Thursday, September 2, 2021

కోపం

🙏 కోపం 🙏 కోపం అనేక మానసిక, తత్ ద్వారా శారీరక,ఆర్థిక సమస్యలకు మూలకారణం అవుతుంది. మరి కోపానికి ప్రధాన కారణం ఆహారం,వ్యవహారం అని అర్దం చేసుకోలేక పోతున్నాం.కాస్తా గమనిస్తే మనకు అర్దం అవుతుంది.నాకు కోపం వస్తే నేనేమీ చేస్తానో నాకే తెలీదు అని కొందరు,వాడికి కోపం వస్తె మనిషి కాదు, రాక్షసుడు అవుతాడు అని ఇలా అనేక రకాలుగా కోపం గురించి వాఖ్యానాలు చేయడం,వినడం చూస్తాం.నిజమే కోపం వస్తె మనిషి మనిసికాదు.ఇది నిజంగా నిజం.కోపం ద్వారా అనుబంధాలను, బంధాలను కోల్పోతారు.కోపం కోటి సమస్యలకు మూలకారణం.ఇది అందరికీ తెలుసు. కానీ దీనికి అసలు మూల కారణం మనం తీసుకునే ఆహారం,వ్యవహారం అని గుర్తించడంలేదు.ఇంతటి స్థితి నుండి బయటపడే ఏకైక మార్గమే ధ్యానం.ఖర్చు లేకుండా,శ్రమ లేకుండా,వ్యయప్రయాసలకు తావులేకుండా వున్న చోటనే వుండి రోజూ కొద్ది సేపు ధ్యానం, మరికొద్దిసేపు మౌనం,శుద్ధ సాత్వికాహారం, శాకాహారం తీసుకుని జీవిత స్థితిగతులనే పూర్తిగా మార్చుకోవచ్చు.ప్రయత్నిద్దామా మరి ఈ రోజే ఇప్పుడే.
🙏🙏🙊🙉🙈

చెడు అనకు,చెడు వినకు.చెడు కనకు ( చూడకు ) ఒక్క 40 రోజులలో ఫలితాన్ని చవి చూస్తాం.

Source - Whatsapp Message

No comments:

Post a Comment