Friday, October 15, 2021

లాల్ బహూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా

లాల్ బహూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా

1965లో అప్పటి పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ ఆయుబ్ ఖాన్ వత్తిడి వల్ల అప్పటి అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్ పై భారత్ యుద్ధం చేయడం ఆపకపోతే... భారత దేశానికి పంపవలసిన ఏర్రగొదుమల ఎగుమతి ఆపేస్తాం అని బెదిరించారు...
దానికి విరుగుడుగా లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలను వారానికి ఒకపూట భోజనం మానడంవల్ల అమెరికా నుంచి గోధుమల దిగుమతి భారాన్ని తగ్గించుకోవచ్చు అనిపిలుపు నిచ్చారు...
అయితే అలా దేశ ప్రజలకు పిలుపు ఇవ్వడానికి ఒకరోజు ముందు ఆయన తన భార్యతో "ఈరోజు రాత్రికి మన ఇంట్లో వంట చేయవద్దు... ఈరోజు నుంచి ఇంట్లో అందరం వారానికి ఒకపూట ఉపవాసం ఉందాము అని చెప్పారు... అలా ఆయన ముందుగా తన కుటుంబ సభ్యులను తయారు చేసి ఆ తరువాతే దేశ ప్రజలను వారంలో ఒక పూట ఉపవాసం చేసి, ఆ ఆహార పదార్థాలను భారత సైన్యానికి ఒక్కపూటకుడ ఉపవాసం లేకుండా చేయవలసిందిగా పిలుపు నిచ్చారు...
ఆయన పిలుపుతో అప్పటినుంచీ భారత దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ప్రతి శనివారం రాత్రిపూట ఉపవాసం చేయడం మొదలుపెట్టారు...
మరునాడు ఆ ఆహారపదార్థాలను నవోదయ సభ్యులు డబ్బాలలో కలక్ట్ చేసి, వాటిలో 30% వాళ్ళు ఉంచుకొని, మిగిలిన 70% దగ్గరలో ఉన్న ఆర్మీ డిపోలకు చేరవేసేవాళ్లు...

నా చిన్నతనంలో ఆడబ్బాలు తెచ్చేవాళ్లను చూసాను...

ఇది నాకు ఒక జ్ఞాపకం....

శివాజీ, న్యాయవాది, విశాఖపట్నం.

సేకరణ

No comments:

Post a Comment