కున తిరిగి హాల్లోకి వచ్చాడు. అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది. మనసంతా ఉష్ణ జలపాతం అయింది. ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి. "ముసల్దానికి ఎంత డబ్బాశ" అనే తన వెకిలి మాట వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది. ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు.

పర్సులో చెయ్యి పెట్టాడు. బయటకొచ్చి "అవ్వా..ఈ ఐదువేలు తీసుకుని మనవరాలి ఫీజ్ కట్టెయ్యి" అన్నాడు బలవంతంగా అవ్వ చేతిని తీసుకుని.

హంపి మొహంజదారో శిధిలాలకు ప్రతీకలాంటి అవ్వ వృద్ధశరీరం భూకంపం వచ్చినట్లు కంపించింది.

"బాబూ...ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది" అన్నది వణుకుతూ

"అప్పని ఎవరు చెప్పారు? చనిపోయిన మా అమ్మ ఆత్మశాంతి కోసం ఇస్తున్నాను. ఇప్పుడే కాదు..నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను..రేపటినుంచి రోజూ నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు" గంప పైకెత్తాడు రవి.

మరునాడు రవి నిద్రలేచి తలుపు తీశాడు. వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి!.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

భారతీయం 🇮🇳🚩🙏

🌎---భారతీయం 🇮🇳🚩🙏

కారుమేఘాలు కమ్ముతున్నాయి
ఏక్షణంలో అయినా...
వర్షం విపరీతంగా కురుస్తుంది...!
వేసే ముగ్గు..వర్షంలో కలుస్తుంది !
అయినా..ఆమె ముగ్గువేస్తోంది... !
అదీ..సంప్రదాయం! 🙏

అంతర్జాతీయ ఖ్యాతినార్జించి
అమెరికాలో ఉంటున్న వైద్యుడు.
సొంతూరు వచ్చినప్పుడల్లా
పాఠాలు చెప్పిన పంతులుకు
పాదాభివందనం చేస్తాడు…!
అదీ .. సంస్కారం ! 🙏

ఖగోళ శాస్త్రాన్ని
నమిలి మింగిన నిష్ణాతుడు.
నిష్టగా ఉంటూ
గ్రహణం విడిస్తేగానీ...
ఆహారం గ్రహించడు…!
అదీ .. నమ్మకం ! 🙏

పరమాణు శాస్త్రాన్ని
పిండి పిప్పిచేసిన పండితుడు.
పౌత్రుడి పుట్టు వెంట్రుకలు
పుణ్యక్షేత్రంలో తీయాలని
పరదేశంనుండి పయనమై వస్తాడు…!
అదీ .. ఆచారం ! 🙏

అంతరిక్ష విజ్ఞానాన్ని
అరచేతబట్టిన అతిరధుడు.
అకుంఠిత నిష్ఠతో
పితృదేవతలకు
పిండ ప్రదానం చేస్తాడు…!
అదీ .. సనాతన ధర్మం! 🙏

అత్తింటికి వెళ్లేముందు
ఇంటి ఆడబడుచు
పెద్దలందరికీ
పాదాభివందనం చేసి
పయనమవుతుంది…!
అదీ .. పద్ధతి ! 🙏

పెద్ద చదువులు చదివినా
పెద్ద కొలువు చేస్తున్నా
పేరు ప్రఖ్యాతులున్నా
పెళ్లి పీటలమీద .. వధువు
పొందికగా ఉంటుంది…!
అదీ .. సంస్కృతి! 🙏

భార్య పక్షవాతానికి లోనయ్యింది
మంచం దిగలేని పరిస్థితి
తనంతట తానుగా..
తనువీడ్చలేని స్థితి.
భర్త భరోసాగా నిలచి..భారమంతా మోస్తాడు-అన్నీతానై .. అలిని సాకుతాడు…!
అదీ .. దాంపత్యం! 🙏

బ్రతికే అవకాశం తక్కువ
వెంటిలేటర్ పై వేచిచూస్తే
బ్రతికితే బ్రతకొచ్చు!
లక్షల ఖర్చు భరిస్తూ
వెంటిలేటర్ పై పెడతారు… !

అదీ .. అనుబంధం ! 🙏

శుభోదయం తో మానస సరోవరం 👏

సేకరణ

*తన కోపమె తన శత్రువు* నేటి బాల బాలికలలారా! ...

తన కోపమె తన శత్రువు

నేటి బాల బాలికలలారా! ... మార్పు మీ దగ్గరే ప్రారంభం కావాలి. ప్రయత్న పూర్వకంగా కొన్ని మంచి లక్షణాలు పసి వయసులోనే అలవాటు చేసుకోవాలి. దీనికి ఉపకరించేవి పెద్దలు, గురువులు చెప్పే మాటలు.. అలాంటిదే శతక నీతి కూడా... ఇప్పడు మనం తెలుసుకుంటున్న ‘తన కోపమె తన శత్రువు...’ సూక్తి సుమతీ శతకం లోనిది. మన కోపం ఎక్కువగా మనల్నే నష్టపరుస్తుంది, మనం ప్రశాంతంగా ఉంటే మనం నేర్చుకునే విషయాలపట్ల మనకు ఏకాగ్రత కుదురుతుంది. ఎదుటివారు కష్టంలో ఉంటే ఆదుకునే మనస్తత్వాన్ని పెంపొందించుకోవాలి... అంటూ మన సంతోషమే మనకు స్వర్గం, మన దుఃఖమే మనకు నరకం అంటారు బద్దెన గారు.

పోతన గారు ఓ మాటంటారు... ‘‘వ్యాప్తిం బొందక వగవక /ప్రాప్తంబగు లేశమైన బదివే లనుచుం/దృప్తిం జెందని మనుజుడు/ సప్తద్వీపముల నయిన? జక్కంబడునే?’’ అంటే...లభించినది కొంచెం అయినా అదే పదివేలుగా భావించి తృప్తి పొందాలి. అలా తృప్తి పడనివారికి సప్తద్వీపాల సంపదలు వచ్చిపడినా కూడా తృప్తి తీరదు....అంటారు. ‘నన్ను ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులున్నారు, నాకు మంచి స్నేహితు లున్నారు.

నేను మంచి పాఠశాలలో చదువుతున్నా. నాకు మంచి గురువులున్నారు..అలా మనకు ఉన్నవేవో వాటిలోని మంచిని తలుచుకుంటూ మన ప్రయత్నం, మన అభ్యాసం మటుకు నిజాయితీగా చేయాలి. ఇది చేయకుండా అంటే ఉన్నవాటిలోని మంచిని చూడకుండా... లేనివి ఏవో పనిగట్టుకుని ప్రతిక్షణం గుర్తు చేసుకుంటూ ఏడుస్తూ కూర్చుంటే ఏమొస్తుంది? ఉన్న పుణ్యకాలం గడిచిపోతుంది.

అలా నిత్యం దిగాలుగా ఉండి చేతిలో ఉన్న సమయాన్ని కూడా వృథా చేసుకునేవాడిని ఆ దేముడు కూడా కాపాడలేడు. నిన్ను సంతోషంగా కానీ దుఃఖంతో కానీ ఉంచేది నీ మనసే. దానిని అదుపు చేసుకో, దానికి నచ్చ చెప్పు. దాని మాట నీవు వినడం కాదు, నీ మాట అది వినేటట్లు చేసుకో. అది నీ చేతిలో ఉంది. అది ఇతరుల వల్ల సాధ్యం కాదు. అలా ఆలోచించి నిత్యం తృప్తిగా, సంతోషంగా ఉంటూ పనులు చక్కబెట్టు కుంటుంటే అదే నీకు స్వర్గం. మీకొక రహస్యం చెబుతా. మనం అందరం చెప్పుకునే స్వర్గలోకం శాశ్వతం కాదు.. మనం చేసిన మంచి పనుల వల్ల మనం స్వర్గం చేరుకునేది నిజమే అయినా... అది మన ఖాతాలో పుణ్యం ఉన్నంతవరకే.

అది అయిపోగానే ... మనం పడిపోతాం. కానీ ఇక్కడ ఈ మనుష్య జన్మ నీకు దక్కింది... 84 లక్షల జీవరాశుల్లో దేనికీ దక్కని అదృష్టం వల్ల నీకు దక్కిన ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే ... నీవు దొరికిన దానితో తృప్తిపడి... నిత్యం సంతోషంగా ఉంటే... నీ జీవితాంతం అలా ఉండగలిగితే... ఇక్కడే నీకు స్వర్గ సుఖాలు లభించినట్లు. అలాకాక నా స్నేహితుడు మంచి మార్కులతో ఉత్తీర్ణుడవుతున్నాడు, నేను కాలేకపోతున్నా... అని తలుచుకుంటూ నువ్వు ఏడుస్తూ కూర్చుంటే... నీ నరకాన్ని దేముడు కాకుండా నీవే సృష్టించు కున్నట్లయింది. జన్మజన్మలకూ నీవు కూడా సంతోషంగా ఉండాలంటే, నీకు కూడా నీ స్నేహితుడి లాగా సరస్వతీ కటాక్షం పొందాలంటే.. కష్టపడు, బాగా చదువు.

ఈ జన్మలో నీకు వచ్చిన విద్య పదిమందికి పంచు, కష్టంలో ఉన్నవాడికి నీకు చేతనయినంత సహాయం చెయ్యి. నిత్యోత్సాహంతో ఉండు. ఫెయిల్‌ అయ్యావు... అంత మాత్రానికే లోకం తల్లకిందులయిపోయినంతగా దిగాలు పడొద్దు... అబ్దుల్‌ కలాం గారు.. ఎఫ్‌.ఎ..ఐ.ఎల్‌..ఫెయిల్‌ అంటే ఫస్ట్‌ అటెంప్ట్‌ ఇన్‌ లెర్నింగ్‌... అన్నారు. అంటే నీవు నేర్చుకోవడానికి నీవు చేసిన మొదటి ప్రయత్నం అది అన్నారు.. ఇప్పుడు నీవేం చేయాలి.. రెండో ప్రయత్నం. పట్టుదలతో, ఏకాగ్రతతో సాధించు... అంతే తప్ప నీ అరచేతిలో నీవు సృష్టించుకోగలిగిన స్వర్గాన్ని నీవే కిందకు నెట్టేసి నరకాన్ని చేతులారా తెచ్చిపెట్టుకోవద్దు.

-బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి భాషణ.

సేకరణ

Sunday, September 26, 2021

నేటి మంచిమాట.

🙏నేటి మంచిమాట.

రావణుడి బలం గొప్పదా రాముడి బలం గొప్పదా?కౌరవుల బలం గొప్పదా పాండవుల బలం గొప్పదా ? తెల్లవాడి బలం గొప్పదా గాంధీ గారి బలం గొప్పదా? పాము బలం గొప్పదా చలిచీమల బలం గొప్పదా? మరి ఎవరు విజయులు అయ్యారు.

ఆలోచిస్తే రావణుడి బలం కన్నా రాముడి సంకల్పం గొప్పది అని అర్దం అవుతుంది. కౌరవుల బలం కన్నా పాండవుల ప్రాతివ్రత్యం గొప్పది అని అర్దం అవుతుంది.పాము బలం కంటే చీమల ఐక్యత బలం గొప్పది అని అర్థం అవుతుంది. ఇంగ్లీషు వాడి బలం కన్నా సత్యం శాంతం ధర్మం న్యాయం గొప్పదని మన తాత గారు ( గాంధీ గారు ) చూపించిన మార్గం గొప్పదని అర్దం అవుతుంది.

