గల్పిక - హాస్యం
పెళ్లాం చెబితే వినాలి!
పెళ్లాల దగ్గర ఉగ్రవాదం పనికిరాదు. భక్తిమార్గమే శరణ్యం. అర్జునుడికి గీతోపదేశం చేసిన కృష్ణుడంతటివాడు సత్యభామ కాళ్ళు పట్టుకోలేదా?
దేవుడా! నాకు కష్టాన్నివ్వు... బాధలనివ్వు.. టెన్షన్నివ్వు' అని నా లాంటి ఓ విరాగి కోరుకుంటే ' ఇదిగో .... నీ కోరికలు తీర్చే సాధనం' అంటూ నీలాంటి ఓ భార్యనిచ్చాడా దేవుడు' అన్నాను. . మా ఆవిడతో ఎద్దేవాగా.
'ఆహా.. మరి ఆ పెళ్ళాన్ని బెటర్ హాఫ్ అని ఎందుకున్నారో మీ మగాళ్ళు? అయినా, అందుబాటులో ఉండేవాటినే ఆమె కోరుకుంటుంది. మహేష్ బాబు జుట్టు ఎంత ముచ్చటగా ఉంటే నాకేంటి.. నా మొగుడి నెత్తిమీది జుత్తు మాత్రం నా గుప్పెట పట్టేంత ఎత్తుంటే చాలని కోరుకునే అమాయకురాలండీ ఆడది! ఆ మాత్రం మీ మొగమూర్ఖులకు అర్ధంకాదు.. అంతే!
... మీకు నేనో తమాషా కథ చెప్పనా? అనగనగా ఓ అందమైన తోటంట' దాన్నిండా పండ్లూ పూలూ... కాయలూ... మంచి మంచి జంతువులూనూ! అయినా ఆమెకు ఏమీ తోచింది కాదు... ఆడుకునేందుకు ఓ జోడునివ్వవా' అని దేవుణ్ణ్ని అడిగితే ' ఇస్తాగానీ.. రెండు షరతులు.. ఆ వచ్చే మగవాడు నీ కన్నా బలంగా... మొరటుగా ఉంటాడు అన్నాడట...
సరే.. మరి రెండో షరతు? అడిగిందా ఆడమనిషి
' వాడు తానే ముందుపుట్టానని... నువ్వు వాడి పక్కటెముకల్నుంచి వచ్చావని గొప్పలు చెప్పుకొంటాడు. నువ్వు వినీ విననట్లు ఊరుకోవాలి మరి' అన్నాడు.
అప్పుడలా ఒప్పుకొన్నందుకే ఆడది మీ మగాళ్ళ మూర్ఖత్వాన్నే కాదు- చపలచిత్తాన్ని కూడా ఇప్పుడు చచ్చినట్లు భరిస్తోంది
మాది చపలత్వమా?
మీదే కాదు. మిమ్మల్ని పుట్టించిన దేవుళ్ళది కూడా ! ఒక భార్యను పక్కన పెట్టుకుని నెత్తిమీదింకో భామను పెట్టుకున్నాడు శివుడు. ఒక పెళ్ళాంచేత కాళ్ళు పట్టించుకుంటూ ఇంకో పెళ్ళాంకోసం అవతార మెత్తాడు ఇంకో మహానుభావుడు . అలికోసం అంత లావు యుద్ధంచేసి అనుమానంతో భార్యను అగ్నిప్ర వేశం చేయమన్నాడు రాముడు. ఆ దేవుడూ మగాడే కదా! బెడ్ కాఫీ దగ్గర్నుంచీ నైట్ బెడ్ ఎక్కేదాకా మొగాడి అవసరాలు తీర్చేందుకే ఆడది పుట్టిందని మీ మగాడిఅహంకారం .
అవునా?
తలొంచుకుని తాళి కట్టించు కుంటుందని ఎగతాళా? పాచిపనిచేసే పనిమనిషికి బట్టలుతికి ఇస్త్రీ చేసే లాండ్రీవాడికి డబ్బివ్వాలి. హోటల్లో కప్పు అన్నం ఎక్కువ అడిగినా అదనంగా బిల్లేస్తాడు. ఉపరి సర్వారాయుడికి దక్షిణ ఇవ్వాలి. మీకూ, మీ పిల్లలకూ సొంత పన్ల కన్నా ఎక్కువ శ్రద్ధతో సేవచేసే ఆడది గడపదాటి లోపలికొచ్చేందుకు మాత్రం లక్షలు లక్షలు కట్నం పోయాలి. ఛ! .. ఆ గోట్ మ్యాన్ మాటన్నా వినకబోతిని?
ఈ గోట్ మేన్ ఎవడు మధ్యలో ? ఏమన్నాడూ ?
మొగుళ్ళు మోటారుబళ్ళులాంటివాళ్ళు. మొదటి ఏడాదే బాగా పనిచేసేది. మొహమాటాలకుపోయి మీ స్వేచ్ఛ పోగొట్టుకోవద్దు! తస్మాత్ జాగ్రత్త! అన్నాడు.
