నేటి మంచిమాట.
సంత్రుప్తి.
సంపదకు సరిహద్దు పెట్టుకోనపుడు,లేనపుడు,సంపద శాశ్వతం కానపుడు, సంతృప్తిగా ఎలా వుండ గలుగుతాం.
సంపద,సంపద,సంపద ఈ సంపద కోసమే అంతా ఆందోళనేఅలజడే.అదే రోగం అని గ్రహించలేమా! అంత అమాయకులమా?
సంతృప్తి లేనపుడు సంతోషం ఎలా వస్తుంది,ఆనందం ఎక్కడ దొరుకుతుంది.అసలు ఆ మాటకొస్తే ఎంతో కొంత వుంటానికీ తింటానికీ లేనంత హీనంగా ఎంత మంది వున్నామండి మన సమాజంలో? ఈ సృష్టిలో ఏ జీవి అయినా తినటానికి ఆహారం లేక చనిపోయిన సందర్భాలు ఎన్నో ఆలోచించండి.
ఎంతో పురాతన సనాతన,సునాతన ధర్మం గల దేశం కదా మనది.దాదాపు ఓ పది సంవత్సరాలపాటు మన రైతు ఒక్క బస్తా ధాన్యం పండించక పోయినా సరిపడే ఆహార ధాన్యాలు మన దగ్గర వున్నాయి అని మన పాలకులు అంటున్నారు కదా..
నిర్దారణ కొరకు మన ఇరుగు పొరుగు వారిని కానీ,మన బంధు మిత్రులను గానీ, ఎవరినైనా పలకరించి చూడండి..
ఏం చెపుతారంటే విఠలాచార్య సినిమా లాగా భయంగా రాంగోపాల్ వర్మ దయ్యం సినిమా లాగా గజిబిజిగా గందరగోళంగా ఆందోళనతో చెపుతారు.
కానీ ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా రాఘవేంద్రరావు గారి సినిమాలా రంజుగా వుందని కానీ,దాసరి గారి సినిమాలా దర్జాగా వుందని కానీ చెప్పలేని నిస్సహాయంగా వుంటున్నారు. అంటే అంతా అసంతృప్తే.
చాలదు కావాలి కావాలి అని అంటున్నారు అంటే లేదు అనేగదా అర్థం.
ఈ సత్యం అర్దం అయ్యేవరకు ఉంటామో లేదో తెలియదు కానీ వున్నన్నాళ్లు రాజులాగా మహారాజులాగా రారాజులాగా దర్జాగా ఖుషీ ఖుషీ గా బ్రతకలేమా? ఒక్కసారి ఆలోచించండి.
అలా అన్నారని చుక్కా ముక్కా అనుకోవద్దండి. ధ్యానం,మౌనం, శాకాహారం సాత్వికాహారం మితాహారం శ్వాస మీద ద్యాస ధ్యానం అని అర్థం చేసుకోండి.
శుభోదయం తో మానస సరోవరం 🙏🙏🙊
సేకరణ

No comments:
Post a Comment