దీన్నిబట్టి మనం ఎలా వుండాలో నిర్ణయించుకోవాలి.

ఆహా! భారతదేశంలో పుట్టిన మనం ఎంత గొప్ప వారమో కదా! ఎందుకంటే రావణుడిలాగా రక్తమాంసాలు మనకిస్టముండదు. కౌరవులకు లాగా క్రౌర్యం,కుతంత్రం మనకు లేవు .ఇంగ్లీషు వాడిలాగ కాకుండా ఇంగిత జ్ఞానం మనకుంది .పాము లాగా విషం చిమ్ముతూ ఉండము.

చలి చీమల లాగా బ్రతికినా ఐక్యంగా సమైక్యంగా,తియ్యగా మథురమ్తెన తీపిలా హాయిగా ఆనందంగా శాకాహారం మితాహారం శుద్ధ సాత్వికాహారం తీసుకుని,శ్వాస మీద థ్యాస థ్యానం చేస్తూ శాంతంగా,ప్రశాంతంగా జీవిద్ధాం.

శుభోదయం 🙊🙊🙏

సేకరణ

Wednesday, September 22, 2021

40 Years Ago & today

40 Years Ago ::

40 years ago, children were gentle with their parents. Today parents have to be gentle with their children.
🤝🤝🤝🤝🤝🤝
40 years ago, everyone wanted to have children. Today many people are afraid of having children.
🙌🙌🙌🙌🙌🙌
40 years ago, children respected their parents.
Now parents have to respect their children.
👌👌👌👌👌👌
40 years ago, marriage was easy but divorce was difficult.
Nowadays it is difficult to get married but divorce is so easy.
💑💑💑💑💑💑
40 years ago, we got to know all the neighbours.
Now we are strangers to our neighbors.
💐💐💐💐💐💐
40 years ago, people had to eat a lot because they needed the energy to work hard.
Now we are afraid to eat fatty foods for fear of the cholesterol.
🌹🌹🌹🌹🌹🌹
40 years ago, villagers were flocking to the city to find jobs.
Now the town people are fleeing from the stress to find peace.
⚔⚔⚔⚔⚔⚔
40 years ago, everyone wanted to be fat to look happy ...
Nowadays everyone diets to look healthy.
🏋‍♂🏋‍♂🏋‍♂🏋‍♂🏋‍♂🏋‍♂
40 years ago, rich people pretended to be poor.
Now the poor are pretending to be rich.
🚗🚗🚗🚗🚗🚗
40 years ago, only one person worked to support the whole family.
Now all have to work to support one child.
🚴‍♂🚴‍♂🚴‍♂🚴‍♂🚴‍♂🚴‍♂
40 years ago, people loved to study and read books ...
now people love to update Facebook and read their whatsapp messages.
🧩🧩🧩🧩🧩🧩
I received this realistic message from my batch and on realizing that it's hard fact for today's life,
Forwarded to all friends🙏🌹🙏

సేకరణ

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.

మన పండుగల గొప్పతనం తెలుసు కోండి.

ఉగాది:- కష్టము, సుఖము, సంతోషము, బాధ ఇలా అన్నింటిని స్వీకరించాలని.

శ్రీరామ నవమి:- భార్య - భర్తల అనుబందాన్ని గొప్పగా చెప్పుకోవడానికి.

అక్షయ తృతీయ:- విలువైన వాటిని కూడబెట్టుకోమని.

వ్యాస (గురు) పౌర్ణమి :- జ్ఞానాన్ని అందించిన గురువును మరువొద్దు అని.

నాగుల చవితి;- ప్రాణాల్ని తీసేదయిన సరే తోటి జీవులను ప్రేమగా అధరించమని.

వరలక్ష్మి వ్రతం :- నీకున్న ఐశ్వర్యమును అందరికీ పంచుతూ, అందరితో కలిసి సంతోషంగా ఉండమని.

రాఖీ పౌర్ణమి:- తోడబుట్టిన బంధం ఎప్పటికి విడరాదు అని.

వినాయక చవితి ( నవరాత్రులు ) :- ఊరంతా ఒక్కటిగా కలవడానికి.

పితృ అమావాస్య:- చనిపోయిన వారిని ఎప్పటికి మరువకు అని చెపుతూ.

దసరా ( ఆయుధ పూజ) :- ఎప్పుడు నీకు అండగా నిలిచి నీ పనులు చేసే దానిని గౌరవించమని తెలిపేది.

దీపావళి :- పది మందికి వెలుగు చూపే జీవనం నీదవాలని.

కార్తీక పౌర్ణమి :- చలికాలం చన్నీటి స్నానం చేసి ఇంద్రియములను గెలువమని.

సంక్రాంతి :- మనం జీవించే ఉన్నాము అంటే కారణం వ్యవసాయం, అలాంటి దానిని మరువకుండా సంబరాలు జరుపమని.

మహాశివరాత్రి :- కాలం మారుతోంది నీ శరీరాన్ని నీ అదుపులో ఉంచుకో అని.

హోలీ :- వివిధ రంగుల వలెనున్న వివిధ మనుషులు, వివిధ అను భూతులను పిల్లలు, పెద్ధలు అందరూ కలిసి సంతోషంగా ఆస్వాదించమని.

సేకరణ

Monday, September 20, 2021

భావనకు బలముంది - సామవేదం షణ్ముఖశర్మ |

భావనకు బలముంది
సామవేదం షణ్ముఖశర్మ |
సంఘటన బహిరంగం. భావన అంతరంగం.
ఈ రెండూ ఒకదానిపై ఒకటి ప్రభావం చూపించడం సహజం, సంఘటనను అంచనా వేయడమో, అనుభవించడమో చేయగలం- కానీ పూర్తిగా మార్చగలగడం మనవల్ల అవుతుందా! అన్ని సందర్భాల్లోనూ కుదరదేమోగానీ; తగిన ప్రణాళికలతో, ప్రయత్నాలతో కొన్నిటినైనా మలచగలం, మార్చగలం అనడంలో సందేహించనక్కర్లేదు. జరగబోయేవి మన చేతుల్లో లేవు- అనడం నిజం కావచ్చు. కానీ 'సద్భావన'తో వాటిని ప్రయోజనకరంగా పరిణమింపజేయగలం- అని శాస్త్రాలు రుజువు చేస్తున్నాయి.
భావనలో సలక్షణం ఉంటే- 1. సంఘటన తీవ్ర ప్రభావం చూపించకపోవచ్చు, 2. లేదా, అది తప్పిపోవచ్చు, 3. దాన్ని తట్టుకొని, సానుకూలంగా మలచుకొనే సమర్థత పొందవచ్చు. అందువల్లనే భావనను బలపరచే సాధనలు మనకు సూచించారు మహర్షులు. ధ్యానం, తపస్సు, క్రమబద్ధమైన జీవితం... భావనకు బలాన్నిస్తాయి. సంకల్ప సిద్ధులు కావడమంటే ఇదే. 'భావనాయోగం' అనే దివ్యప్రక్రియను కొన్ని ఆధ్యాత్మిక శాస్త్రాల్లో వివరించారు. ఒక యోగంగా అభ్యసిస్తే భావనను కళ్లముందు సత్యంగా సాక్షాత్కరింపజేయవచ్చు- అని శాస్త్రనిరూపణ. ఆధ్యాత్మికసిద్ధికి భావనే ఆధారసూత్రం. 'చిత్తంకొద్దీ శివుడు-విత్తం కొద్దీ వైభవం' అనీ సామెత. భౌతికరంగంలోనూ ఈ భావనాబలం పనిచేస్తుంది. జీవితంలో అనుబంధాలు, అనుభవాలు భావంతో అల్లుకున్నవే. ఏకాగ్రచిత్తంతో, యోగశాస్త్రపద్ధతుల్లో తపశ్శక్తితో భావనను దృఢపరిస్తే దేనినైనా సాధ్యం చేయవచ్చు... అని ధైర్యాన్నిస్తున్నాయి. దానికి ఎన్నో తార్కాణాలు నేటి యుగంలోనూ చూడవచ్చు. ఎల్లవేళలా సానుకూల సకారాత్మక భావన కలిగి ఉండి, దాన్నే వ్యక్తీకరించేవాడు తప్పకుండా విజయాలు సాధించగలడు. స్వప్నాలను సత్యం చేసుకోగలడు, ఏ పనినైనా ప్రారంభించేటప్పుడు 'ఇది నేను చేయగలను- చేసి తీరతాను' అనే దృక్పథం ఉన్నప్పుడు ఆ పని దాదాపు సిద్ధించినట్లే. ఈ సద్భావన ఇచ్చే బలం ఏ అవరోధాన్నైనా ఎదుర్కొనేలా చేస్తుంది. ఈ విధానమే 'శుభాకాంక్షలు'లో ద్యోతకమవుతుంది.
దీవెనలు, ఆశీర్వచనాలు, ప్రార్థనలు... ఇవన్నీ శుభాకాంక్షలే. పెద్దలు మనసారా పలికే దీవెనలు, శుభాన్ని 'ఆశించి' చెప్పే ఇతరుల ఆశీస్సులు, భగవచ్ఛక్తిని ఆరాధిస్తూ మనకోసం, ప్రపంచం కోసం ప్రసరించే మంచి భావాల ప్రార్థనలు... ఇవన్నీ ప్రాచీనకాలంనుంచి మనదేశంలో సంప్రదాయాలు. పర్వదినాల్లో, కార్యారంభాల్లో, శుభకర్మల్లో ఈ ఆనవాయితీ నేటికీ ఉన్నది. ముఖ్యంగా కాలం మలుపుల్లో శుభకామనను వ్యక్తపరచడం మానవ స్వభావం. అందుకే దేశాలేవైనా, మత, సంస్కృతులేవైనా అందరూ వారి కాలమానాల ప్రకారం- ఏడాదంతా ఆనందమయం కావాలని కోరుకుంటారు. 'ఈ సంవత్సరంలో జరిగే మార్పులన్నీ శుభకరంగా ఉండాలి...' అంటూ ప్రపంచంలోని ప్రథమ వాఞ్మయమైన వేదంలోనే కనబడుతోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలను వేదం తొలిసారి పలికింది. జరగబోయే చెడు ముందే తెలిసినా, సద్భావంతో కాలాన్నే మార్పుచేసిన వైనాలు మన పురాణాల్లో కోకొల్లలు. తన భర్త సత్యవంతుడు కొద్దికాలంలో మరణిస్తాడని తెలిసీ నిబ్బరంగా నిలబడింది సావిత్రి. నిజానికి వివాహానికి పూర్వమే ఆమెకు తెలుసు. కానీ ధైర్యంగా, తన ప్రేమకు ప్రాధాన్యమిచ్చి పెళ్లాడింది. తనకు తెలిసిన నిజం భర్తకు చెప్పలేదు. తాను తపస్సాధనను కొనసాగిస్తూ, తన భర్తకు ఆయువు పెరగాలనే సద్భావాన్ని కేంద్రీకృతం చేసింది. సద్భావాన్ని విశ్వాసంతో, ఏకాగ్రంతో బలపరచడమే కదా తపస్సు! దాని ఫలితంగా కాలం (కాలుడు = యముడు) ఆమెను అనుగ్రహించింది, అనుకూలపడింది. జరగబోయే దుస్సంఘటనను తప్పించగలిగింది. మానవుడు తన సద్భావనాబలంతో దేన్నైనా సాధించగలడనడానికి ఇదో తార్కాణం! 'నేను లంకకు వెళ్లి సీత జాడ తెలుసుకొని తీరతాను' అనే సద్భావనను సమర్థంగా సత్యంచేశాడు హనుమ. సీతమ్మకు ఆ శుభభావనను ప్రసరించి ధైర్యాన్నిచ్చాడు. అరణ్యవాస సమయంలో ధర్మరాజు వద్దకు వచ్చిన అనేకమంది రుషుల దీవెనల్లోంచి ఈ సద్భావన శుభాకాంక్షలుగా వెలువడి శుభాన్నే కలిగించింది.
శుభాన్ని ఆకాంక్షించడం ఎన్నడూ వ్యర్థం కాదనేది- సారాంశం. వ్యర్థంకాని విధంగా ఆకాంక్ష తెలపాలంటే ఆ తెలిపే చిత్తంలో నిజాయతీ, శుద్ధి ఉండాలి. అప్పుడది అమోఘమవుతుంది, ఫలవంతమవుతుంది. సద్భావన స్వభావమైతే ప్రభావం తప్పక ఉంటుంది.

