Tuesday, November 16, 2021

నేటి మరొక మంచిమాట. నిత్య సత్యం.

నేటి మరొక మంచిమాట.
నిత్య సత్యం.

వచ్చిందీ తెలియదు పోయేదీ తెలియదు వచ్చిపోయేది మాత్రం సత్యం. నిత్యం మనం చూసే సత్యమే ఇది.ఇది తెలిసి కూడా నేను శాశ్వతం అన్నట్లుగా వుంటే తెలిసి కూడా తప్పు చేస్తున్నట్లే కదా!

ఇంకా విచిత్రం ఏమంటే 60 + లోకి వచ్చినా మారటం లేదంటే ఎలా?. ఇది ఆరోపణ కాదండి విశ్లేషణ. మారాలా లేదా అనేది ఆలోచిద్దాం.

అనుక్షణం మారే ఈ సృష్టిలో ఆనందంగా జీవించాల్సిన మనిషి అజ్ఞానంలో జీవిస్తూ ఎంతున్నా సంతృప్తి లేకుండా ఇంకా ఇంకా అని పరిగెడుతూ సమయం వృదా చేసుకుంటున్నాడు. అవునా కాదా కాస్త గమనిస్తే తెలుస్తుంది.

చేతులారా తెలిసి తెలిసి సమస్యలను ఆహ్వానించటం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. నేటి సమాజంలో సమస్యల నైనా భరిస్తున్నాం కానీ మారటానికి ప్రయత్నించడం లేదు.

పంట చేను పాడు చేస్తున్నాయని పశువులకు మూతికి చిక్కం పెట్టినట్టుగా అందరికీ ఆ సృష్టికర్త కరోనా రూపంలో నోటికి చిక్కం పెట్టాడు చివరి ప్రయత్నంగా. అవునో కాదో ఎవరికి వారే ప్రశ్నించుకుందాం (ఎక్కడ చూసినా ఆస్పత్రులు రోగులు).

ఇప్పటికే మొదటి వేవ్ రెండో వేవ్ దిగ్విజయం. మూడో వేవ్ రెడీ టూ అటెంక్షన్ అని ప్రపంచం కోడై కూస్తుంది.

అందుకే నిర్లక్ష్యాన్ని వదిలి లక్ష్యాన్ని ఎంచుకుని మాంసాహారం మానేసి శాకాహారం తీసుకుని థ్యానం చేస్తూ హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా దర్జాగా జీవిద్దాం. అమాయకులని మెల్కొల్పుదాం. మన ధర్మం మనం నెరవేర్చుదాము.

ప్రయత్నంలో ఒడిపోవద్దు. పట్టుదలగా ప్రయత్నిద్దాం ప్రగతి పథంలో పయనిద్దాం. థ్యాన జగత్ సాకారం చేద్దాం!

శుభోదయం చెప్తూ మానస సరోవరం 👏

Source - Whatsapp Message

No comments:

Post a Comment