Friday, October 15, 2021

మనం నిత్యం దైవాన్ని కోరిక ఎలా కోరుకోవాలి. గమనించండి, పిల్లలకు నేర్పించండి.

🙏శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మనం నిత్యం దైవాన్ని కోరిక ఎలా కోరుకోవాలిగమనించండి, పిల్లలకు నేర్పించండి.🙏🙏🙏🙏🙏🙏🙏
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

1.నువ్వు బతికి ఉన్నంత కాలం ధార్మిక కార్యాలు నీ సంపదతో చేయాలి అని కోరుకోవాలి, అంటే ఎప్పుడూ నువ్వు ఇచ్చే స్థితిలో ఉండాలి అని అర్థం అంటే ఎప్పటికీ నీకు సంపాదన ఉంటుంది.

2.
నా ఇంట్లొ దైవానికి నిత్య నైవేద్యం ఉండాలి అని కోరుకోవాలి అంటే నీ ఇంట్లో ధాన్యం ఎప్పుడూ నిలువ ఉంటుంది.

3.
నా ఇంట్లో నేను నిత్య పూజ రోజు చేయాలి అని కోరుకోవాలి అంటే నీ ఆరోగ్యం బాగుంటే నువ్వు ఎప్పుడూ ఆనందంగా ఉంటే నీ ఇంట్లో నిత్య పూజ చేస్తావు.

4.
నా ఇంటికి ఎవ్వరు వచ్చినా.. కడుపునిండా భోజనం చేసి వెళ్ళాలి అని కోరుకోవాలి. అంటే నీకు అనుకూల వతి అయిన ధర్మపత్నీ (పతి) భాగస్వామి అవుతుంది.

5.
నేను నా చివరి దశ వరకు నీ క్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే నీకు సంపూర్ణ మైన ఆరోగ్యాన్ని ఇవ్వమని అడగటం.

6.
భాగవతులతోఅనగా..! భజనలతో నీ గడప నిండుగా ఉండాలి అని కోరుకోవాలి అంటే నీకు సమాజంలో తగిన గౌరవం మంచి పేరు రావాలి అని కోరు కోవడం.

7.
కుటుంబం అంతా సంతోషం గా క్షేత్ర దర్శనంకి రావాలి అని కోరాలి అంటే నువ్వు ఆరోగ్యంగా,ఆర్ధికంగా, కుటుంబం లో అన్యోన్యంగా ఉంటేనే కదా.. అంతా జరుగుతుంది, ఇంక ఏమికావాలి ఈ మానవజీవితానికి.

8 చివరిగా నేను పండు ముత్తైదువుగా సంతోషంగా కాలం చేయాలి అని కోరుకోవాలి అంటే భర్తకు సంపూర్ణ ఆయువు ఆరోగ్యం కోరుకోవడం..
9)*మనకు తల్లిదండ్రులు ఆ దైవమే, కనుక వారిని కాక, మరి ఇంకెవరిని అడుగుతాము.కానీ.. ఆ అడిగే కోరిక అందరకూ ఆనందం ఇచ్చేలా ఉంటే ఆ దైవం కూడామనలను అనుగ్రహిస్తుంది.
🌹🌹శుభంభూయాత్.🌹🌹

సర్వోజనా సుఖినోభవంత్
👍👍👍👍👍👍👍👍👍👍

సేకరణ

No comments:

Post a Comment