ఓహో.. మాలాగా పేంట్లూ చొక్కాలు వేసుకో వటం, పొద్దుపోయేదాకా బైట తిరిగి ఇంటికిరా పటం... ఇదేనా మేడమ్. . మీ దృష్టిలో స్వేచ్ఛ? దాని స్వాతంత్య్ర అనరు. ఒకరకంగా మగాడి గొప్పతనాన్ని ఒప్పుకొంటున్నట్లే అన్నారు సద్గురు జగ్గీ వాసుదేవ్.
గురువుగారికిప్పుడు సద్గురు గుర్తుకొచ్చారన్నమాట. ఆయనింకా చాలా మంచి మంచి ముక్కలు చెప్పారు స్వామీ! విజయవంతమైన వివాహానికి నమ్ముకోవా ల్సింది పామిస్ట్రీని కాదు. మొగుడూ పెళ్ళాలమధ్య కెమిస్ట్రీని. పెళ్లయితే అబ్బాయి అమ్మాయి ఒకటవుతారు. నిజమే... ఎవరు ఎవరవుతారనేదే అసలు సమస్య . మొగుడూ పెళ్ళాలు సినిమాహాల్లో సీట్లు వంటి వాళ్లు . రెండింటికీ కలిపి ఒక్క రెక్కే ఉంటుంది. సర్దుకుపోవాలి.. తప్పదు ! స్త్రీ పాత్ర లేకుండా నాట కాలు నడుస్తాయేమోగాని, సంసా రాలు నడవ్వు. అలూమగలు ఆలూ కూరిన సమోసాలాగా కలసి ఉండాలి. ఓడి గెలవటమనే విచిత్రసూత్రం ఒక్క భార్యాభర్తల బంధంలో మాత్రమే ఉంటుంది . మొగుడూ పెళ్ళాలు కాటా కుస్తీ వస్తాదులు కాదుకదా! ఇద్దరూ కలిసి ఏడడుగులు వేసిననాడే ఒకటైనట్లు లెక్క. అతను ఆకాశమైతే ఆమె భూమి. అతను వాక్కు అయితే, ఆమె మనసు. అతను బైకు అయితే, ఆమె బైకు వెనక సీటు. పెళ్ళి తంతులో వల్లించే ప్రతి మంత్రానికి ప్రత్యేక ఆర్థ ముంది. అలుమగలనేది సీతారాముల్లాగా ఒక అందమైన ద్వంద్వ సమాసం. అనురాగం ఛందస్సు కుదిరి, సరైన పాళ్ళలో యతిప్రాసలు పడితే పోతన పద్యంలాగా సంసారం హృద్యంగా ఉంటుంది. వేలు పట్టుకుని నడిచి వచ్చిన భార్యను వేలెత్తి చూపే ముందు మగవాడు ఆలోచించాలి. భర్త పేరు చెప్పటానికే సిగ్గుపడే భార్య భర్త సిగ్గుపడే పని ఏనాడూ చేయకూ డదు. పెళ్లంటే... అరె... అప్పుడే నూరేళ్ళూ నిండాయా?' అన్నట్లుండాలి. అలుమగల మధ్య కయ్యం అద్దంమీద పెసరగింజ నిలిచినంతనేపే! వాదులాడుకోకుండా ఉన్నంతసేపే ఆదిదంపతులకైనా ఆరాధన. సీతారాములు విడిపోయిన తదనంతర రామాయణమంతా విషాదమే. చూశారా? మొగుడూ పెళ్లాల పంచాయతీ మధ్య
మూడోమనిషి దూరేదికాదని రాయని రాజ్యాంగ సూత్రం ఒకటి అనాదిగామన సమాజంలో ఉంది.
నిజమేనోయ్ ! అందుకే ఈ మధ్య ఒక విడాకుల కేసులో సర్వోన్నత న్యాయ స్థానం కూడా కలగజేసుకునేందుకు ఇష్టపడలేదు. '
పైపెచ్చు ' పెళ్ళాం చెబితే వినాలి. మేమంతా అదే చేస్తున్నాం ' అని సలహామాత్రం ఇచ్చింది ఫుల్ బెంచీ!
చూశారా! భూమి ఆకర్షణకన్న భామ ఆకర్షణే మిన్న. భూమికి లొంగి నడవంగాలేనిది.. భామకు లొంగి నడిస్తే తప్పేంది ? చదువులమ్మను భార్యగా పొందీ బ్రహ్మదేవుడు తలరాతలు ఇంత తికమకగా ఎందుకు రాస్తున్నాడో తెలుసా ? పెళ్ళాన్ని అడిగి రాయటానికి నామోషీపడి! ... అందుకే అనేది సార్..
పెళ్ళాంచెబితే వినాలని . అంతేగా! ఓకే డార్లింగ్! బుద్ధిగా నడుచుకుంటామిక.. తమరివ్వక ముందే ఇలా వార్నింగ్!
సేకరణ. మానస సరోవరం 👏
సేకరణ

No comments:
Post a Comment