సేకరణ. మానస సరోవరం 👏

సేకరణ

ఆశించే పౌరులున్న ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు.. అది సరైన పాలనా కాదు.. పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం..

పూర్వం ఇద్దరు రాజులు రధాలపై పొరుగు రాజ్యం వెళ్తూ ఇరుకైన ఒక వంతెన మీద ఎదురయ్యారు..
ఒక రాజు రధం వెనక్కి వెళ్తేనే గానీ రెండో రధం ముందుకు వెళ్ళే వీలు లేదు..
రధసారధులిద్దరూ నీ రధం వెనక్కి తీసుకెళ్ళంటే నీదే తీసుకెళ్ళమని వాదించుకోడం‌మొదలెట్టారు. ఇద్దరు రాజులూ ఏం జరుగుతుందా అని చూస్తున్నారు..
చివరికీ ఇద్దరు సారధులూ ఒక ఒప్పందానికి వచ్చారు..
వాళ్ళు తమ రాజుల గొప్పదనం చెప్పేట్టు.. ఏ రాజు గొప్పవాడో ఆరాజుకు రెండో రాజు ముందు దారి ఇచ్చేట్టు..
సరే మొదటి రధసారధి ఇలా అన్నాడు..
మా రాజ్యంలో మా రాజుగారు రోజుకి వందమంది అభాగ్యులకి ఆకలి బాధతో ఉన్నవారికి భోజనం ఏర్పాటుచేసి గానీ వారు భుజించరు.. గుడ్డలు కూడా లేని వారికి రోజుకి ఐదారువందలమందికి వస్త్రదానం చేస్తారు.. అనాధ శరణాలయాలు..వృద్ధాశ్రమాలూ స్థాపించారు..

రెండవ సారధి తలదించుకుని కంట నీరుపెట్టుకుని తన రధం వెనక్కి తీయడానికి సిద్ధమయ్యాడు..
దానికి ఆరాజు గారిలా అడిగారు.. ఏమయ్యా మీ రాజుకి దాన గుణం‌లేదా అలా ఏమీ చెప్పకుండా రధం వెనక్కి తిప్పుకుంటున్నావు..
దానికా రెండో రధ సారధి వినయంగా ఇలా అన్నాడు..
హే రాజా మా రాజుగారు దానం చేస్తుండగా చూసే అదృష్టం మా రాజ్యం లో ఎవరికీ కలగలేదు.. మా రాజ్యం లో దానం చేద్దామ‌ంటే సామాన్యులమైన మాకే ఒక్క దీనుడూ కనబడలేదు..‌ వృద్ధాశ్రమాల్లో ఉండాల్సిన అవసరమూ ఏనాడూ ఎవరికీ కలగలేదు..‌ఇంక మారాజుగారికా అవకాశం ఎలఎలా ఉంటుంది.. దానం చేసే అవసరం అవకాశం మా రాజ్యంలో లేదు ప్రభూ అని.
వెంటనే మొదటి రధంలో రాజు రధం దిగి రెండవ రాజుకు పాదాభివందనం చేసి తనరధం వెనక్కి తీయించి దారి ఇచ్చాడు..

వేల వృద్ధాశ్రమాలూ..రాయితీలు.సంక్షేమపధకాలూ ఉచితాలూ.. అభాగ్యులకు సేవలూ దశాబ్దాలుగా అమలు చేసే పరిస్థితులున్న.. ఆశించే పౌరులున్న ఏ దేశమూ మంచి పాలనలో ఉన్నట్టు కాదు..
అది సరైన పాలనా కాదు..
పాలకుల పాలితుల దౌర్భాగ్యానికి చిహ్నం ఆ దేశం..

సేకరణ

Sunday, September 19, 2021

’కష్టాలు! కష్టాలు!’ అని మనం తెగ బాధపడతాం.* *కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

మన కష్టాలు కష్టాలేనా?
➖➖➖✍️

’కష్టాలు! కష్టాలు!’ అని మనం తెగ బాధపడతాం.
కాని నిజానికి మనవి కష్టాలు అంటారా?

ఇంద్రుడు అంతటి వాడు శాపం తట్టుకోలేక వెళ్లి తామర తూడులో దాక్కున్నాడు.

నహుషుడు శాపం వలన తొండగా మారి పోయాడు.

సత్య హరిశ్చంద్రుదు అమ్ముడుపోయి కాటికాపరిగా ఉండలేదా?

హరిభక్తుడైన పరమ భాగవతోత్తముడు ప్రహ్లాదుడు తనసంపదలు కోల్పోయి గాడిదగా మారి ఊక తిన్నాడు.

పాండవులు అడవుల పాలయ్యారు. వేరేవాడి దగ్గర ఆవులు కాచారు, గుర్రాలను మేపారు. వంటలు వండారు. సేవ చేశారు.

నలుడు భార్యని కూడా కోల్పోయి తన శౌర్యం కోల్పోయి అడవుల్లో తిరిగాడు.

దేవతలు తమ ప్రతిభ కోల్పోయి తలా ఓ దిక్కు పారిపోయి వందల సంవత్సరాలు దాక్కున్నారు.

రాముడంతటి వాడే భార్యతో అడవుల్లో కాలం గడపవలసి వచ్చింది.

శ్రీకృష్ణుడు చిన్ననాటి నుండే తన మీద జరిగే దాడులు ఎదుర్కుంటూనే ఉన్నాడు. అనేకమంది రాక్షసులు, సైంధవుడు, జరాసంధుడు, ఎందఱో కృష్ణుడి మీదికి, అతడి రాజ్యం మీదికి మాటి మాటికి దాడులు చేశారు. చివరికి తన కొడుకుని తన కళ్ళ ముందే చంపితే చూస్తూ ఉండిపోయాడు.
ఆయన భార్యలనిదొంగలు ఎత్తుకెళ్ళి పోయారు. రుక్మిణికి అర్జునుడు చితి పేర్చితే యోగ విద్య ద్వారా ఆ మంటల్లోకి ఆహుతి అయింది.
సత్యభామ ఒంటరిగా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి శరీరం వదిలింది.

పెళ్లైంది మొదలు ఎన్నో కష్టాలు పడిన కుంతీదేవి దృతరాష్ట్రుడి తో సహా అగ్నీకీలల్లో ఆహుతై పోయింది.

ఇంద్రుడి కొడుకు శాపం వలన కాకిగా మారిపోయాడు.

అంతటి దేవతలు, మహాత్ములే ఎన్నో కష్టాలు పడ్డారు. వీటి ముందు మనకి వచ్చే చిన్ని చిన్ని కష్టాలు కూడా ఓ లెక్కంటారా? కానేకాదు!

ప్రతీది కాలం నిర్ణయిస్తుంది.. నీకు ఎప్పుడు ఏది దక్కాలో అది సమయం వచ్చినప్పుడు తప్పకుండా వస్తుంది. అది కష్టం అయినా సుఖం అయినా...ఓపికతో ఉండాలి..ధైర్యంగా ఎదుర్కోవాలి... లక్ష్యాన్ని సాధించాలి.✍️

. 🌷🙏🌷

🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

సేకరణ

మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ!

🌹మంచినీ, సంకల్పాన్నీ తట్టిలేపే కథ!"🙏🙏🙏

ఒకానొక చిన్న పల్లెటూరు. అందులో చాలా పేరుగాంచిన జ్యోతిష పండితుడు నివసించేవాడు.
ఆయన చెప్పిన మాట పొల్లుపోదనీ చెప్పిన జ్యోస్యం తప్పుకాదనీ ఆ ఊరి ప్రజల విశ్వాసం.

ఆ నోటా ఈ నోటా విన్న ఓ పేదరైతు పక్కనున్న గ్రామం నుంచి జ్యోతిషుని దగ్గరకు వచ్చి తనకు జోస్యం చెప్పమని తన జాతకాన్ని అతనికి ఇస్తాడు.

తనపై నమ్మకముంచి వచ్చినందుకు ఆ పేదరైతును కూర్చోమని సైగచేసి అతని జాతకాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలించి చూస్తాడు. ఎటువంటి జాతకాలను చూసినా చలించని ఆ జ్యోతిషుడు పేదరైతు జాతకం చూస్తూనే కంగారు పడతాడు.

ఎందుకంటే ఆ జాతకం ప్రకారం పేదరైతుకు ఆనాటి రాత్రి ప్రాణ గండం కనిపించడం వల్లనే!

ఎంతటి నిజాన్నైనా చెప్పగలను కానీ రైతుతో సూటిగా ‘నీకు ప్రాణగండం ఉందని’ ఎలా చెప్పనని చింతించి ఎలాగోలా తనను తాను తమాయించుకొని రైతుకు ఏమాత్రం సందేహం రాకుండా ‘ఇవాళ నాకు చాలా పనిఉంది. మీ జాతకం నా దగ్గరే ఉంచి వెళ్ళండి. రేపు మీరు మళ్ళీ రాగలిగితే నేను నిశితంగా పరిశీలించి చెబుతాను’అని అని అంటాడు.

జ్యోతిషునిపై మర్యాదతో ఆ పేదరైతు సరేనని కృతజ్ఞతలు చెప్పి వెళ్ళి పోతాడు. రైతు వెళ్ళగానే జ్యోతిషుడు తన భార్యతో ఈ విషయం చెబుతాడు.

కానీ మనసులో ‘పాపం పేదరైతు నేడు మరణిస్తాడే. నేను రేపు రమ్మన్నాననే తలంపుతో వెళ్ళిపోయాడే’నని చింతిస్తాడు జ్యోతిషుడు.

పేదరైతు జ్యోతిషుని ఇంటినుండి బయలుదేరి తన గ్రామానికి నడిచి వెళుతున్నాడు. దారిలోనే చీకటి పడటంతో తలదాచుకోవడానికి స్థలాన్ని వెదకడం మొదలుపెట్టాడు.

ఇంతలో కుండపోతగా వర్షం కురవసాగింది. కాస్త దూరంలో శిథిలావస్థలో శివుని ఆలయం కనిపించిందతనికి. అక్కడికి చేరుకొని ఆలయం ముందున్న మండపంలో నిలబడి ఆలయ స్థితిని చూసి ఎంతో బాధపడ్డాడు.

