భోజరాజు ఆస్థానానికి ఒక పండితుడు వచ్చాడు. అతను.. మహారాజా! మా ఇంట్లోని గ్రంథాలు
చూస్తూ వుంటే ఈ విచిత్ర మైన శ్లోకం కనిపించింది నాకు అసలు అర్థం కాలేదు. మీ సభలో కాళిదాసు,భవభూతి లాంటి మహా కవులున్నారు కదా!వారేమైన చెప్పగలరేమో నని వచ్చాను.
ఆ శ్లోకం యిది.
"ప్రాతఃకాలే స్త్రీ ప్రసంగేన
మధ్యాహ్నే ద్యూత ప్రసంగితం
రాత్రౌ చోర ప్రసంగేన
పునర్జన్మ న విద్యతే (కాలో గచ్ఛతి ధీమతాః పాఠా౦తరము.)
అర్థము:--ప్రోద్దునపూట స్త్రీ లను గురించి,మధ్యాహ్నం జూదము గురించి రాత్రి దొంగల గురించిన ప్రసంగము చేసిన పునర్జన్మ వుండదు.(ఇటువంటి మంచి విషయాలతో పండితులులు కాలం గడుపుతారు.).
. ఇదేమి విచిత్రమైన శ్లోకం .
రాజు కాళిదాసు వైపు చూశాడు. కాళిదాసు లేచి ఆ శ్లోకం అర్థము యిలా వివరించాడు.
ప్రాతః కాలములో రామాయణము లోని సుందరకాండ పారాయణం చెయ్యాలి. సుందరకాండలో హనుమంతుడు
రావణుడి అంతఃపురము లో చూసిన స్త్రీల వర్ణన, సీత వద్దవున్నరాక్షస స్త్రీలు
ఆవిడను బెదిరించిన ప్రసంగాలు వున్నాయి. అందుకని అది స్త్రీ ప్రసంగము.
ఇక మధ్యాహ్నం ధర్మరాజు రాజూదమాడటం రాజ్యాన్ని కోల్పోవడం వున్న మహాభారతం లోని భాగాలను చదవాలి.
రాత్రి పూట నవనీత చోరుడైన కృష్ణుని బాల్య క్రీడలు వున్న
భాగవతం లోని ఆ భాగాలను చదవాలి..
ఈ విధంగా చేసిన వారికి పునర్జన్మ వుండదు.
(ఇటువంటి గ్రంథాలు చదవటం తో ధీమంతులకు,కాలం గడిచిపోతుంది)
అని దీని అర్థము.అని వివరించాడు.కాళిదాసు.
భోజరాజు, సభికులు హర్ష ధ్వానాలు చేశారు. ఆ పండితుడికి తగిన పారితోషికం యిచ్చి పంపించాడు భోజరాజు.
-
సేకరణ

No comments:
Post a Comment