ప్రజలకు మనఃశ్శాంతినీ, భక్తి భావాలనూ పెంపొందించే ఆలయం నేడు ఈ దుస్థితికి చేరిందే. నా దగ్గర డబ్బుండుంటే నేను ఈ శివాలయాన్ని పునరుద్ధరించే ప్రయత్నాన్ని చేసేవాణ్ణని మనసులో అనుకుంటాడు.

మానసికంగానే ఎలా గోపురాన్ని నిర్మించాలి. రాజగోపురం ఎంత ఎత్తుగా ఉండాలి.

మండపాలు ఎలాకడితే బాగుంటుంది.
అలా పూర్తిగా కట్టబడిన శివాలయంలో అభిషేకాలూ, పూజలూ నిర్విఘ్నంగా జరుగుతుంటే ఎంత బాగుంటుందనీ శివుని ఆన ఉంటే తప్పక అది జరుగుతుందనీ అనుకుంటుండగానే మండపం పైభాగంలోంచి నల్లని త్రాచుపాము అతనిని కాటు వేయడానికి అతనిపై దూకపోతుంటే తప్పించుకొని ఆ ఆలయం నుండి బయటకు వచ్చేస్తాడు.

మండపంతో సహా ఆ పాడుబడిన గుడి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది. అమ్మయ్య! బతికి పోయాననుకొని ఇంటికి చేరుకుంటాడా పేదరైతు.

మరునాడు తన జాతకాన్ని గురించి తెలుసుకోవాలనుకొని జ్యోతిషుని దగ్గరకు వెళతాడు పేదరైతు. అతణ్ని చూసి ఆశ్చర్యపోయిన జ్యోతిషుడు
నా గణనలో తప్పు జరిగి ఉంటుందని
చాలా శాస్ర్తాలను తిరగేసి మళ్ళీ మళ్ళీ
అతని జాతకాన్ని పరిశీలిస్తాడు.

కానీ గణింపులో ఎక్కడా తేడాలేదు. అంతా సరిగ్గానే ఉంది. ఇక తప్పదన్నట్లు విషయం పేదరైతుకు వివరించి జ్యోతిషుడు నిన్న ఏం జరిగిందో ఏదీ మర్చిపోక తెలియజేయమని రైతుకు చెబుతాడు.

జరిగిందంతా వివరిస్తాడు పేదరైతు.

మంచి చేయాలనే కేవలం తలంపు మాత్రంగా అనుకున్నందుకే ఇంత గొప్ప ఫలితం చేకూరితే మనకు చేతనైనంత మంచి చేస్తే ఎటువంటి జీవితం లభిస్తుందో రైతుకు జరిగిన సంఘటనే నిదర్శనం!

మనం బాగుండాలంటే మన ఆలోచనలు బాగుండాలి.

మన ఆలోచనలు సత్సంకల్పాలయితే మన చుట్టూ ఉన్న ప్రపంచం బాగుంటుంది.

ప్రపంచం బాగుంటే అందులోని మనం కూడా బాగుంటాం!🙏🙏🙏

సేకరణ

చెప్పుడు మాటలు విని ....

👉 వియ్యంకుడి చెప్పుడు మాటలు విని మహామంత్రి తిమ్మరసు కళ్ళు పీకించాడు శ్రీ కృష్ణ దేవరాయలు.
👉 తన సొంత ఖర్చులు కోసం టోపీ లు కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం కన్న తల్లి తండ్రులని బంధించాడు.
👉 తల్లి గర్భం లో చనిపోబోయే బిందుసారుడిని తన ఉపాయం తో బతికిస్తే చివరికి చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణక్యుడి మరణానికి కారణం అయ్యాడు.
👉 చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యం పై పగ పెంచు కున్నాడు శకుని . అదే శకుని చెప్పుడు మాటలు విని ధ్రుతరాష్టుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు కౌరవులు.
👉 చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మాహా జ్ఞానే సీతమ్మ తల్లి ని అపహరించి రాముడి తో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు. కడకు మరణించాడు.
👉 చెప్పుడు మాటలు విని " స్నేహాన్ని " కోల్పోయిన వారు కొందరు.
👉 చెప్పుడు మాటలు విని సంసారాలని నాశనం చేసుకున్నవారు మరికొందరు.
👉 చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు.
👉 శకుని చెప్పుడు మాటలు వినటం వలన హస్తినాపుర మహా సామ్రాజ్యమే సర్వనాశనం అయింది. మనమెంత..?
మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తం గా లేకపోతే ఎంతటివారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర మరియు పురాణాలు చెప్తున్న నగ్న సత్యం.
👉 ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే ... నీ గురించి మరొకరికి చెప్పడా ?
అది ఆలోచించడం మన విజ్ఞత.

సేకరణ

సుప్రీం కోర్టు అనుమతితో, గౌరవనీయులైన నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడింది - నేను గాంధీని ఎందుకు చంపాను. 60 సంవత్సరాలు అది నిషేధించబడింది!

సుప్రీం కోర్టు అనుమతితో, గౌరవనీయులైన నాథూరామ్ గాడ్సే ప్రసంగం ప్రచురించబడింది - నేను గాంధీని ఎందుకు చంపాను. 60 సంవత్సరాలు అది నిషేధించబడింది! మీ అందరికీ తెలిసినట్లుగా - జనవరి 30, 1948 న గాడ్సే గాంధీజీని కాల్చి చంపాడు. అతను కాల్పుల స్థలం నుండి తప్పించుకోలేదు! అతను లొంగిపోయాడు! గాడ్సేతో సహా మరో 17 మందిపై ఈ వ్యాజ్యం దాఖలైంది. విచారణ సమయంలో, నాథూరాం గాంధీజీని ఎందుకు చంపాడు అని మాట్లాడటానికి ప్రధాన న్యాయమూర్తికి ఒక అభ్యర్థన జరిగింది. అనుమతి లభించింది కానీ షరతులకు లోబడి! ప్రభుత్వ ఆదేశాల మేరకు మీ ప్రసంగం కోర్టు వెలుపల వెళ్లకూడదు. తరువాత, అతని తమ్ముడు గోపాల్ గాడ్సే ఈ షరతుపై సుదీర్ఘ దావా వేసిన తరువాత, దాదాపు 60 సంవత్సరాల తర్వాత, తన ప్రసంగాన్ని బహిరంగంగా ఉంచడానికి అనుమతి లభించింది.

1. నాథూరాం ఆలోచన - గాంధీజీ అహింస విధానం మరియు ముస్లిం బుజ్జగింపు విధానం హిందువులను పిరికివారిగా మారుస్తోంది. గణేష్ శంకర్ విద్యార్థిని కాన్పూర్‌లో ముస్లింలు దారుణంగా హత్య చేశారు. గాంధీజీ ఆలోచనా శైలి ద్వారా గణేష్జీ ప్రభావితమయ్యారు - గాంధీజీ అతని హత్యలో మౌనంగా ఉన్నారు!

2. 1919 జలియన్ వాలా బాగ్ మారణకాండ ముమ్మరంగా సాగుతోంది. ఈ దారుణ హత్య చేసిన విలన్ జనరల్ డయ్యర్‌పై కేసు నమోదు చేయమని గాంధీని కోరారు. కానీ గాంధీ పూర్తిగా నిరాకరించారు

3. ఖిలాఫత్ ఉద్యమానికి మద్దతు ఇవ్వడం ద్వారా గాంధీ భారతదేశంలో మతతత్వానికి బీజాలు నాటారు! అతను తనను తాను ముస్లింల శ్రేయోభిలాషిగా మాత్రమే వర్ణించేవాడు. మోప్లా ముస్లింలు కేరళలో 1500 మంది హిందువులను చంపి, 2000 మంది హిందువులను మార్చారు! గాంధీజీ కూడా వ్యతిరేకించలేదు!

4. కాంగ్రెస్ త్రిపుర సెషన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అధిక మద్దతుతో విజయం సాధించారు. కానీ గాంధీకి ఇష్టమైన అభ్యర్థి సీతా రామయ్య! సుభాష్ చంద్రబోస్ తరువాత రాజీనామా చేయవలసి వచ్చింది.

5. మార్చి 23, 1931 - భగత్ సింగ్ ఉరితీశారు. మరణశిక్షను నిలిపివేయాలని దేశం మొత్తం గాంధీని అభ్యర్థించింది. భగత్ సింగ్ కార్యాచరణ సరికాదని భావించి గాంధీ ఈ అభ్యర్థన చేయలేదు!

6. కాశ్మీర్ రాజు హరి సింగ్ ను రాజీనామా చేయమని గాంధీజీ కోరారు - ఎందుకంటే కాశ్మీర్ ముస్లిం మెజారిటీ రాష్ట్రం! అతను కాశీకి వెళ్లి తపస్సు చేయమని హరి సింగ్ కి చెప్పాడు! కానీ హైదరాబాద్ నిజాం విషయంలో మౌనంగా ఉంది. గాంధీజీ విధానం మార్చబడింది, ముఖ్యంగా మతం. తరువాత, సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క క్రియాశీలత కారణంగా, హైదరాబాదును భారతదేశంలో ఉంచారు.

7. ఆ సమయంలో పాకిస్తాన్‌లో హిందువుల హత్య జరుగుతోంది. అనేక మంది హిందువులు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి భారతదేశానికి వలస వచ్చారు. వారు ఢిల్లీలోని మసీదులో ఆశ్రయం పొందారు. ముస్లింలు వ్యతిరేకించడం ప్రారంభించారు. భయంకరమైన శీతాకాలపు రాత్రి, తల్లులు, సోదరీమణులు, పిల్లలు మరియు వృద్ధులు అందరూ మసీదు నుండి బలవంతంగా బయటకు పంపబడ్డారు. గాంధీ మౌనంగా ఉండిపోయారు!

8. ఖురాన్ చదవడానికి మరియు ఆలయంలో ప్రార్థన చేయడానికి గాంధీ ఏర్పాటు చేసారు! బదులుగా, అతను ఏ మసీదులోనూ గీత చదవడానికి ఏర్పాట్లు చేయలేకపోయాడు! అనేక మంది హిందువులు మరియు బ్రాహ్మణులు దీనిని వ్యతిరేకించారు - గాంధీ బాధపడలేదు

9. సర్దార్ వల్లభాయ్ పటేల్ లాహోర్ కాంగ్రెస్‌లో గెలిచారు, కానీ గాంధీ నెహ్రూకు ఆ పదవి ఇవ్వాలని పట్టుబట్టారు. అతను తన కోరికను నిజం చేయడంలో పరిపూర్ణుడు. ధర్నా, ఉపవాసం, కోపం, సంభాషణను నిలిపివేయడం - ఈ ఉపాయాల సహాయంతో అతను బ్లాక్ మెయిల్ చేశాడు. అతను నిర్ణయాన్ని సరైనది లేదా తప్పు అని నిర్ధారించలేదు.

10. 1947 జూన్ 14 న, ఢిల్లీలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ సమావేశం జరిగింది. చర్చనీయాంశం భారత విభజన. ఈ ప్రతిపాదన తిరస్కరించబడింది. కానీ విచిత్రంగా, గాంధీ దేశాన్ని విభజించే ప్రతిపాదనకు మద్దతు ఇచ్చారు. అతను ఒక రోజు ఇలా అన్నాడు - అతను దేశాన్ని విభజించాలనుకుంటే, అతను దానిని తన మృతదేహంపై చేయాలి!
లక్షలాది హిందువులు మరణించారు, కానీ అతను మౌనంగా ఉన్నాడు! అతను ముస్లింలను శాంతిని కాపాడమని ఎన్నడూ ఆదేశించలేదు - హిందువులకు మాత్రమే సలహాలు ఇచ్చేంతవరకు!

11. సెక్యులరిజం ముసుగులో గాంధీ "ముస్లిం మెప్పు" కు జన్మనిచ్చారు. హిందీని రాష్ట్ర భాషగా మార్చడాన్ని ముస్లింలు వ్యతిరేకించినప్పుడు - గాంధీ ఒప్పుకున్నాడు!
అతను ఒక వింత పరిష్కారం ఇచ్చాడు - "హిందుస్తానీ" (హిందీ మరియు ఉర్దూ ఖిచ్రీ)! అతను బాద్షా రామ్, బేగం సీత అని చెప్పడం ప్రారంభించాడు!

12. అతను కొంతమంది ముస్లింలకు వ్యతిరేకంగా తల వంచి "బండేమాతరం" జాతీయ గీతంగా మారడానికి అనుమతించలేదు!

13. గాంధీజీ పదేపదే ఛత్రపతి శివాజీ, మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్‌ను తప్పుదారి పట్టించిన దేశభక్తులు అని పిలిచారు! కానీ అక్కడ అతను ముహమ్మద్ అలీ జిన్నాను "ఖైదా అజామ్" ​​అని పిలిచేవాడు! ఎంత విచిత్రమైన విషయం!

14. స్వతంత్ర భారతదేశం యొక్క జాతీయ జెండా ఎలా ఉంటుందో నిర్ణయించడానికి 1931 లో నేషనల్ కాంగ్రెస్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. మధ్యలో స్పిన్నింగ్ వీల్‌తో లోతైన కుంకుమ బట్టల జెండా ఉంటుందని ఈ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. కానీ దాన్ని తెరాంగా చేయాలనేది గాంధీజీ పట్టుదల! అంతా అతని ఇష్టంపైనే ఆధారపడి ఉంది!

15. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో సోమనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించాలనే ప్రతిపాదన పార్లమెంటులో పెట్టబడినప్పుడు, అతను దానిని వ్యతిరేకించాడు. ఆయన మంత్రివర్గంలో కూడా లేరు! కానీ విచిత్రమేమిటంటే, అతను జనవరి 13, 1948 న నిరాహార దీక్షను ప్రారంభించాడు - ప్రభుత్వ ఖర్చుతో ఢిల్లీలో మసీదు నిర్మించడానికి! ఎందుకు ఈ ద్వంద్వత్వం? అతను హిందువులు భారతీయులు అని అనుకోకపోవచ్చు! సరే, మీరు హిందువులా?

16.గాంధీజీ మధ్యవర్తిత్వం ద్వారా నిర్ణయించబడింది - స్వాతంత్ర్యం తరువాత, పాకిస్తాన్‌కు భారతదేశం 75 కోట్ల రూపాయలు ఇస్తుంది. ప్రారంభంలో 20 కోట్లు ఇచ్చారు. మిగిలినవి 55 కోట్లు తరువాత ఇవ్వాల్సి ఉంది. కానీ అక్టోబర్ 22, 1947 న పాకిస్థాన్ కశ్మీర్‌పై దాడి చేసింది! పాకిస్తాన్ చేసిన ఈ ద్రోహం కోసం, మిగిలిన డబ్బును పాకిస్తాన్‌కు ఇవ్వకూడదని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. కానీ అతను కర్రతో కూర్చున్నాడు! మళ్లీ బ్లాక్ మెయిల్ మొదలుపెట్టారు - మళ్లీ నిరాహార దీక్ష. చివరికి, ప్రభుత్వం దేశద్రోహి పాకిస్థాన్‌కు మిగిలిన 55 కోట్ల రూపాయలు చెల్లించవలసి వచ్చింది!

జిన్నా మరియు 'అంధ పాకిస్తాన్ ప్రేమ' పట్ల అతని ప్రేమను చూసి, అతను నిజానికి పాకిస్తాన్ తండ్రి అని నేను చెప్పగలను - భారతదేశం కాదు. అతను ప్రతి క్షణం పాకిస్తాన్‌కు మద్దతుగా మాట్లాడుతాడు - పాకిస్తాన్ వాదన ఎంత అన్యాయంగా ఉన్నా!

నాథూరామ్ గాడ్సే కోర్టులో ఇచ్చిన కొన్ని ప్రకటనలు ఇవి.
ఆయనంటే నాకు చాలా గౌరవం. కానీ ఏ దేశభక్తుడూ దేశాన్ని విభజించలేడు మరియు ఏ దేశభక్తుడూ దేశాన్ని విభజించడానికి మరియు ఒక నిర్దిష్ట సమాజానికి అనుకూలంగా ఉండటానికి మేము అనుమతించలేము. నేను గాంధీని చంపలేదు - నేను చంపాను - చంపాను. గాంధీజీని చంపడం తప్ప నాకు వేరే మార్గం లేదు. అతను నా శత్రువు కాదు - కానీ అతని నిర్ణయం దేశానికి ప్రమాదం తెచ్చింది. ఒక వ్యక్తికి వేరే మార్గం లేనప్పుడు - సరైన పని చేయడానికి సరైన మార్గాన్ని ఎంచుకోవడం.

ముస్లిం లీగ్ మరియు పాకిస్తాన్ నిర్మాణంలో గాంధీజీ మద్దతుతో నేను కలవరపడ్డాను. పాకిస్తాన్ కోసం రూ .55 కోట్లు పొందాలని గాంధీజీ నిరాహార దీక్ష చేపట్టారు. పాకిస్తాన్‌లో హింస కోసం భారతదేశానికి వలస వచ్చిన హిందువుల దుస్థితి నన్ను ఆశ్చర్యపరిచింది. ముస్లిం లీగ్‌కి తలవంచడం గాంధీజీకి విచ్ఛిన్నం కాని హిందూ రాజ్యం సాధ్యం కాదు. నా తల్లి తన కొడుకు కోసం ముక్కలుగా విడిపోవడం నాకు భరించలేనిది. నేను నా స్వంత దేశంలో విదేశీయుడిని అయ్యాను.

అతను ముస్లిం లీగ్ యొక్క అన్ని అన్యాయాలకు కట్టుబడి ఉన్నాడు. భారతదేశం విచ్ఛిన్నం మరియు కష్టాల నుండి కాపాడటానికి నేను గాంధీజీని తప్పక చంపాలని నిర్ణయించుకున్నాను. అందుకే నేను గాంధీని చంపాను.

నేను దాని కోసం ఉరి తీస్తానని నాకు తెలుసు మరియు నేను దాని కోసం సిద్ధంగా ఉన్నాను. మరియు ఇక్కడ మాతృభూమిని రక్షించడం నేరమైతే - నేను అలాంటి నేరాన్ని మళ్లీ మళ్లీ చేస్తాను - ప్రతిసారీ. మరియు సింధు నది భారతదేశమంతా ప్రవహించే వరకు - నా ఎముకలను ముంచవద్దు. నన్ను ఉరితీసిన సమయంలో, నా చేతిలో ఒక కుంకుమ జెండా మరియు మరొక చేతిలో మొత్తం భారతదేశం యొక్క మ్యాప్ ఉన్నాయి. నేను ఉరిశిక్షకు వెళ్లే ముందు, నేను భారతమాత విజయం గురించి చెప్పాలనుకుంటున్నాను.

ఓ భారతమాత - నేను మీకు మాత్రమే సేవ చేయగలిగినందుకు నన్ను క్షమించండి. "

జాయ్ హిందూ రాష్ట్రం.
చెడిపోని భారతదేశం అజరామరంగా మిగిలిపోయింది.
# సేకరించబడింది

సేకరణ

మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం..

🤔ఈ మెసేజ్ ని చదివి ఆలోచించoడి🤔

కాగితాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి.
నిప్పును కనిపెట్టిందెవరు?
మనిషి.
చక్రాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
వ్యవసాయాన్ని కనిపెట్టిందెవరు?
మనిషి
పెద్ద పెద్ద ఇల్లు,బంగళాలు కట్టిందెవరు?
మనిషి
ఓడను కనిపెట్టిందెవరు?
మనిషి
విమానం కనిపెట్టిందెవరు?
మనిషి
కంప్యూటర్ కనిపెట్టిందెవరు?
మనిషి
ఫోన్, మొబైల్ కనిపెట్టిందెవరు?
మనిషి
కార్లు, వాహనాలు కనిపెట్టిందెవరు?
మనిషి
ఇంట్లో విశ్రాంతి,సుఖము, ప్రశాంతత కొరకు ఏ వస్తువులనయితే ఉపయోగిస్తున్నావో వీటిని ఎవరు తయారు చేశారు?
మనిషి
ఏ face book,whatsap లలో postings చదువుతున్నావో వీటిని ఎవరు సృష్టించారు?
మళ్ళీ సమాధానం మనిషి
ఈ సమాజాన్ని నిర్మించిందెవరు
మనిషి ?
మతాలను,ధర్మాలను సృష్టించిందెవరు
మనిషి

మందిరము,మసీదు,చర్చి సృష్టించిందెవరు?
మనిషి

వీటిలో దేవున్ని ప్రతిష్టించిందెవరు ?
మనిషి

విచిత్రమైన విషయమేమిటంటే ప్రతి ఒక్కటీ మనిషే సృష్టించాడు అయినప్పటికీ మనం దేవుడు చమత్కారాలు చేస్తాడని విశ్వసిస్తాం

మనిషే దేవున్ని సృష్టంచాడనడానికి సాక్ష్యాలు
1)మనిషి తప్ప ఏ ప్రాణీ భగవంతున్ని కోరికలు కోరదు.
2)మనిషి నివాసం లేని చోట మందిరం గాని, మసీదు గాని,చర్చి గానీ లేవు.
ఇతర గ్రహాలలో గానీ, మంచు ఖండంలో గానీ.
3)వేరు వేరు దేశాలలో ప్రాంతాలలో వేరు వేరు దేవతలు, దీని అర్థం మనిషి
ఊహలతో తన ఇష్టమైన రీతిలో భగవంతున్ని సృష్టించాడు.
4)ప్రపంచంలో అనేక ధర్మాలు అనేక సాంప్రదాయాలు, అనేక పద్ధతులు
ఒకర్నొకరు విమర్శించుకోవడాలు
దీని అర్థం దేవుడు ఒకరు కాదనేగా.
అందరూ చెబుతారు దేవుడొక్కడే అని.
కానీ కొసమెరుపు అది మా దేవుడే.
5)రోజుకో క్రొత్త దేవుడు, రోజుకో కొత్త పద్ధతి. మాదే గొప్ప అనే వితండ వాదనలు.
6)ప్రశ్నించే వాన్ని నాస్తికుడనో, హృదయం లేని వాడనో ముద్ర వేయడం.
7)ఈ ప్రపంచంలో వేరు వేరు దేవతలను ప్రసన్నం చేసుకోవడం కోసం ఎన్ని తిప్పలో ఎన్ని ప్రయాసలో వర్ణించ నలవి కాదు.
8)ఇప్పటి వరకు నాకు దేవుడు కనపడినాడని చెప్పిన మనిషే లేడు.
బుద్దుడు, వివేకానందుల వారు కూడా కనపడే మనిషికే సేవచెయ్యమన్నారు
ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా చివరకు కీర్తి కాంక్ష కూడా సుమా!
9)దేవుడున్నాడు లేడు అనే వాడు కూడా ఒకే విధమైన జీవితాన్ని అనుభవిస్తున్నాడు.
10)భగవంతుడు ఎవరికీ మేలు చెయ్యట్లేదు అలా అని కీడు కూడా చెయ్యట్లేదు
11)దేవుడు లంచగొండితనం,అన్యాయం,దొంగతనం,బలాత్కారము,ఆతంకవాదము,అరాచకత్వాన్ని నిరోధించడం లేదు.
12)అమాయకమైన చిన్న పిల్లలను కాల్చుతున్నా కూడా వారిని ఆపడం లేదు.
13.మందిరాలు,మసీదులు,చర్చిలు,ధ్యానమందిరాలు ఇవి దేవుని నిలయాలనే చెప్పుకునే చోట కూడా
మహిళలు,పిల్లలు సురక్షితంగా లేరు.
14.మందిరాలు, మసీదులు,చర్చిలు కూల్చుతుంటే ఏ దేవుడూ వచ్చి ఆపలేదు.
15.అభ్యాసం చేయకుండా ఏ ఒక్క విద్యార్థి అయినా ఉత్తీర్ణుడయ్యాడా?
16)25 సంవత్సరాలముందు లేని దేవుండ్లు, రకరకాల పద్ధతులు ఈ నాడు గొప్ప గొప్పవి అయిపోయినాయి.
17)తానే దేవున్నని చెప్పుకునే వాల్లు చాలా మంది జైల్లలో ఊచలు లెక్క పెడుతున్నారు.
18)ఈ ప్రపంచంలో దేవుడే లేడని చెప్పేవాల్లు చాలా మంది ఆనందంగా ఉన్నారు.
19) హిందువులు అల్లాను స్వీకరించరు,ముస్లిములు హిందూ దేవతలను,క్రైస్తవులు హిందూ దేవతలను,అల్లాహ్ ను ఒప్పుకోరు.
హిందూ ముస్లిమ్ గాడ్ ను అంగీకరించరు. అయినప్పటికీ ఈ దేవతలంతా ఎందుకిలా అని ఎవర్నీ అడుగలేదే?
కనుక ఆనందమే దైవం ఆనందం ఎప్పుడు కలుగుతుందీ అంటే కనపడని దేవుని పేరుతో కోటాను కోట్ల వ్యాపారం చేయడం కన్నా కనపడే మనిషికి సేవచేయడంలో. వారి కళ్ళలో కనపడే కృతజ్ఞతాపూర్వకమైన చూపును అనుభవించే వారికే తెలుస్తుంది. ప్రపంచంలోని తియ్యదనమంతా ఇందులోనే ఉంటుంది. మహామహులను పూజించడం కంటే వారు చూపిన మార్గంలో వెళ్ళడమే సరియైన విధానం..

సేకరణ

*💫మానవ శరీరం గురించి ఎన్నో విశేషాలు* *💫ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలు*

💫మానవ శరీరం గురించి ఎన్నో విశేషాలు

💫ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయాలు

1: ఎముకల సంఖ్య: 206
2: కండరాల సంఖ్య: 639
3: మూత్రపిండాల సంఖ్య: 2
4: పాల దంతాల సంఖ్య: 20
5: పక్కటెముకల సంఖ్య: 24 (12 జత)
6: గుండె గది సంఖ్య: 4
7: అతిపెద్ద ధమని: బృహద్ధమని
8: సాధారణ రక్తపోటు: 120/80 Mmhg
9: బ్లడ్ Ph: 7.4
10: వెన్నెముకలోని వెన్నుపూసల సంఖ్య: 33
11: మెడలోని వెన్నుపూసల సంఖ్య: 7
12: మధ్య చెవిలో ఎముకల సంఖ్య: 6
13: ముఖంలోని ఎముకల సంఖ్య: 14
14: పుర్రెలోని ఎముకల సంఖ్య: 22
15: ఛాతీలోని ఎముకల సంఖ్య: 25
16: చేతుల్లో ఎముకల సంఖ్య: 6
17: మానవ చేతిలో కండరాల సంఖ్య: 72
18: గుండెలోని పంపుల సంఖ్య: 2
19: అతిపెద్ద అవయవం: చర్మం
20: అతిపెద్ద గ్రంథి: కాలేయం
21: అతిపెద్ద కణం: ఆడ అండం
22: అతి చిన్న కణం: స్పెర్మ్
23: అతిచిన్న ఎముక: మధ్య చెవికి స్టెప్స్
24: మొదటి మార్పిడి చేసిన అవయవం: కిడ్నీ
25: చిన్న ప్రేగు యొక్క సగటు పొడవు: 7 మీ
26: పెద్దపేగు సగటు పొడవు: 1.5 మీ
27: నవజాత శిశువు యొక్క సగటు బరువు: 3 కిలోలు
28: ఒక నిమిషంలో పల్స్ రేటు: 72 సార్లు
29: సాధారణ శరీర ఉష్ణోగ్రత: 37 C ° (98.4 f °)
30: సగటు రక్త పరిమాణం: 4 నుండి 5 లీటర్లు
31: జీవితకాలం ఎర్ర రక్త కణాలు: 120 రోజులు
32: జీవితకాలం తెల్ల రక్త కణాలు: 10 నుండి 15 రోజులు
33: గర్భధారణ కాలం: 280 రోజులు (40 వారాలు)
34: మానవ పాదంలోని ఎముకల సంఖ్య: 26
35: ప్రతి మణికట్టులోని ఎముకల సంఖ్య: 8
36: చేతిలో ఎముకల సంఖ్య: 27
37: అతిపెద్ద ఎండోక్రైన్ గ్రంథి: థైరాయిడ్
38: అతిపెద్ద శోషరస అవయవం: ప్లీహము
40: అతిపెద్ద మరియు బలమైన ఎముక: ఫెముర్
41: చిన్న కండరం: స్టెపిడియస్ (మధ్య చెవి)@camyeduhubin
41: క్రోమోజోమ్ సంఖ్య: 46 (23 జత)
42: నవజాత శిశువు ఎముకల సంఖ్య: 306
43: రక్త స్నిగ్ధత: 4.5 నుండి 5.5
44: యూనివర్సల్ డోనర్ బ్లడ్ గ్రూప్: ఓ
45: యూనివర్సల్ గ్రహీత రక్త సమూహం: AB
46: అతిపెద్ద తెల్ల రక్త కణం: మోనోసైట్
47: చిన్న తెల్ల రక్త కణం: లింఫోసైట్
48: పెరిగిన ఎర్ర రక్త కణాల సంఖ్య అంటారు: పాలీసైథెమియా
49: శరీరంలో బ్లడ్ బ్యాంక్: ప్లీహము
50: జీవన నది అంటారు: రక్తం
51: సాధారణ రక్త కొలెస్ట్రాల్ స్థాయి: 100 mg / dl
52: రక్తం యొక్క ద్రవ భాగం: ప్లాస్మా

జీవితం అనే ఈ సాహసాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అనుమతించే ఒక సంపూర్ణ రూపకల్పన యంత్రం. దాన్ని జాగ్రతగా చూసుకో. దుర్గుణాలు మరియు మితిమీరిన దానిని దెబ్బతీయవద్దు.

సేకరణ

ఖాసిం రజ్వీ – మజ్లిస్ పుట్టుక ౼ హైదరాబాద్ చరిత్ర..!

✍️ఖాసిం రజ్వీ – మజ్లిస్ పుట్టుక ౼ హైదరాబాద్ చరిత్ర..!
తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతివాడు తెలుసుకోవాల్సిన విషయం.
పూర్తిగా చదవి.. షేర్ చేసి మరింత మందికి తెలియజేయండి.🙏

1. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్.. అసిఫ్ ఝా VII.. ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడేందుకు.. ఇక్కడి ప్రజలను ఊచకోత కోసేందుకు లాతూర్ నుంచి వచ్చిన పరమ దుర్మార్గుడు ఖాసిం రజ్వీ..👿

2. ఖాసిం రజ్వీ ఆధ్వర్యంలో ఉన్న మిలిటెంట్ గ్రూప్ (నిజాం అనఫిషియల్ సైన్యం) ‘రజాకార్ల’ పేరుతో చెలామణీ అయ్యేది..

3. రజాకార్లు ఎంతటి రాక్షసులు అంటే.. (ఈ రోజుల్లో మన ఊహ కు కూడా అందనంత అక్రమంగా నిజాం నిర్దేశించిన పన్నులు ఉండేవి) పన్నులు చెల్లించని వారి గోర్ల కింది మాంసం కత్తి తో కోసి గోర్లు ఊడబెరికే వారు. భర్తల ముందే భార్య లను అత్యాచారం చేసే వారు... భార్య ల ముందే భర్త లను నరికి చంపే వారు.. భర్తల ఆచూకి చెప్పక పోతే పిల్ల వాళ్ళను పైకి ఎగురేసి కత్తి కి గుచ్చి చంపే వారు. ఆ రోజుల్లో రజాకార్లను చూసిన వాళ్లెవరూ బతికిన దాఖలాలు.. లేవు.. రజాకార్ల సైన్యం.. గుర్రాల మీద ఊళ్ల వెంట పోతుంటే.. అంతా భయంభయంగా తలుపులేసుకుని చిన్న చిన్న సందుల్లోంచి చూసేవాళ్లు.. రజాకార్లు వెళ్తున్న సమయంలో ఎవరైనా రోడ్డుమీదకనిపిస్తే.. వాళ్లను గుర్రాలకు కట్టి ఈడ్చుకెళ్లి పాశవికంగా హత్య చేసేవాళ్లు..👿☠️

4. రజాకార్ల అండతో.. ఆఖరి నిజాం.. హైదరాబాద్ సంస్థానాన్ని పాకిస్తాన్ లో కలిపేందుకు లేదా స్వతంత్ర రాజ్యంగా ఉండాలనే గట్టి ప్రయత్నం చేశాడు.. నిజాం తరుపున రాయభారానికి డిల్లీ వెళ్లిన ఖాసీం, “హైదరాబాద్ ను భారత్ లో కలుపాలి అని చూస్తే ఇక్కడ ఉన్న కోటి మంది ప్రజలను ఊచ కోత కోస్తాము” అని బెదిరించాడు. (నీకు ఇద్దరు భార్యలు & ఆరుగురు పిల్లలు మాత్రమే ఉన్నారు.. కానీ మీ నిజాం కు పదుల సంఖ్య లో భార్యలు వందల సంఖ్య లో పిల్లలు ఉన్నారు.. వారందరూ భద్రంగా ఉండాలి అని మా కోరిక.. అని రివర్స్ పంచ్ తో పటేల్, ఖాసీం ని హెచ్చరించాడు)

5. 1948 సెప్టెంబర్ 13 వరకూ రజాకార్ల దుర్మార్గాన్ని హైదరాబాద్ సంస్థానం భరించక తప్పలేదు..
భారత ప్రభుత్వానికి సహకరిస్తే.. నిట్టనిలువునా ప్రాణాలు తీస్తామని రజాకార్లు హైదరాబాద్ సంస్థానంలో ఉన్నప్రజల్ని బెదిరించారు. దాదాపుగా 32000 మంది స్థానికులు సికింద్రాబాద్ లోని మిలటరీ కంటోన్మెంట్ లో ప్రాణభయంతో తలదాచుకున్నారు..☠️

6. ఆఖరి నిజాం.. 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానాన్ని భారత ప్రభుత్వానికి స్వాధీనంచేసిన తర్వాత.. రజాకార్ల సైన్యంలో చాలామంది పాకిస్తాన్ కి పారిపోయారు.. ఇక్కడే మిగిలిపోయినవాళ్లు మాత్రం గెడ్డాలు తీసేసి.. మామూలు పౌరుల్లో కలిసిపోయి ప్రాణాలు దక్కించుకున్నారు.. దొరికిన రజాకార్లను భారత సైన్యం చంపి వేసింది.🤺🤺🤺

———-0————

చివరి నిముషంలో ఖాసిం రజ్వీ విషయాన్ని అర్ధం చేసుకున్నాడు..
ఇక్కడే ఉంటే.. నిట్టనిలువునా జనం చీల్చి చంపుతారన్న విషయం తెలిసిపోయింది..
పాకిస్తాన్ కి పారిపోవాలి..
అంటే.. నిజాం సరండర్ కావాలి..
అప్పుడే ప్రాణాలు దక్కుతాయి..
అప్పటి ప్రధాని నెహ్రూ.. రజాకార్లు పాకిస్తాన్ కి వెళ్లిపోవడానికి అనుమతించారు..

వల్లభాయ్ పటేల్ భారత సైన్యానికి చెప్పిన మాట.. నిజాంని అరెస్ట్ చేసి, ఖాసీం రజ్వీని చంపేయమని..

కానీ.. నెహ్రూ జోక్యం చేసుకుని నిజాంని ఏమీ చేయొద్దని, ఖాసిం రజ్వీని అరెస్ట్ చేయమని పటేల్ మీద ఒత్తిడి తీసుకొచ్చారు..

1957 సెప్టెంబర్ 11న జైలునుంచి విడుదలయ్యాక ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు..
జైలునుంచి విడుదలైన తర్వాత.. సరిగ్గా హైదరాబాద్ సంస్థానానికి విమోచనం లభించిన రోజునే రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లడం మరో విషయం..
పాకిస్తాన్ కి వెళ్లేముందు నిజాం కాలం నాటి MIM అనే రాజకీయ పార్టీకి జీవం పోసి దాన్ని సమర్ధుడైన నాయకుడి చేతుల్లో పెట్టి వెళ్లాలని రజ్వీ నిర్ణయించుకున్నాడు..
పార్టీ సభ్యులకు వర్తమానం పంపాడు..
ఓ ముప్ఫై నలభైమంది మాత్రం సమావేశానికి హాజరయ్యారు..
కానీ.. బాధ్యతల్ని తీసుకోవడానికి ఎవరూ ముందుకు రాలేదు..
పన్నెండేళ్లకు పైబడిని ఏ యువకుడికైనా పార్టీ పగ్గాలను అప్పజెప్పేందుకు సిద్ధంగా ఉన్నానని రజ్వీ ఆ సమావేశంలో ప్రకటించాడు..
అబ్దుల్ వహిద్ ఒవైసీ అనే ఓ పద్దెనిమిదేళ్ల కుర్రాడు.. ముందుకొచ్చాడు..
అప్పట్లో కనీసం అతనికి పార్టీతో కూడా సంబంధం లేదు..
వహిద్ ఒవైసీ ధైర్యాన్ని చూసి అప్పటి నిజాం.. ఎంఐఎం పార్టీ అధినేతగా అతని పేరుని ప్రపోజ్ చేశాడు..
ఖాసిం రజ్వీ మద్దతు తెలిపాడు..
పార్టీ పగ్గాలు ఒవైసీ చేతుల్లోకి వచ్చాయి..
బ్యాన్ చేసిన పార్టీ నాయకత్వాన్ని స్వీకరించిన నేరానికి అతనికి 11 నెలల జైలుశిక్ష విధించారు..
జైలు జీవితం ముగిశాక.. ఒవైసీకి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చేందుకు నెహ్రూ ముందుకొచ్చారు..
కానీ.. వహిద్ ఒవైసీ అందుకు అంగీకరించలేదు..
ఎంఐఎంకి నూతన ఉత్తేజాన్ని అందించేందుకు పూర్తి సమయాన్నివెచ్చించాడు..
1975లో వహిద్ ఒవైసీ కొడుకు సలావుద్దీన్ ఒవైసీ.. తండ్రినుంచి పార్టీ పగ్గాల్ని తీసుకున్నాడు..
ఆయన కొడకులు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఒవైసీలు ప్రస్తుతం పార్టీ బాగోగులు చూస్తున్నారు..

హైదరాబాద్ సంస్థానం పతనం తరువాత ప్రముఖులు అయిదుగురి లో నెహ్రు దయ వల్ల నిజాం పరిస్థితి కొంత బెటర్..

1.మీర్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భారత ప్రభుత్వం రాజ్ ప్రముఖ్ ని చేసింది. అంటే.. గవర్నర్ హోదా అన్నమాట..

2. రజాకార్లకు నాయకత్వం వహించి అన్యాయంగా అమాయకుల ప్రాణాలను పొట్టనపెట్టుకున్న ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కి వెళ్లి, అక్కడ ఎవరూ పట్టించుకోక.. కరాచీలో దీనాతిదీనమైన పరిస్థితిలో చనిపోయాడు.

3. మీర్ లాయక్ అలీ ఖాన్ – నిజాం ప్రభుత్వ దివాన్ – అందరికన్నా ముందు పాకిస్తాన్ కి వెళ్లిపోయాడు.

4. కె.ఎ.మున్షీ – హైదరాబాద్ లో ఇండియా ఏజెంట్ జనరల్ గా ఉన్న ఇతను నిజాంతో కలిసిపోయి అరాచకాల్ని భారత ప్రభుత్వానికి తెలియకుండా మేనేజ్ చేసిన కారణంగా మట్టిలో కలిసిపోయాడు..

5. హైదరాబాద్ సంస్థానానికి మేజర్ జనరల్ సయ్యద్ అహ్మద్ అల్ ఇద్రూస్ చరిత్ర కారాగారంలోనే ముగిసిపోయింది. విడుదలైన తర్వాత అనామకుడిగా మిగిలిపోయాడు.

ఇదీ, రజాకార్ల రాక్షస చరిత్ర గురించి కొంచెం.

సేకరణ

Saturday, September 18, 2021

ఎదగాలని తపన ఉంటే నిన్ను ఎవడు ఆపుతాడు?

ఎదగాలని తపన ఉంటే నిన్ను ఎవడు ఆపుతాడు?

1. నాకు ఉచిత విద్య లభించడం లేదండీ
.... హెన్రీ ఫోర్డ్ కి కూడా లభించ లేదు.

2. జీవితంలో చాలా సార్లు ఓడిపోయానండి.
అబ్రహాం లింకన్ చాలా అపజయాలను చూశాడు.

3. నేను చాలా పేద కుటుంబానికి చెందిన వాడిని.
అబ్దుల్ కలాం కూడా బీద కుటుంబం నుండే వచ్చాడు.

4. నేను చిన్నప్పటినుండి అనారోగ్య వంతుడిని.
నటి మర్లీ మాట్లిన్ చిన్నప్పటి నుండి అవకరం తోనే ఉంది.

5. జీవితం అంతా సైకిల్ మీదే గడిచిపోతోంది.
నిర్మా సబ్బు కర్సన్ భాయి పటేల్ సైకిల్ మీద తిరిగి అమ్మాడు.

6. ఒక ప్రమాదం జరిగి నాధైర్యాన్ని కోల్పోయాను. నాట్య మయూరి సుధా చంద్రన్ కృత్రిమ కాలు తో డాన్సు చేస్తుంది.

7. చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు. నన్ను చూసే వారే లేరు.
ఎ ఆర్ రెహమాన్ తండ్రి కూడా చిన్నప్పుడే పోయారు.

8. కుటుంబ భారం అంతా నా మీదే ఉంది. అందుకే ఎదగ లేక పోయాను.
............ లతా మంగేష్కర్ కూడా చిన్నప్పుడే కుటుంబ భారం మోసింది.

9. నేను చాలా పొట్టివాడిని.
సచిన్ టెండూల్కర్ కూడా పొట్టివాడే.

10. నేను మంద బుద్ది వాడిని.
థామస్ ఆల్వా ఎడిసన్ కూడా చిన్నప్పుడు మంద బుద్దివాడే.

11. నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను. దానితో ఏమి చెయ్యగలను ?
ధీరూ భాయి అంబానీ కూడా చిన్న ఉద్యోగం తోనే మొదలు పెట్టాడు.

12. నా కంపెనీ దివాలా తీసింది. నన్నెవరు నమ్ముతారు ?
పెప్సీ కోలా కూడా రెండు సార్లు దివాలా తీసింది.

13. నేను ఒకసారి నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యాను. ఇప్పుడు ఏమి చెయ్యగలను ?
వాల్ట్ డిస్నీ మూడు సార్లు నెర్వస్ బ్రేక్ డౌన్ కి గురి అయ్యారు.

14. నా వయసు ఐపోయింది. ఇప్పుడు ఏమి చెయ్యగలను?
కెంటకీ ఫ్రైడ్ చికెన్ హర్లాండ్ శాండర్స్ 60 వ ఏట కె ఎఫ్ సి మొదలు పెట్టాడు.

మనం ఉన్న చోటునుండి ఉన్నతికి వెళ్ళాలి అనే కోరిక ప్రబలంగా ఉంటే మనం వెళ్ళగలం.

పూర్తిగా చదివిన వారికి ధన్యవాదాలు🙏

సేకరణ

Friday, September 17, 2021

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా ---శ్రీ చాగంటి వారి మాట

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి జయంతి సందర్భంగా

-----శ్రీ చాగంటి వారి మాట

ఎందరో మహానుభావుల జీవితములు మనకు మార్గదర్శనములు, నిరంతర స్ఫూర్తిదాయకములు. అటువంటి ఎన్నో విషయములు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డా||చాగంటి కోటేశ్వర రావు గారి మాటలలో...

2017 మే లో కాకినాడలోని శ్రీమతి ఆకొండి లక్ష్మి స్మారక గోశాలలో "శ్రీ చాగంటి సత్సంగము" ఆధ్వర్యములో పూజ్య గురువులు "వ్యక్తిత్వ వికాసము" అను అంశముపై విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగములో శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారి దీక్షాదక్షత, దానశీలము గురించిన విశేషములు, ఆ మాహా గాయిని జయంతి సందర్భముగా…

శ్రీమతి M.S.సుబ్బులక్ష్మి గారు గంధర్వ గాయిని. ఆవిడ పాట పాడితే ఈ దేశమునకు చెందిన వారు మాత్రమే కాదు, ప్రపంచ వ్యాప్తముగా ఎందరో పరవశించేవారు. చూపు, వినికిడి లేని హెలెన్ కెల్లర్ అనే ఒక విదేశీ వనితకి ఒక గొప్ప శక్తి ఉండేది. కళ్ళు లేకపోయినా, ఆవిడ ఎవరినైనా కొద్దిసేపు ముట్టుకుని ఆ వ్యక్తి లోని బలము, బలహీనత అన్నీచెప్పేసేవారు. ఈ విషయము విని, ఆశ్చర్యపోయి, హెలెన్ కెల్లర్ భారత దేశము వచ్చినప్పుడు అప్పటి ప్రధాని శ్రీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఆవిడను పిలిపించుకుని, తనను ముట్టుకొమ్మన్నారు. హెలెన్ కెల్లర్ నెహ్రూ గారిని ముట్టుకుని, ఆయన బలాలు, బలహీనతలు, ఆయన జీవితము, అన్నీ చెప్పేసారు. అటువంటి హెలెన్ కెల్లర్ సుబ్బులక్ష్మి గారు పాట పాడుతూఉంటే, తాను వినలేను కాబట్టి, వేదిక పైనే కూర్చుని పాట పాడుతున్న సుబ్బులక్ష్మి గారి కంఠము మీద చెయ్యి పెడతాను అని అడిగారు. సుబ్బులక్ష్మి గారు అందుకు అంగీకరించారు. "కురై ఒండ్రుం ఇల్లై" అనే కీర్తన సుబ్బులక్ష్మి గారు పాడుతూ ఉన్నప్పుడు ఆవిడ కంఠం కింద వేలు పెట్టి, వల వలా ఏడిచేసి, "ఈమె కేవలము ఒక మామూలు గాయకురాలు కాదు. ఈమె గంధర్వ కాంత. ఈమె పాడిన తీరు దేవతలు పాడిన తీరుగా ఉంది. మనుష్యులు పాడగలిగినది కాదు" అని పరవశించారు హెలెన్.

ఇంత ఘనత సాధించిన సుబ్బులక్ష్మి గారి జీవితం వడ్డించిన విస్తరి కాదు. ఆవిడ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆవిడ తన చిన్నతనములో కటిక పేదరికము అనుభవించారు. తల్లిగారైన షణ్ముఖ వడిగు గారు అంత పేదరికములోనూ కూడా సుబ్బులక్ష్మి గారు గొప్ప విద్వాంసురాలు కావాలి అని ఎంతో కష్టపడి ఆవిడను పెంచారు. ఒకరోజు ఆవిడ సుబ్బులక్ష్మి గారికి అన్నము పెట్టడానికి కూరలు ఏమీ లేకపోతే, మజ్జిగలో నీళ్ళు పోసి, మరింత పల్చగా చేసి పెట్టారు. కాని ఆ సమయానికే పక్కనున్నవారి ఇంటిలోనుంచి మంచి వంటల ఘుమఘుమల వాసనలు రావటముతో, చిన్న పిల్ల అయిన సుబ్బులక్ష్మి గారు అటువంటి కూరలు తనకు కూడా కావాలి అని హటము చేసారు. అప్పుడు వాళ్ళ అమ్మగారు పక్కంటివారిని ప్రార్థించి, కూర తెచ్చి, సుబ్బులక్ష్మి గారికి పెట్టారు. కూర తినటానికి కూడా లేనంత దారిద్ర్యము అనుభవించిన తల్లి, తన దీక్షాదక్షతలతో, పట్టుదలతో, సంగీత సాధన చేసి, గంధర్వగానము చేసి, ప్రపంచవ్యాప్తముగా ప్రఖ్యాతిగాంచారు.

తరువాతి కాలములో తాను కోట్లకు పడగెత్తినా, ఎన్నడూ ఆవిడకు దానిపై వ్యామోహము లేదు. తృణప్రాయముగా ధనమును దానము చేసిన మహా దాత సుబ్బులక్ష్మి గారు. సుబ్బులక్ష్మి గారి దానశీలము, దీక్ష, పట్టుదల చిరంతరముగా స్ఫూర్తిదాయకములు.

🌷🌷🌷🌷🌷

సేకరణ

కనీసం అప్పుడప్పుడైన కలిసి గడుపుదాం బంధాలను పటిష్టంగా ఉంచుకుందాం

నిజమే కదా ఫ్రెండ్స్ కనీసం అప్పుడప్పుడైన కలిసి గడుపుదాం బంధాలను పటిష్టంగా ఉంచుకుందాం 🙏

మన చిన్నతనంలో ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే కనీసం రెండు,మూడు రోజులు ఉండేవారు. వంటలు కూడా రోజూ ఎలా ఉండేవో అలాగే ఉండేవి.
ప్రత్యేకించి ఏమీ వండేవారు కారు. ఆరుబయట నులక మంచాలు వేసుకుని పడుకోవడం కబుర్లు చెప్పుకుని పడుకోవడం మూడు పూటలా అన్నమే తినడం మూడో రోజు వారు తిరిగి ప్రయాణం అయ్యే సమయానికి వారి చెప్పులు కనిపించేవి కావు. ఇల్లంతా వెతికినా కనిపించవు.అంతలో వాళ్ళు ఎక్కాల్సిన బస్సు వచ్చి వెళ్ళిపోతుంది.అప్పట్లో రోజుకు ఒకటో రెండో బస్సు సర్వీసులు.
కొన్ని ఊళ్ళకైతే అవి కూడా ఉండేవి కావు. ఆ బస్సు వెళ్ళగానే చెప్పులు ప్రత్యక్షం అయ్యేవి. బంధువులు మరొక రోజైనా ఉండాలనే కోరికతో ఇంటివాళ్లే చెప్పులను దాచిపెట్టేవారు.

రానురాను మనం ఆధునికత సంతరించుకున్న తరువాత బంధుత్వాల బలిమి సన్నగిల్లిపోయింది. ఇక గత రెండు మూడు దశాబ్దాలుగా బంధుత్వాలు మొక్కుబడిగా మారిపోయాయి.
ఒకే పట్నంలో ఉంటున్నా కూడా ఏడాదికో రెండేళ్లకో ఒకసారి కలుసుకోవడం జరుగుతున్నది. ఉమ్మడి కుటుంబాలు విడిపోయాక అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లలో ఆర్ధికంగా బలవంతులైన వారు తమ సొంత కుటుంబంలోని బలహీనులను దూరంగా పెట్టే జాడ్యం ప్రారంభం అయింది. డబ్బున్న బంధువులకు ఒకరకమైన మర్యాదలు, డబ్బులేని బంధువులకు మరొకరకమైన మర్యాదలు జరిపే ఆచారం మొదలైంది. ఒకే ఇంట్లో పుట్టినప్పటికీ, అంతస్తుల మధ్య తేడా పెరిగాక సొంతవాళ్ళం అన్న మమకారం నశించి మనం మనం బంధువులం అని చెప్పుకోవడం మొదలు పెట్టారు. డబ్బులేని బంధువులు మన ఇంటికి వస్తున్నారంటే వారు మనలను అప్పు అడగడానికి వస్తున్నారు అని తప్పుడు అంచనాలు వేసుకుంటున్నారు.

ఇక సొంత అన్నదమ్ములైనా, అక్కాచెల్లెళ్ళే అయినా, ఏవైనా ఫంక్షన్స్ ఉంటె తప్ప కలుసుకోవడం లేదు. మామూలుగా వెళ్లి చూడటం, పలకరించడం అనేది తగ్గిపోయింది. ఆ ఫంక్షన్స్ కు కూడా భోజనాలకు గంట ముందుగా వెళ్లడం, భోజనాలు అయ్యాక వెంటనే "పనులు ఉన్నాయి" అని వంక చెప్పి వెళ్లిపోవడమే చాలా గృహాల్లో చూస్తున్నాము. మనుషుల మధ్య ఆత్మీయత అనేది చాలా అరుదుగా కనిపిస్తున్నది.

సంవత్సరానికి కనీసం పన్నెండు సార్లైనా ఒకరినొకరు కలుసుకుని ఒకరి ఇళ్లలో మరొకరు భోజనాలు చేసుకుని కాసేపు కబుర్లు చెప్పుకుని వీలయితే ఆ రాత్రికి అక్కడే ఉండే పద్ధతులు పాటించే కుటుంబాల్లో కాస్తో కూస్తో బంధాలు అనేవి కనిపిస్తున్నాయి. అలా కాకుండా ఏవైనా ప్రత్యేక ఫంక్షన్స్ లో మాత్రమే కలుసుకుని, కేటరింగ్ భోజనాలు చేసేసి వెళ్లిపోయే కుటుంబాల్లో బంధాలు గట్టిగా ఉండవు. వందలమంది అతిధులు హాజరయ్యే వేడుకల్లో ప్రత్యేకించి ఏ ఒక్క దగ్గరి బంధువునొ, తోబుట్టువులనో ప్రత్యేకంగా మర్యాద చెయ్యడం, వారితోనే కూర్చుని ముచ్చట్లు చెప్పడం అనేది జరిగే పని కాదు.

అందుకే ఎలాంటి వేడుకలు లేకపోయినా, కనీసం నెలకొక్కసారైనా ఒకరితో ఒకరు కలుసుకుని సాదాసీదా ఆత్మీయ భోజనం చేసి ఆనందంగా వెళ్లిపోవడం బంధాలను బలంగా ఉంచుతాయి. చాలామంది మాకు టైం లేదు అని సాకులు చెబుతుంటారు. ఏడాదికి వందరోజులు సెలవులు ఉన్నాయి మనకు. లేనిదల్లా ఆత్మీయతలు...బంధాలను పటిష్టంగా ఉంచుకోవాలి అనే కోరికలు!
అన్నం అనేది మనమధ్య మానసిక బంధాలను సుదృఢంగా నిలిపి అజరామరం గావించే అమృతం లాంటిది.🙏

సేకరణ 🙏

సేకరణ

*ఎంత సేపు పూజ?* *పూజ గదిలో - 30 నిమిషాలు* *బయట - 23 గంటల 30 నిమిషాలు*

ఎంత సేపు పూజ?

పూజ గదిలో - 30 నిమిషాలు

బయట - 23 గంటల 30 నిమిషాలు
ॐॐॐॐॐॐॐॐॐॐ


1) ఏది పూజ? ఎంత సేపు పూజ?

2) ఎక్కడ చూస్తావు ఈశ్వరుణ్ణి?

3) నిద్ర లేవగానే -
i) శ్రీహరి గుర్తుకు రావాలి
ii) భూమికి నమస్కరించాలి
iii) అరచేతిలో లక్ష్మీదేవిని చూడాలి

4) స్నానం చేస్తుంటే గంగా/యమునా నదులు గుర్తుకు రావాలి.

5) దేవుడి దీపం వెలిగించేటప్పుడు - జ్యోతి స్వరూపుడైన పరమాత్మ గుర్తుకు రావాలి.

6) కూరగాయలు/పండ్లు చూసినప్పుడు వరుణ దేవుడు గుర్తుకు రావాలి.

7) వంట చేస్తుంటే అగ్ని దేవుడు గుర్తుకు రావాలి.

8) అన్నం తింటుంటే, కడుపులో ఉన్న వైశ్వానరుడు గుర్తుకు రావాలి.

9) మంచి నీళ్ళు త్రాగెటప్పుడు, జల రూపంలో ఉన్న శివుడు గుర్తుకు రావాలి.

10) ఊపిరి తీస్తుంటే, గాలిలో వాయు రూపమైన శ్రీకాళహస్తీశ్వరుడు గుర్తుకు రావాలి.

11) పసి పిల్లలను, స్త్రీలను చూసినప్పుడు విష్ణుమాయ గుర్తుకు రావాలి.

12) వృద్ధులను చూసినప్పుడు జీవితం యొక్క పరమార్థం గుర్తుకు రావాలి.

13) కనిపించే ప్రతీ స్త్రీలో అమ్మవారు గుర్తుకు రావాలి.

14) విశ్వాన్ని చూసినప్పుడల్లా విశ్వనాథుడు గుర్తుకు రావాలి.

15) నిద్ర పోయేటప్పుడు, స్వల్ప కాలిక లయం చేసే పరమ శివుడు గుర్తుకు రావాలి.

అంతటా పరమాత్మ కనిపిస్తున్నప్పుడు - నువ్వు నిజమైన పూజ చేశావు అని గుర్తు.🙏

--రాజారావు హిందూ

Source - Whatsapp Message